Select Page
Read Introduction to James యాకోబు

 

అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.౹

 

సమస్త కల్మషమును

క్రైస్తవులు పాపమునకు విరోధముగా గొప్ప పోరాటములో ఇన్నారు. అపవాది ఒక వైపు మనలను లాగుతుంటే, దేవుని వాక్యము మోరో వైపు మనలను లాగుతుంది. ఈ లోకపు అపవిత్రత ఇంకనూ క్రైస్తవుని దేవునినిండి దూరముగా లాగుచున్నది. క్రైస్తవుడు తన జీవిత “అపవిత్రత” గురించి చేయవసినది ఒకటి ఉంది – మానుట.

 “సమస్త” అను మూడు అక్షరముల పదమును గుర్తించండి. ఆ మాట యొక్క అన్వయము యొక్క ప్రభావము ఆ పబము యొక్క స్వల్పత మార్చదు. ఎంత చిన్న పాపమును మనము లక్ష్యపెట్టినా, దేవుడు ప్రతిపాపమును తన గుణమును అతిక్రమించినట్లు పరిగణిస్తాడు.

నియమము:

ఏ పాపమైనా దేవునితో మన సంబంధాన్ని పాడుచేస్తుంది.

అన్వయము:

మన ఆత్మను రక్షకుని నుండి వేరుచేయు ఏదైనా దేవునితో మన నడకను పాడుచేస్తుంది. లోకముతో నడుచుట, మరియు దేవునితో నడచుటకు పొంతన కుదరదు. అవి కలసి ఉండలేవు. అందునుబట్టి క్రైస్తవుడు దేవునితో నడచుటకు తన పాపము విషయము వ్యవహరించాలి.   

క్రైస్తవుడు పాపముని చిన్నదిగా తలంచి దానితో కొనసాగలేడు. సంపూర్ణమైన వ్యక్తి తనను తాను రాజీ పడలేడు. పరిశుధ్ధ  దేవుడు పాపముగూర్చి మనతో బేరముచేయలేడు.

ఆదాము స్వబావ కారణముచే మన హృదయాలు కల్మషమును కలిగిఉన్నవి.

హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు? (యిర్మియా 17:9)

లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును. ఈ చెడ్డ వన్నియు లోపలినుండియే బయలువెళ్లి, మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. (మార్కు 7:21-23).

మరోవైపు పరిశుద్దత్మదేవుడు ప్రతి క్రైస్తవునిలో నివసించుచు దేవునితో సంబంధము కలిగిఉండుటకు నూతన సామర్థ్యము కలిగిస్తాడు. పాపము చేయకుండుటకు మనకు స్పష్టమైన సామర్థ్యము ఉన్నది.

Share