అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి.౹
సాత్వికముతో
సాత్వికము కృపతో పొడగబడినది. అది మన జీవితములో పనిచేయు దేవుని కృపయొక్క స్పర్శ. సాత్వీకులు దీనత్వము కలిగిఉంటారు ఎందుకనగా, వారుకలిగిఉన్నవన్నీ, వారికి కృపవలననే కానీ ఏ అర్హత వలన కాదు.
ఈ లక్షణము ముఖ్యముగా దేవునికి ఆపాదిస్తాము, మానవునికి కాదు. మనతో దేవునిఊ వ్యవహారములన్ని మంచివిగా అంగీకరిస్తాము. మనతో దేవుని వ్యవహారమును మనము ఆగ్రహించము. దేవుని చిత్తము ఉత్తమమైనదని విశ్వసించు మానసిక స్థితి.
సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసికొని రావలెను. (గలతి 6:1).
కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. (కొలస్సీ 3:12).
నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి; (1 పేతురు 3:15).
యేసు సాత్వీకుడు.
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. (మత్తయి 11:28-30).
మీ ఎదుట నున్నప్పుడు మీలో అణకువగలవాడనైనట్టియు, ఎదుట లేనప్పుడు మీయెడల ధైర్యముగలవాడనైనట్టియు, పౌలను నేనే యేసుక్రీస్తుయొక్క సాత్వికమును మృదుత్వమునుబట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. (2 కొరిం 10:1).
నియమము:
సాత్వీకము అనునది దేవుని నుండి మనము ఏదియు సంపాదించలేము, పొందుటకు అర్హులము కాదు కానీ ఆయననుండి మనము కలిగిఉన్న సమస్తము తన కృపవలనే అను వైఖిరి.
అన్వయము:
సాత్వీకమైన వ్యక్తి దేవునినుండి దేనిని సంపాదించలేము, పొందుటకు అర్హులముకాము అని ఎరిగిఉంటాడు. దేవుడు తన కృపవలననే తనను వినియోగించుకుంటాడు అని గ్రహిస్తాడు.
ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగ జేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల? (1 కొరిం 4:7)
సాత్వీకుడు నేర్పదగిన వ్యక్తి. దేవుని వాక్యమును సరిగా సంగ్రహించుటకు నేర్పదగిన సామర్థ్యము ప్రాముఖ్యమైనది ఎందుకనగా, ఆ వ్యక్తి తన పాపముల విషయములో యధార్ధముగా వ్యవహరించాలి.
మన విలువలను సరిచేయు మరియు మలచు వైకిరితో దేవుని వాక్యమును అంగీకరిస్తే మన జీవితముపై మంచి ప్రభావము ఉంటుంది. దేవుని వాక్య నియమములను మనము అంగీకరించు సామర్థ్యము ఎంత ఎక్కువగా కలిగి ఉంటే
మన క్రైస్తవ జీవితముపై అంత ఎక్కువ ప్రభావము కలిగి ఉంటుంది.