మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి.
మీరు వినువారు మాత్రమైయుండి.
“ప్రవర్తించువారు”అనగా దేవుని వాక్యమును విని విధేయత చూపించువారు. తన క్రియలు ఒప్పుకోలుమీద ఆధారపడిఉంటాయి. “వినువారుమాత్రము అయిఉండువారు” దేవుని వాక్యముక్రింద నిష్క్రియాత్మకముగా కూర్చుండి తనపై ఏ ప్రభావము లేకయుండును. అది ఒక చెవిలో వెళ్ళి మరో చెవిలో బైటికి వచ్చినట్లు ఉండును. దేవుని సత్యమును మరచిపోయే వ్యక్తిగా దేవుడు పరిగణిస్తున్నాడు.
“వినువాడు” అను మాట స్కూల్ తరగతిలో ఆడిటర్ అను భావన. క్లాస్ లో ఆడిటర్, ఫుల్-టైమ్ విధ్యార్ధికి ఉన్న ఒకే రకమైన భాద్యత కలిగి ఉండడు. క్లాస్ లో పరీక్ష వ్రాయవలసిన విధ్యార్ధి కలిగిఉన్నంత శ్రద్ధగా క్లాస్ లో ఉండడు.
నియమము:
వాక్యమును జరిగించుట నిమగ్నమైన క్రైస్తవునికి గురుతు.
అన్వయము:
కేవలము విను క్రైస్తవుడు తన క్రైస్తవ జీవితముపై శ్రద్ద నిలుపడు. సంప్రదాయక క్రైస్తవ్యాన్ని జీవిస్తాడు కానీ సిసలైన ఆత్మీయజీవితము ఉండదు. జీవిత పరీక్షకొరకు చదువుకొను క్రైస్తవుడు, అప్పుడప్పుడు కేవలము విను క్రైస్తవునికన్నా దేవునివాక్యము నుండి మేలు పొందుతాడు. మనము దేవుని వాక్యమును విన్నప్పుడు ధృడమైన కార్యము చేయుట అను బాధ్యత మనము కలిగి ఉన్నాము.