అయితే స్వాతంత్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.
ఇప్పుడు దేవుని వాక్య నియమమునుండి దూరముగా వెళ్ళు వ్యక్తి నుండి దేవుని వాక్యనియమము వైపు తిరుగు వ్యక్తిగురించి చూద్దాము.
తేరి చూచి
“తేరి చూచు” అను మాటలు ప్రాధమికముగా ప్రక్క వైపు వంగిఛోచుట అను భావన కలిగి ఉన్నవి. ఇదీద్ గమనించుటకు ఉపయోగించు బలమైన పదము, ముందు వచనములో వాడబడిన పదము కన్నా బలమైనది.
అనగా ఏకాగ్రత కలిగే విధముగా దేనినైనా పరీక్షించుటకు వీలైనంత దగ్గరగా చూచుట.
నియమము:
వాక్యము నుండి నియమములను ఏర్పరచుటకు ఏకాగ్రత అవసరము.
అన్వయము:
క్రైస్తవజీవితమునకు ఏకాగ్రత అవసరము. బైబిలు చదువుట ఒకవిషయము, దాని నియమాలను కనుగొనుట మరో విషయము. మన జీవితము పనిచేయు నియమాలను కనుగొనుటకు ఏకాగ్రత అవసరము. మన తరమువారు ఏకాగ్రత కలిగిఉండలేరు గనుక వారు జీవిత నియమాలను కనుగొనలేరు. వారి జీవితనికి పటుత్వమనివ్వని పైపై విషయాలపై వారు జీవిస్తారు.
మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచు కొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మునుగూర్చి మీరే యెరుగరా?౹ 6మేము భ్రష్టులము కామని మీరు తెలిసికొందురని నిరీక్షించుచున్నాను. (2 కొరిం 13:5-6).