నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన విశ్వాసవిషయములో మోమాటముగలవారై యుండకుడి.
నా సహోదరులారా,
తరువాతి వచనములో ఉన్న కార్యాలను గురించి చెబుతున్నను, వారు క్రీస్తునందు తన సహోదురులని వారు తెల్సుకోవాలని యాకోబు తన పాఠకులను సహోదరులుగా సంబోధిస్తున్నాడు (యాకోబు పత్రికలో 15 మారులు – 1:2, 16, 19; 2:5, 14; 4:11; 5:7)
మహిమాస్వరూపియగు
ప్రభువైన యేసు క్రీస్తు “మహిమా స్వరూపియగు దేవుడు”ఎందుకనగా దేవుని మహిమను ఆయనే బయలుపరచును. స్తాయికి, ప్రదేశానికి ఆయన పక్షపాతము చూపకపోవుట ఆయన మహిమాలో ఒక పక్షం. యేసు క్రీస్తు దేవుని పరిపూర్ణత గనుక ఆయన క్రైస్తవునికి మహిమకారకుడు. తండ్రియైన దేవునితో ఆయన సమానుడు, నిత్యుడు. ప్రపంచ సృష్టికి పూర్వమే యేసుఈ మహిమను కలిగిఉన్నాడు (యోహాను 17:5). ఈ మహిమతో ఆయన భువికి ఏతెంచెను.
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి (యోహాను 1:14)
అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసి యుండినయెడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు. (1కొరిం 2:8)
మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన
యేసు క్రీస్తు మన విశ్వాసానికి ఆధారము. వ్యక్తిగా మనము ఆయనపై విశ్వసిస్తాము. మనవిశ్వాసాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వైపు మనము మళ్లిస్తాము.
దేవుని యెదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచ వలెనని, యూదులకును గ్రీసుదేశస్థులకును ఏలాగు సాక్ష్య మిచ్చుచుంటినో యిదంతయు మీకు తెలియును. (అపో. కా 20:21)
విశ్వాసవిషయములో
మనము విశ్వసించినపుడు క్రీస్తుమీద మనము ఉంచిన విశ్వాసము ఇక్కడ సూచించబడలేదు, క్రైస్తవ సంపూర్ణ సత్యము మీద విశ్వాసమును ఇది సూచిస్తుంది. పక్షపాతము క్రైస్తవ సిద్దాంతములో పొసగదు.
మోమాటముగలవారై యుండకుడి.
“పక్షపాతము”ఒకరికంటే మరొకరిని ప్రత్యేకముగా చూచుటను సూచిస్తుంది. అక్షరార్ధకముగా ఒక ముఖమును అంగీకరించుట అని అర్ధము. కొందరు అధికారులకు, గొప్పవారికి ప్రాధాన్యతనిస్తారు. ఇది వ్యక్తి యొక ఆంతరీక విలువకన్నా, బాహ్యరూపము మరియు పరిస్తితికి ప్రాధాన్యతనిస్తుంది. మనము కొందరిపట్ల ఇతరులకన్నా మెరుగుగా వ్యవహరిస్తే, దేవుడు చేయని వ్యత్యాసాలను మనము చేస్తున్నాము.
దేవుడు మనతో సంపూర్ణ నిష్పక్షపాతముతో వ్యవహారిస్తాడు. వారు ధనికులనో లేక జ్ఞానులనో ప్రజలకు ప్రాధాన్యమివ్వడు. ప్లేస్, ఫేస్, గ్రేస్ లేక రేస్ కి ప్రాధాన్యతనివ్వడు. తన స్వంత పరిమాణముతోనేగాని మరిదేనితో మనలను వర్గీకరించడు.
తీర్పు తీర్చునప్పుడు అల్పుల సంగతిగాని ఘనుల సంగతిగాని పక్ష పాతములేకుండ వినవలెను; న్యాయపుతీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠినవ్యాజ్యెమును నాయొద్దకు తీసికొని రావలెను; నేను దానిని విచారించెదనని వారికాజ్ఞాపించితిని. (ద్వితి 1:17)
ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. (ద్వితి 10:17)
యెహోవా భయము మీమీద ఉండునుగాక; హెచ్చరికగానుండి తీర్పు తీర్చుడి; మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు, ఆయన పక్షపాతికాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు. (2దిన 19:7)
నియమము:
తన సంబంధాలలో నిజక్రైస్తవుడు పక్షపాతము చూపడు.
అన్వయము:
ఒక క్రైస్తవుడు మరో క్రైస్తవుని చిన్నచూపు చూస్తే దేవుని మహిమా యొక్క స్వభావమును ఉల్లంఘిస్తున్నాడు. దేవుడు పైరూపాన్నిబట్టి తీర్పు తీర్చడు. ఒకరికంటే మరొకరికి ప్రత్యేక మేలులు చేయడు. ఇతరులపై ఆయన తీర్పు బాహ్యమైనది కాదు, వారి నిజ స్వభావము గురించి ఆలోచన లేకుండా ఉండదు.
మన ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసములేనివారు జీవితముపై తాత్కాలిక ధృక్పధము కలిగిఉంటారు. ప్రతిదానిని జాతి, ప్రాంతము, ముఖము, వర్ణము వంటి వాటినుండి ప్రతిదానిని చూస్తారు. దేవుని లెక్కలో ఇవన్నీ బాహ్యసంబంధ విలువలు. క్రైస్తవుడు ప్రతిఒకరిని దేవునితోఉన్న తన సంబంధమునుండి చూస్తాడు.
–అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను. (1కొరిం 1:31)
వారి నిజస్థితినిబట్టికాక వారి బాహ్య రూపమును బట్టి మనము ప్రజలకు తీర్పు తీరుస్తాము. వారి బట్టలను బట్టి, వాహనాలను బట్టి, గృహమును బట్టి వారిని పరిగణిస్తాము.
ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే –న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపు ధర్మము కాదు (సామెతలు 24:23)
పక్షపాతము చూపుట మంచిది కాదు, రొట్టెముక్కకొరకు ఒకడు దోషముచేయును.(సామెతలు 28:21)