Select Page
Read Introduction to James యాకోబు

 

నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్య వంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా?౹

 

నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి

తనకు ప్రియమైన పాఠకులు పేదవారి పట్ల దేవుని ధృక్పధమును గుర్తించవలెనని యాకోబు బలముగా బ్రతిమాలుచున్నడు. పేదలను అగోరవపర్చడము దేవునిని, పెదలైన వారిపట్ల దేవుని ప్రణాళికను అగౌరవపర్చడము.   ఈవిషయము పై వారు శ్రద్ధనిలుపవలెనని యాకోబు కోరిక. ఇది పేదలుకాని వారై, తక్కువ శ్రద్ధకలిగిన ఒక వర్గము. “ఆలకించుడి” అనుసరించవలసిన ముఖ్యమైన నియమాన్ని ఒక్కానిస్తుంది.

ఈ లోక విషయములో దరిద్రులైనవారిని …. దేవుడేర్పరచుకొనలేదా?

 “దరిద్రులైనవారిని … దేవుడేర్పరచుకొనలేదా ?” అను ప్రశ్న గ్రీకు భాషలో అవును అను జవాబును కోరు విధముగా ఉన్నది. పెదలైనవారిని రక్షించుటకు దేవుడు ముందడుగు వేశాడు. ఇది అనుకోకుండా జరిగినవిషయమూకాడు, దేవుని అనాది సంకల్పములోనే జరిగినది. పెదలైనవారు ఆయనను ఏర్పర్చుకోలేదు, ఆయనే వారిని ఏర్పరచుకున్నాడు. కేవలము లోకము పరిగణలో వారు పేదలే కానీ దేవుని అభిప్రాయములో కాదు.           

మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. (1కొరిం 1:9)

సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైనవారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేనివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు (1కొరిం 1:26-29)

ఈ వచనములోని “దరిద్రులు” ఆధ్యమికముగా కాదు, ఆర్ధికముగా దారిద్ర్యములో ఉన్నవారు. దేవుడు నిత్యత్వములోని భూతకాలములో ఆర్ధికపరమైన పేదవారిని ఏర్పరచుకున్నాడు. ఈ ఏర్పాటులో పేదవారు ఘనతను పొందిఉన్నరు. పేదవారిని అగౌరవపరిస్తే, దేవుడు వారిని ఏర్పరచుకున్న ప్రణాళికను అగౌరవపరచినట్లే. 

బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు.

ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. (సామెతలు 17:5)

మేము బీదలను జ్ఞాపకము చేసికొనవలెనని మాత్రమే వారు కోరిరి; ఆలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి యుంటిని. (గలతి 2:10)

నియమము:

పేదలపై పక్షపాతము, దేవుని ప్రణాళికపై పక్షపాతము చూపడమే.  

అన్వయము:

క్రైస్తవులందరు ఒకేరకమైన నూతన స్వభావము కలిగిఉంటారు. దానిని బట్టి వారు ఒకే కుటుంబముగా సమాన గౌరవముకు అర్హులుగా చేస్తుంది.   

బీదలను కటాక్షించువాడు ధన్యుడు

ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. (కీర్తనలు 41:1)

నీ సమూహము దానిలో నివసించును

దేవా, నీ అనుగ్రహముచేత దీనులకు సదుపాయము

కలుగజేసితివి. (కీర్తనలు 68:10)

Share