స్వాతంత్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పుపొందబోవువారికి తగినట్టుగా మాటలాడుడి; ఆలాగుననే ప్రవర్తించుడి.
12 మరియు 13 వ వచనాలలో ఇతరులపై పక్షపాతం పాటించే వారిపై దేవుని తీర్పును గూర్చిన మనవితో, యాకోబు పక్షపాతమును గూర్చిన విషయమును ముగించాడు.
తగినట్టుగా మాటలాడుడి; ఆలాగుననే ప్రవర్తించుడి.
“ఆలాగుననే” అను మాట నియమమును మన జీవితములో ఎలా అన్వయించుకొనలెనని కోరుచున్నాడో, తెలుపుచున్నది. “ఆలాగుననే” అను మాట, ఈ అధ్యాయములోని మొదటి 11 వచనములను ఎలా గ్రహించాలో మరియు అన్వయించుకోవాలో సూచించుచున్నది.
“మాటలాడుడి” అనునది మన నోటిని ఎలా ఉపయోగిస్తామో దానితో సంబంధం కలిగి ఉంటుంది. నాలుకతో చేయు పాపాలకు మనం దాన్ని ఉపయోగించవచ్చు లేదా ఇతర క్రైస్తవులను బలపరచడానికి దాన్ని ఉపయోగించవచ్చు.
పక్షపాతం విషయానికి వస్తే, క్రైస్తవులు క్రైస్తవ సూత్రాల ఆధారంగా మాట్లాడాలి మరియు పనిచేయాలి. క్రైస్తవుడు పక్షపాతంతో జీవిస్తూ మరియు అదే సమయంలో స్థిరమైన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించగలడు. దేవుని సూత్రాలకు పూర్తి అనుగుణ్యత క్రైస్తవ జీవిత విధానము. మాటలు మరియు చర్యలు రెండూ దేవుని దృష్టిలో లెక్కించబడతాయి.
నియమము:
మనము ప్రకటించు దానిని పాటించుట దేవుని కోరిక.
అన్వయము:
మనం చెప్పేది మరియు చేసేది దేవుని లెక్కలో స్థిరంగా ఉండాలి. మేము నోరు తెరిచిన ప్రతిసారీ, మన క్రైస్తవ్యానికి అనుగుణంగా ఉన్న పదాలను పలకాలి.
తన నోటిని ఎలా నియంత్రించుకోవాలో ఎరిగి ఉండుట ఎదుగుతున్న క్రైస్తవుని లక్షణం. అతను నాలుక ద్వారా జరుగు పాపాలను నివారించగలడు. మనలో కొందరు మన నోటి ద్వారా హత్య చేయవచ్చు. నాలుక ఉపయోగించడానికి సులభం గనుక అది మరింత ప్రబావవంతముగా ఉంటుంది. మన నోటిని పాపయుక్తముగా ఉపయోగించకుండుటకు ప్రేమతో కూడిన క్రమశిక్షణ అవసరం.
స్వాతంత్యము ఇచ్చు నియమముతో మన మాటలే కాదు మన క్రియలు కూడా నియంత్రణలో ఉండాలి.