Select Page
Read Introduction to James యాకోబు

 

కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును; కనికరము తీర్పును మించి అతిశయపడును.

 

కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును

ఇతరులకు దయ చూపించడానికి నిరాకరించిన వ్యక్తికి దేవుడు దయ చూపడు. తోటి విశ్వాసులకు పక్షపాతం చూపించే వారిపై దేవునికి దయలేదు. స్వార్థపూరితమైన జీవితాన్ని గడిపే వ్యక్తికి మరియు ఇతరులపై దయ చూపని వ్యక్తికి  దేవుడు తీర్పు  తీరుస్తాడు.

నియమము:

దేవుని కరుణ, కరుణ లేనివారికి అంతిమంగా విస్తరించదు.

అన్వయము:

వివక్ష కరుణ లేకపోవడాన్ని ప్రదర్శిస్తుంది. మనం నిరంతరం ఇతరులకు దయ చూపించకపోతే, దేవుడు తన దయను భూమిపై నిరవధికంగా పొడిగించడు. మనం ఇప్పుడు దేవుని నుండి దయను ఆశించినట్లయితే, ఇప్పుడు మనం దయ చూపాలి.

దేవుడు పూర్తిగా నిష్పాక్షికంగా ఉన్నందున, మనం పూర్తిగా నిష్పాక్షికంగా ఉండాలని ఆయన ఆశిస్తాడు. నిష్పాక్షికతతో జీవించే వ్యక్తి నిస్వార్థ వ్యక్తి. మనం దయతో జీవిస్తే, దేవుడు దయ ద్వారా మనకు ప్రతిఫలమిస్తాడు. ఇతరుల పట్ల దయతో జీవించడంలో ఇది ఒక ముఖ్యమైన పని.

Share