నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా?
నా సహోదరులారా
యాకోబు రోమా సామ్రాజ్యమంతటా చెదరిన యూదులైన క్రైస్తవులకు వ్రాయుచున్నడు. (1:1)
ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినయెడల
చురుకైన, చైతన్యవంతమైన విశ్వాసం ఉందని చెప్పుకుంటూ వాస్తవానికి మృతమైన క్రైస్తవ విశ్వాసం గల వ్యక్తి యొక్క పరికల్పన గూర్చి యాకోబు ప్రస్తావిస్తున్నాడు. అతను ఒక క్రైస్తవుడు, కానీ అతని క్రైస్తవ విశ్వాసము అతని దైనందిన జీవితంలో పెద్దగా ప్రభావం చూపడంలేదు. ఈ వ్యక్తి సనాతన ధర్మాన్ని పేర్కొన్నాడు కాని “తగిన కార్యములు” కలిగి లేడు. చాలా మందికి ఒక విశ్వాసము ఉంది, కానీ ప్రవర్తన లేదు. వ్యక్తి యొక్క విశ్వాసం యొక్క నిజమైన ఫలం అనుభవానికి సత్యాన్ని వర్తింపజేయడము.
మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.౹ 9అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.౹ 10మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము. (ఎఫెస్సీ 2:8-10)
క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినయెడల
క్రియలు లేకుండా తనకు విశ్వాసం ఉండవచ్చని చెప్పుకునేవారు, క్రైస్తవ విశ్వాసము యొక్క సూత్రాలను క్రైస్తవ విశ్వాసము యొక్క అనువర్తనం నుండి తొలగించినవారవుతారు. తాము ప్రజలను ప్రేమిస్తున్నారని చెప్పుకుంటూ వారికి కనికరము చూపని వారు కలరు. వారు సమాజంలో తక్కువ ఆర్థిక స్థాయిలగలవారిపై వివక్ష చూపుతారు. ఇది విశ్వాసం మరియు కార్యముల విచ్ఛిన్నం. నిజమైన క్రైస్తవ్యములో మనమేమి చేస్తున్నాము మరియు మనము ఏమైఉన్నాము అను వాటి మధ్య స్థిరత్వం ఉంటుంది. మనం చేసేది మనం ఎవరో అనేదానిని తెలుపుతుంది.
నియమము:
నిజమైన క్రైస్తవ విశ్వాసము మనం చెప్పే మరియు చేసే పనుల మధ్య అనుగుణ్యత కలిగి ఉంటుంది.
అన్వయము:
కేవలము ఏ విశ్వాసం అయినా మృతమైన క్రైస్తవ జీవితం నుండి ఒక వ్యక్తిని విడిపించలేదు, దేవుని వాక్య సూత్రాలపై కీలకమైన, చైతన్యవంతమైన నమ్మకం మాత్రమే చేయగలదు. కేవలము మాటలు కలిగి మరియు కార్యములు లేనిది క్రైస్తవ జీవితం కాదు.
మనం చేసే పనిలో ఆ విశ్వాసం యొక్క అభివ్యక్తము లేని విశ్వాసం మృతమైన విశ్వాసం. మనకు క్రియాశీల విశ్వాసం ఉండాలంటే నియమము మరియు అనువర్తనం తప్పనిసరిగా ఏకగ్రీవముకావాలీ. అనువర్తనం లేని నియమము అసంపూర్ణ నియమము. అసంపూర్ణ నియమములో లాభం, విలువ లేదు. దేవునివాక్యములో నియమము మరియు అనువర్తనం ఎల్లప్పుడూ కలసి నడుస్తాయి. ఒక ప్రకటించే విశ్వాసం మరియు వాస్తవ విశ్వాసం రెండు వేర్వేరు విషయాలు. నిజమైన విశ్వాసమును దాని చర్యల ద్వారా ఎలా ఉంటుందో మనం చెప్పగలం.
చాలామంది క్రైస్తవులు తమ మనస్సుతో క్రైస్తవ విశ్వాసం యొక్క సత్యాలను ఖండించరు కాని వారు తమ జీవితాలను గడుపు విధానములో వారు ఖండిస్తారు. దేవుని వాక్య సూత్రాలు లేనట్లుగా వారు జీవిస్తారు. ఇది ఆత్మ వంచన (1:22). నిజమైన విశ్వాసం ప్రేమతో కూడిన కార్యములతో తనను తాను ప్రదర్శిస్తుంది (2:15). విశ్వాసం మాత్రమే రక్షిస్తుంది కాని రక్షింపజేసే విశ్వాసం ఒంటరిగా ఉండదు. ఇతరులు మన విశ్వాసాన్ని మనం చేసే పనుల ద్వారా మాత్రమే చూడగలరు.