Select Page
Read Introduction to James యాకోబు

 

అయితే మీ హృదయములలో సహింపనలవికానిమత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు.౹

 

అయితే మీ హృదయములలో సహింపనలవికానిమత్సరమును

 “మత్సరమును” అనే పదాన్ని మనం ఉత్సాహంగా అని అనువదించాలి. ఉత్సాహవంతుడు ఉత్సాహభరితమైన వ్యక్తి (రోమా 10:2). ఈ సందర్భంలో, ఉత్సాహం వినాశకరమైనది ఎందుకంటే ఇది “ద్వేషముతో” కూడిన ఉత్సాహం

 “సహింపనలవికాని” అనే పదానికి కత్తిరించడం  అని అర్ధం, అందువల్ల ఇది పదునైనది మరియు కఠినమైనది. ఆలోచన “కఠినమైన మత్సరము.” ఇది ఉద్రేకపూరితమైన స్థితిలో ఉన్న వ్యక్తి, శత్రుత్వ స్థితి. ఉద్రేకపూరితమైన వ్యక్తి చివరికి ప్రాణాంతకం మరియు క్రూరమైనవాడు అవుతాడు. సహింపనలవికాని మత్సరమును అనేది మన సంబంధాలను విషపూరితం చేసే అభిరుచి.

అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.౹ 15మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అప విత్రులై పోవుదురేమో అనియు (హెబ్రీ 12:14,15)

నియమము:

తప్పుదారి పట్టిన ఉత్సాహం మన సంబంధాలపై కఠినమైన ప్రభావాన్ని చూపుతుంది.

అన్వయము:

చిన్నతనం మరియు మత్సరము బలహీనమైన అంతర్గతాన్ని బహిర్గతం చేస్తాయి. ఇది మనల్ని ఇతరులకు స్పందించనివారిగా  మార్చడమే కాక, మన పట్ల మనకు స్పందన లేనివారుగా చేస్తుంది. మనం ఇతరులకు ఎంత స్పందించనివారిగా ఉంటామో, మనలో మనం అంతగా స్పందించనివారిగా మారుతాము. మత్సరం చక్రాన్ని కదిలిస్తుంది.

సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. (ఎఫెస్సీ 4:31)

కొంతమంది ఉత్సాహం తోటి విశ్వాసులలో తగాదా మరియు కలహాలను ప్రేరేపిస్తుంది. మోటారులో పేలుళ్ల మాదిరిగా మనం ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకుంటే, ఉత్సాహం మంచిది. మనము ఉత్సాహాన్ని అనియంత్రితంగా పేల్చడానికి అనుమతిస్తే, అది మంచిది కాదు. చాలామంది క్రైస్తవులు “జ్ఞానా వివేకములు” లేకుండా పనిచేస్తారు (3:13). జ్ఞానం లేని ఉత్సాహం ప్రమాదకరం.

Share