Select Page
Read Introduction to James యాకోబు

 

వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.

 

వ్యభిచారిణులారా,

యాకోబు “వ్యభిచారిణులారా” అలంకారిక అర్థంలో ఉపయోగించాడు, ఇక్కడ అక్షరార్థం కాదు. యాకోబు ఈ పదంతో అదిరిపడే విలువను ఉద్దేశించాడు.

రోమన్ సామ్రాజ్యం అంతటా విశ్వాసులు ఇకపై దేవునికి నమ్మకంగా లేరు కాబట్టి యాకోబు వారిని “వ్యభిచారిణులు” అని పిలవడం ద్వారా వారిని విభ్రాంతికి గురిచేసాడు. లోకాన్ని ప్రేమించడం ద్వారా మనము దేవునితో సాన్నిహిత్యాన్ని కోల్పోతాము, ఎందుకంటే లోకము అపవాది యొక్క రాజ్యం మరియు విలువల వ్యవస్థ. దేవుడు అప్పుడప్పుడు ఆ సత్యంతో మనల్ని అప్రమత్తం చేస్తాడు.

ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. (1యోహాను 2:15-17)

యీ లోకస్నేహము

 “యీ” అనే పదం విశ్వాసి శరీరసంబంధ కార్యాలనుండి విడిపోయే సూత్రాన్ని పరిచయం చేస్తుంది. దేవునితో తన సహవాసానికి ప్రాపంచికత చేసే విధ్వంసం అతను అర్థం చేసుకుంటే, అప్పుడు అతను బయటపడవచ్చు.

యాకోబు పత్రిక పాఠకులు లొకాన్ని ప్రేమించారు. “స్నేహితుడు” అనే పదానికి ఆప్యాయత అని అర్ధం. శరీరసంబంధ క్రైస్తవులు తమ లోతైన భావోద్వేగ ప్రేమను లొకానికి ఇచ్చారు. లోకము అనేది ఒకరి జీవితానికి ఏది ఉత్తమమో దాని గురించనా విలువల వ్యవస్త. సాతను ఈ వ్యవస్థను నడుపుతాడు. పర్యవసానముగా, వారు సాతను యొక్క ఉద్దేశాలతో ప్రేమలో ఉన్నారు.

మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి . గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగియాయెను. (యోహాను 11:1)

ఈ సంగతి సంభవించినప్పుడు, మీరు నమ్మవలెనని అది సంభవింపకముందే మీతో చెప్పుచున్నాను. ఇకను మీతో విస్తరించి మాటలాడను; ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమియులేదు. (యోహాను 14:29)

మా సువార్త మరుగుచేయబడినయెడల నశించుచున్నవారి విషయములోనే మరుగుచేయబడియున్నది. దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకా శింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను. (2కొరిం 4:3)

మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయుదుష్టునియందున్నదనియు ఎరుగుదుము. (1యోహాను 5:19)

దేవునితో వైరమని

“స్నేహము” మరియు “వైరము” అనే విరుద్ధమైన పదాలను గమనించండి. ఒక క్రైస్తవుడు లొకాన్ని ప్రేమిస్తే, అతడు దేవుని శత్రువు. అతను లొకానికి మిత్రుడైనప్పుడల్లా దేవునిని ద్వేషిస్తాడు. ప్రపంచ వ్యవస్థను గట్టిగా హత్తుకోవడం ద్వారా దేవుడు ఎవరు మరియు ఏమైనున్నాడు అను దానిపై శరీరసంబంధియైన క్రైస్తవుడు తిరుగుబాటు చేస్తాడు. “శత్రుత్వం” అనే పదానికి పరాయీకరణ అని అర్థం.

ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు.౹ 8కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. (రోమా 8:7,8)

మీరెరుగరా?

 “మీరెరుగరా?” అనే పదాలు శరీరసంబంధ క్రైస్తవులకు వారి శరీర సంబంధ క్రియలనుండి బయటపడటానికి ఒక సవాలు. దీన్ని చేయడానికి వారు ఒక ప్రాథమిక సూత్రాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది, దానిని అతను తదుపరి పదబంధాలలో వ్యక్తపరుస్తున్నాడు.

నియమము:

ప్రాపంచికత అనేది దేవుని విలువలకు దూరంగా మన జీవిత ధోరణిని మార్పుచేసే

హృదయం మరియు వైఖరి యొక్క స్థితి

అన్వయము:

శరీర సంబంధ క్రైస్తవుడు, తన ప్రేమను ప్రపంచ వ్యవస్థ మరియు దేవుని దృక్పథం మధ్య విభజించే వ్యక్తి.

మనం ఒకేసారి లోకాన్నీ, దేవునిని ప్రేమించలేము. ఏదైనా ఒకటి మాత్రమే సాధ్యము. దేవుడు తన పట్ల మనకున్న ప్రేమ పరస్పరం ఉండాలని కోరుతుంది. క్రీస్తు వధువు (సంఘము) మరెవరితోనైనా పాన్పులో

పవలించడము ఆయనకు ఇష్టం లేదు.

మనము తన నిర్మలమైన కృపను అంగీకరించినప్పుడు యేసు మనలను దేవునితో సమాధానపరిచాడు.  మనము ఇకపై దేవునికి శత్రువులము కాదు.

ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడినయెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడు దుము. (రోమా 5:10)

ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను.౹ 15ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, (ఎఫెస్సీ 2:14,15)

Share