Select Page
Read Introduction to James యాకోబు

 

వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.

 

వాడు దేవునికి శత్రువగును.

 “అగును” అనే పదానికి అర్ధం, కేటాయించడం , ఒక నిర్దిష్ట స్థితికి తీసుకురావడం, ఒకరి స్వయాన్ని ప్రదర్శించడం. ఒకసారి మనము లోకమునకు మిత్రుడయ్యాక, దేవుని శత్రువు యొక్క స్థానానికి మనల్ని మనం కేటాయించుకుంటాము. మన అవసరమైన విలువలకు లోక మర్యాదను అనుసరించుటద్వారా దేవుని శత్రువు యొక్క స్థానానికి మనలను నియమించుకుంటాము.

నియమము:

లోకముతో స్నేహం మరియు దేవునితో స్నేహం పరస్పరం విరుద్దము.

అన్వయము:

మనము ప్రపంచాన్ని ప్రేమిస్తున్నప్పుడు ఆధ్యాత్మిక బుద్ధిహీనత ప్రదర్శిస్తున్నాము. లోకముతో స్నేహం మరియు దేవునితో స్నేహం పరస్పరం విరుద్ధముగా ఉంటాయి. ఒకేసారి దేవునిని, లొకాన్ని ప్రేమించటానికి ప్రయత్నించే వ్యక్తి ద్వంద్వ మనస్సు గల వ్యక్తి. ఇది ఆధ్యాత్మిక వ్యభిచారం.

వడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. (మత్తయి 6:24)

మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?౹ 15క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?౹ 16-18దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు.

–నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు. –కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలిప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానినిముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. –మరియునేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినైయుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునైయుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. (2కొరిం 6:14-18)

దేవుడు రోషముగల దేవుడు మరియు ద్రోహాన్ని సహించడు. అతను తనను తాను ఎవరితోనూ, దేనితోనూ పంచుకోడు. లోకాన్ని ప్రేమించే వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా ఉంచుకుంటాడు. అతను కేవలం దేవుని పట్ల ఉదాసీనంగా ఉండడు కాని అతను దేవుని శత్రువు. దేవుడు తన అవసరాలకు సరిపోడని అతను భావిస్తాడు, కాబట్టి అతను తన ఉంపుడుగత్తె, లోకానికి పారిపోతాడు. ఈ విలువల వ్యవస్థను అవలంబించడంలో, అతను తన జీవితం నుండి దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతాడు.

శరీరసంబంధ క్రైస్తవుడు సాతాను వ్యవస్థలోకి పూర్తిగా అమ్ముకున్నప్పుడు, అతను పూర్తిగా దేవుని వాక్యానికి ద్వారమును మూసివేస్తాడు. దేవుని దృక్పధము నుండి సాతాను దృక్పధము వైపు తన విలువల మలుపు తిరుగుతుంది. సాతాను దృక్పథం బహిరంగ చెడు కాకపోవచ్చు కాని బైబిల్ సూత్రాలకు విరుద్ధమైన తత్వశాస్త్రం లేదా మత విశ్వాసం. అతని హృదయం వాక్య సూత్రాల వైపు కటినపరచబడుతుంది. అతను చివరికి దేవుని పట్ల తన ఇష్టాన్ని పూర్తిగా మూసివేస్తాడు.

శరీర సంబంధియైన విశ్వాసి ఈ ధోరణిలో ఎంత ఎక్కువ కాలం దేవుని నుండి దూరంగా ఉంటాడో, అంత ఎక్కువగా సాతాను వ్యవస్థలోకి ప్రవేశిస్తాడు. దీనికి విపర్యముగా, అతను దేవుని వాక్యంలో ఎక్కువ వేగాన్ని కలిగి ఉంటాడో , దేవుని విలువల వ్యవస్థపై అతని ధోరణిలో అతను అంత బలంగా ఉంటాడు. రెంటిలో యే  నమ్మక వ్యవస్థను పొందడానికైనా చాలా నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది.

కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.౹ 2మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి. (రోమా 12:1,2)

పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి; (కొలస్సీ 3:2)

Share