Select Page
Read Introduction to James యాకోబు

 

సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబుయొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొని యున్నారు.

 

సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా?

 “ధన్యులు” అనే పదానికి సంతోషం కాదు, బాగుగా క్రమపరచబడిన ఆత్మ, అదృష్టవంతుడు అని అర్ధము. యేసు ఇదే పదాన్ని ధాన్యతలలో ఉపయోగించాడు. 

నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. (mattai 5:10)

 “ఆనుకొనుచున్నము” అనే పదం దేవుని చిత్తంలో శ్రమలు అనుభవిస్తున్నవారి దృక్పథాన్ని తెలుపుతుంది – వారు ఆశీర్వదింపబడినవారు.

సహనముకు రెండు ప్రాథమిక పదాలు ఉన్నాయి. అధ్యాయంలో ఇంతకుముందు ఉపయోగించిన మొదటిది ప్రజలను భరించడం. ఈ వచనములో సహనము అనే పదం పరిస్థితులను భరించడం (“భరించడం” మరియు “పట్టుదల”). “భరించు” అనే పదానికి ఇక్కడ భారం మోయడం అని అర్థం. కొన్నిసార్లు ప్రభువు మనపై భారీ భారం వేస్తాడు.

మీరు యోబుయొక్క సహనమునుగూర్చి వింటిర

యోబు “సహనమునకు” సంప్రదాయక ఉదాహరణ. “పట్టుదల” అనే పదానికి అర్ధం, నిరాశకు గురికాకుండా నిలిచి ఉండడం. ఈ వ్యక్తి తన సమస్యల నుండి పారిపోడు కాని అక్కడే నిలిచి ఉండే ధైర్యం కలిగి ఉన్నాడు. అతను తన స్థానంలో నిలుస్తాడు; అతను ధృఢముగా నిలుస్తాడు. అతను ఇబ్బందులు, ప్రతిఘటన మరియు వ్యతిరేకతలను భరిస్తూనే ఉన్నాడు. అతను చాలా సహించగలడు.

యోబు యెంతో సహించాడు. అతను తన సంపద, ఆరోగ్యం, పిల్లలు, కీర్తి మరియు భార్య మద్దతును కోల్పోయాడు (యోబు 2 9). అతని ముగ్గురు స్నేహితులు కూడా అతన్ని విడిచిపెట్టారు (యోబు 16 1). యోబుకు “సహనం” (5:8-10) ఉందని యాకోబు చెప్పలేదు, కాని అక్కడే ఉండిపోయే ధైర్యం తనకు ఉందని సూచించాడు. 

ఇతరులకు మీ పైని యీ అధికారములో పాలు కలిగినయెడల మాకు ఎక్కువ కలదు గదా? అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు; క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటిని సహించుచున్నాము. (1కొరిం 9:12)

అందుచేత ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతోకూడ క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారికొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. (2తిమో 2:10)

శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. (యాకోబు 1:12)

నియమము:

ఉన్నత వ్యక్తిత్వము దుర్బల సమయాల్లో ప్రభువులో ధైర్యాన్ని కాపాడుతుంది. 

అన్వయము: 

ప్రభువుతో మన ప్రయాణములో శ్రమలలో నిలకడగా ఉండటానికి మూల్యము చెల్లించాలి. ఇబ్బందికి మన ప్రతిచర్య మన వ్యక్తిత్వము యొక్క కొలత. కుటుంబ సభ్యుని కోల్పోవడం, ఆస్తులు కోల్పోవడం, వ్యాపారం కోల్పోవడం వంటి తిరోగమనాలను మనం ఎదుర్కోవాలా? ఉన్నత వ్యక్తిత్వముగల విశ్వాసి ప్రభువునకు మరియు ఆయన వాక్యానికి విశ్వాసపాత్రను కలిగి ఉంటాడు. 

ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును. (యోబు 13:15)

అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నామట్టుకు నేనే చూచెదను.మరి ఎవరును కాదు నేనే కన్నులార ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృశించియున్నవి (యోబు 19:25-27)

Share