యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను.
మనము బైబిలు యొక్క అరవై ఆరవ పుస్తకమైన, సమయం కోసం దేవుని కార్యక్రమానికి ముగింపుకు వచ్చాము. మరే ఇతర పుస్తకములో ఆరంభమైన ప్రవచనము ఈ గ్రంథంలో దాని పతాక ఘట్టాన్ని కనుగొంటుంది. ఆదికా౦డము పుస్తక౦లో పోగొట్టుకున్న పరదైసు ను౦డి మన౦ ప్రకటన గ్ర౦థ౦లో తిరిగి పొందిన పరదైసుకు వచ్చాము.
ప్రకటన గ్ర౦థ౦లోని మొదటి మూడు వచనాల్లో, మన౦ తుది పలుకులు కనుగొంటాం. ఈ తుది పలుకులు మొత్తం పుస్తకము యొక్క అంతరనిర్మాణాన్ని చూపిస్తుంది. మూడవ వచనము మొత్తం పుస్తక నిర్మాణాన్ని తెలుపుతుంది. ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోవడంలో కీలకం దాని నిర్మాణంలో ఉంది.
ప్రకటన యొక్క మొదటి అధ్యాయం మొత్తం పుస్తకానికి ఒక సాధారణ పరిచయం; ఇది అసమానమైన, సార్వభౌమ కుమారుడైన దేవుని గురించి తెలిపే గ్రంథం.
యేసుక్రీస్తు … ప్రత్యక్షత
“ప్రకటన” అనే పదానికి అర్థం వెల్లడిచేయుట, ముసుకు తొలగించుట. గ్రీకు పదము రెండు పదాల నుండి వస్తుంది: నుండి మరియు ముసుగు. ప్రకటన ముసుగును తొలగిస్తుంది. యేసుక్రీస్తు గురి౦చి బైబిలులో మరుగు చేయబడిన దానిలో ఎక్కువభాగం ఇప్పుడు ప్రకటన గ్ర౦థ౦లో వెల్లడి చేయబడి ఉ౦టు౦ది. యేసు ప్రకటన గ్రంథము యొక్క విశేష విషయము (22:6-21). ఈ పుస్తకం యొక్క పతాక సన్నివేశం క్రీస్తు యొక్క రెండవ రాక (అధ్యాయం 19) లో వస్తుంది.
ప్రకటన గ్ర౦థ౦ వెల్లడి చేయునదిగా ఉ౦ది కాబట్టి, అది మర్మయుక్తమైనదిగా, ఏదో ఒక పజిల్ లా కష్టపడే అవసరము లేదు. అనేకులు ప్రకటన గ్రంధమును అలా చూపెడుతుంటారు. అది యేసుక్రీస్తును స్పష్ట౦గా వెల్లడిచేస్తుందని ప్రకటన తనలో తానే చెబుతుంది. ఇతరులు మిమ్మల్ని ఒప్పించారు లేక ప్రకటన ఒక చీకటి పుస్తకం అని అర్థం చేసుకోవడం చాలా కష్టమని మీలో మీరు అనుకోవడము వల్ల మీ మనస్సులో ప్రకటన పుస్తకాన్ని మీరు ఉద్దేశ్యపూర్వకంగా మీకు దురము చేస్తున్నారా? బైబిలులోని ఈ గొప్ప పుస్తక౦ అర్థ౦ చేసుకోగల సవాలును ఎ౦దుకు అ౦గీకరి౦చడానికి వీల్లేదు? అది చదివితే ఆశీర్వాద౦ ఇస్తానని వాగ్దాన౦ చేసిన బైబిలు పుస్తక౦ ఇది మాత్రమే.
ఒక ప్రతిమా యొక్క ఆవిష్కారమును మనము చూసి ఉంటాము. ఆ విగ్రహం ఒక షీట్ తో కప్పబడి ఉంటుంది. ప్రతిష్ఠాపన సమయంలో ఆ విగ్రహాన్ని చూసేందుకు అందరి కోసం ముసుగు తొలగించబడుతుంది. ఇది బైబిల్ చివరి పుస్తకం యొక్క చిత్రం. ప్రకటన బైబిలులోని ఇతర పుస్తకాలు ఆయనను వెల్లడి చేయని రీతిగా వెల్లడిచేస్తుంది.
ప్రకటన ఒక మహిమాన్వితమైన పరిపాలన చేస్తున్న క్రీస్తును సమర్పిస్తోంది. ఇది సాతాను మరియు పాపముపై పూర్తి విజయం గురించి చెబుతుంది. ఏసు క్రీస్తు ఈ పుస్తకానికి కేంద్ర నేపథ్యం. ఒకటవ అధ్యాయ౦ మహిమపర్చబడిన క్రీస్తును సమర్పిస్తోంది. అది యేసు గురించి మరియు యేసు నుంచి ఒక సందేశం. ఆయన పుస్తక౦లోని, ప్రవచన౦లోని అతి ప్రముక్యమైన అంశము.
ప్రకటన గ్రంథం యొక్క శీర్షిక దానిలోని విషయాలకు కీలకం. ప్రకటన అతని గురించి ఒక ప్రశ౦స కన్నా ఎక్కువ; తన మహిమలో అది ప్రదర్శిస్తుంది. ప్రకటన మహిమగల ప్రభువును చూపిస్తుంది. తన మొదటి రాకడ కాలంలో, క్రీస్తు దైవత్వం అప్పుడప్పుడూ మాత్రమే ప్రదర్శించారు. ఆయన రెండవ రాకడలో ఆయన సమస్త మహిమలో మనం ఆయనను చూస్తూనే ఉంటాం. ఆయన మహిమను గూర్చి ఆశ్చర్యంలో మనం ఆయన్ని చూస్తూనే ఉంటాం. యేసు గురి౦చి బాగా తెలుసుకోవడానికి ఈ పుస్తక౦ ఒక వేదికను అమర్చుతుంది. ఈ పుస్తకం ద్వారా పరిశుద్దాత్మ యొక్క బోధనా పరిచర్యకు మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే ఆయన వ్యక్తిత్వము మీ ఆత్మలోకి ప్రకాశిస్తుంది.
ఈ పుస్తకం పేరులో చివర “లు” లేదని గమనించండి. చాలా మంది “ప్రకటన” గ్రంథాన్ని “ప్రకటన [లు]” అని పిలుస్తుంటారు. ఈ దోషం ఈ పుస్తకమునకు ఒక అపార్థం తెస్తుంది. ప్రకటన యేసు క్రీస్తు యొక్క వెల్లడి గురించి. ప్రవచన నిమిత్తము ప్రవచనము ఈ గ్రంథము యొక్క అంశము కాదు. ఈ పుస్తకంలోని ప్రధాన అంశము ప్రభువైన యేసుక్రీస్తు మహిమ చుట్టూ తిరుగుతుంది.
సువార్తలు నాలుగు దృక్కోణాల ను౦డి యేసు చిత్రపటాన్ని ఇస్తాయి. పత్రికలు తన వ్యక్తిత్వము గురించి మరియు కార్యము గురించి తార్కిక విశ్లేషణను అందిస్తాయి. ప్రకటన ఆయనయొక్క భావి వైభవాన్ని సమర్పిస్తోంది. క్రొత్త నిబంధన స్పష్టంగా క్రీస్తు కేంద్రితము.
నియమము:
యేసు ప్రవచనానికి కేంద్ర అంశము.
అన్వయము:
యేసు ప్రవచన కేంద్రం అంశం. సమస్త సృష్టికి ఆయనే ఆధారభూతుడు. సృష్టి యొక్క ఉద్దేశ్యం దేవునిని మరియు అతని కుమారుడైన యేసుక్రీస్తును మహిమపరచుట. ఆయన ప్రభువని, రాజైన యేసును మన అంతిమ ప్రకాశంగా పట్టుకుంటాం. యేసును వెల్లడి చేసే పనిలో దేవుడు ఉన్నాడు. ఇది మన పని కూడా అయి ఉండాలి.
ప్రకటన గ్ర౦థాన్ని మన౦ అర్థ౦ చేసుకోలే౦ అనే ప్రచారాన్ని అపవాది ప్రేమిస్తాడు. “ఆ పుస్తకం గురించిన అవగాహనను వేదాంతులకు వదిలేస్తాను.” అని అనుకోవడము, “దేవుడు నాకు స౦భాషి౦చడానికి బైబిలు వ్రాశాడు కానీ దాన్ని అర్థ౦ చేసుకోవడానికి నా సామర్థ్యాన్ని అంచనా వేయడంలో ఆయన పొరపాటు చేసి ఉ౦డాలి.” అని అనుకోవడమే
ఈ గ్రంథం అపవాది అంతిమ ఫలితాన్ని తెలియజేస్తుంది. వాని అంతిమ పరాజయం గురించి మనకు తెలియకుడదని వాని ఉద్దేశము (ప్రకటన 12). అపవాది బైబిలులోని చివరి పుస్తకాన్ని మన మనసుల్లో నుండి దూరము చేస్తే, వాడు విజయాన్ని పొందినట్లే. దానిని మనం చులకనగా భావించాలని చేయాలని వాడు కోరుకుంటున్నాడు. అదే వానికి మన జీవితాల్లో ఒక ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.
వాస్తవముగా ఉనికిలో లేని ఒక అద్భుత కథ వలే ప్రకటన గ్ర౦థ౦ గురి౦చి ఆలోచిస్తే, మన౦ దేవుని అంతిమ విజయానికి హామీ పొ౦దలే౦. వర్తమానంలో కలిగే బాధను అంతంగా భావించే వీలు ఉంటుంది. మన౦ సమయ౦ కోస౦ దేవుని స౦కల్ప౦ గురి౦చి ఎన్నడూ ఒక దృక్కోణాన్ని స౦పాది౦చ౦. శ్రమను, బాధలను మన జీవితాల్లోకి దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అనేది మనకు ఎప్పటికీ అర్థం కాదు. ముఖ్య౦గా, ప్రకటన యేసుకు స౦బ౦ధి౦చిన విషయ౦ కాబట్టి, దాన్ని మన౦ అర్థ౦ చేసుకోవాలని సాతాను కోరుకోడు.