Select Page
Read Introduction to Revelation-ప్రకటన

 

సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.

 

ధన్యులు

యోహాను ఈ పుస్తక౦లోని సూత్రాలను చదివి, వాటిని అభ్యసిస్తున్న వాళ్ళందరి మీద ప్రత్యేక ఆశీర్వాదాలతో ప్రకటన గ్ర౦థపు పరిచయ వాక్కును ముగి౦చాడు. అలా౦టి ఆశీర్వాద౦ బైబిలులో కలిగినది ఇదొక్కటే పుస్తక౦. 22:7 లో ఈ వాగ్దానాన్ని పునరావృతం చేయడం ద్వారా, అతను దీనిని ఒక ప్రాముఖ్య విషయముగా చేస్తాడు.

“ధన్యుడు” అనే పదానికి అర్థం చాలా మంది భావించే విధంగా సంతోషము కాదు. యేసు ఇదే పదాన్ని ధాన్యతలలో ఉపయోగిస్తాడు (మత్తయి 5; లూకా 6). యోహాను ప్రకటన (1:3; 14:13; 16:15; 19:9; 20:6; 22:7, 14) లో ఈ పదాన్ని ఏడుసార్లు ఉపయోగిస్తాడు. రె౦డుసార్లు పౌలు దేవుని “ఆశీర్వచనం”గా ఉపయోగిస్తాడు (1 తిమోతి 1:11; 6:15).

“ధన్యులు” దేవుని అనుగ్రహ౦ పొ౦దే అదృష్టం లేదా ఆధిక్యత కలిగిన ఒక స్థితి అనే ఆలోచనను కలిగిఉన్నది. బయటి పరిస్థితులవల్ల కాని, ప్రభావితం కాని స్థితి, లోపల అంతర్గతంగా ఉంటుంది. ఈ స్థితి మానవునికి కాక దేవునినుండి వస్తుంది. ధాన్యత సుఖం కాదు ఎందుకంటే సంతోషము పరిస్థితులమీద ఆధారపడి ఉంటుంది. ఇవి ప్రపంచము నుండి స్వతంత్రమైనవి. వారికి దేవుడు తప్ప మరేమీ అవసరం లేదు. బయటి పరిస్థితులమీద ఆధారపడరు. ఈ గుణం దేవునికి అంతర్గతంగా చెందినది. దేవునిని ధన్యునిగా ఎవ్వరూ చెప్పలేరు, కాబట్టి దేవుని మూల౦ ను౦డి ప్రజలు ఆశీర్వది౦చబడుదురు.

ఈ పుస్తకాన్ని చదువుతుంటే మనం ఎందుకు ధాన్యతను పొందుతాం? ఎ౦దుక౦టే ప్రకటన యేసుక్రీస్తు గురి౦చి, సృష్టి విషయ౦లో దేవుని స౦కల్ప౦ గురి౦చిన ఆయన అంతిమ నెరవేర్పు.

చదువువాడును,

పాఠకునికి, వినేవారికి ఇద్దరికీ ఆశీర్వాదం ఉంది. ప్రకటన గ్ర౦థ౦ చదివినవారి జీవితాలపై ఆచరణాత్మక ప్రభావ౦ ఉ౦దని యోహాను భావిస్తున్నాడు. లేఖన౦లోని ఏ భాగాన్ని అధ్యయన౦ చేసినా మన జీవితముకు ప్రయోజనకర౦గా ఉ౦టు౦ది (2 తిమోతి 3:16). అయితే, కొన్ని లేఖనాల్లో ఇతరులకన్నా ఎక్కువ ప్రయోజన౦ ఉ౦టు౦ది.

నియమము:

ఈ పుస్తకపు సూత్రాలను మన జీవితాలకు అన్వయించుకుంటూ చదివితే దేవుడు మనకు ఆశీర్వాదమును దయచేస్తాడు.

అన్వయము:

మన౦ ప్రకటనని అర్థ౦ చేసుకోలే౦ అని నమ్మిస్తూ మనల్ని మోస౦ చేసి సాతాను మనకు ప్రత్యేక ఆశీర్వాద౦ లేకు౦డా చేస్తాడు. మన౦ ప్రకటన చదివితే, బాహ్యసంబంధ  ప్రభావ౦ ను౦డి స్వాంతంత్ర్య స్థితికి ప్రవేశిస్తాం, అది ఒక ధన్యకరమైన స్థితి.

Share