Select Page
Read Introduction to Revelation-ప్రకటన

 

యోహాను ఆసియలో ఉన్న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూతభవిష్య త్కాలములలో ఉన్నవానినుండియు, ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు,… కృపాసమాధానములు మీకు కలుగునుగాక

 

వర్తమాన భూతభవిష్య త్కాలములలో ఉన్నవానినుండియు

ప్రకటన గ్ర౦థ౦ “ను౦డి” అనే పద౦ సూచి౦చబడే మూడు మూలాల ను౦డి వచ్చి౦ది. మొదటి ఆధారం ” వర్తమాన భూతభవిష్య త్కాలములలో ఉన్నవానినుండియు” అని. ఇది ఎవరు? ఇది గత మందు ఉన్నవాడు, వర్తమానములో ఉన్నవాడు, రానై ఉన్నవాడు. దేవునికి ఎటువంటి వ్యుత్పన్నమైన ఉనికి లేదు. ఆయన స్వయంభవుడు. ఆయన అభావమైన గాంభీర్యం కలిగి ఉంటాడు.

ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి–భూతవర్తమాన భవిష్యత్కాలములలోఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండును (ప్రకటన 4:8)

ఆయన తండ్రియగు దేవుడు

అంతట దేవునియెదుట సింహాసనాసీనులగు ఆ యిరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారముచేసి –వర్తమానభూతకాలములలోఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారీ, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోప గించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడువారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి. (ప్రకటన 11:16-18)

ఈ వాక్యభాగము కూడా తండ్రియగు దేవుని గూర్చియే.

గత౦లో, ప్రస్తుతకాల౦లో, భవిష్యత్తులోనూ నిత్యమూ ఉనికిలో ఉన్న దేవుడని యోహాను వర్ణిస్తున్నాడు. ఇది త్రిత్వము గుర్చికూడా ఉండవచ్చు మరియు నిర్గమకాండము 3:14 లో యెహొవా అనగా “ఉన్నవాడు అనువాడు” అని అర్థం.

ప్రకటన ఒక నిత్య దేవుని సంపూర్ణ నిత్య కార్యక్రమంగా వ్యవహరిస్తుంది. ఇక్కడ ఆయన పేరు స్థిరమైనది, పరిపూర్ణమైనది అనే భావనను తీసుకొస్తుంది. ఆయన స్వయంభువుగా ఉన్నవాడు. ఎన్నడును మార్పులెని వాడు.

“రానున్నవాడు” అనేది ఒక నిత్య దేవుడు కాలములొనికి రాబోయే సంఫధర్భమును సూచించవచ్చు. సమస్తమును ఆయన సరి చేస్తాడు. ఈ ప్రస్తుత కాలమాన అన్యాయాలకు దేవుడు మౌనము వహించి ఉన్నట్లుగా కనిపించవచ్చు, కానీ ఆయన జీవితంలోని అన్యాయాలను సరిదిద్దే ప్రణళిక కలిగి ఉన్నడు.

ఆయన సింహాసనము ఎదుటనున్న

దేవుని సర్వాధిపత్య౦ పరిశుద్ధాత్మ పరిపూర్ణత్వములో నడిపి౦చేస్తు౦ది.

యేడు ఆత్మలనుండియు

ప్రకటన గ్రంథం “ఏడు ఆత్మలు” నుండి కూడా కలిగినది. సూచనార్థక భాషలో ఇది ఎవరుని వ్యక్త౦ చేస్తుంది? ” ఏడు ఆత్మలు ” త్రిత్వపు మూడవ సభ్యుడైన పరిశుద్దాత్మను సూచిస్తుంది. “ఏడు ఆత్మలు” అనే పదబ౦ధ౦, యెషయా 11:2 లోని తన ఏడు పరిచర్యలలో పరిశుద్ధాత్మకు సూచనగా ఉ౦ది.

ప్రకటన గ్ర౦థ౦లోని ఏడు స౦ఖ్యను నిర్లక్ష్య౦ చేయడ౦ అసంభవం. ఇక్కడ “ఏడు” పవిత్ర ఆత్మ యొక్క ప్లెటిదే సూచించవచ్చు. ఏడు సంఖ్య లేఖనములో పరిపూర్ణత సంఖ్య (1:20; 3:1; 5:6; సరిపోల్చండి, యెషయా 11:1, 2).

నియమము:

త్రిత్వము కృపకు, సమాధానమునకు మూలం.

అన్వయము:

దేవుడు ఇచ్చే దేవుడు. సమాధానమును ప్రసాదించే దేవుడు కూడా. క్రైస్తవ జీవిత౦ మనపై ఆధారపడివు౦టు౦ది అని మన౦ తరచూ ఆలోచిస్తాం. ఈ దృష్టి కోల్పోతే క్రైస్తవత్వపు సారాన్ని కోల్పోతాం.

క్రైస్తవ జీవన విధానాన్ని అమలుపర్చడానికి పరిశుద్ధాత్మ నింపుదలను మన౦ సమృద్ధిగా కలిగి ఉండాలి.

Share