నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆదిసంభూతుడుగా లేచినవాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.
మృతులలోనుండి ఆదిసంభూతుడుగా లేచినవాడును
యేసు శాశ్వతంగా మృతుల నుండి మొదటివానిగా లేచేను (1 కొరింథీయులకు 15:20; కొలొస్సయులు 1:18). మళ్లీ చనిపోవుటకు మాత్రమే మరణము నుంచి ఇతర వ్యక్తులు లేచారు. ఇది పునరుత్థానం కాదు, పునరుజ్జీవనం. యేసు లాజరు మృతులను తిరిగి రప్పించాడు కానీ అతను తిరిగి మరణించాడు. అతడు మర్త్యడు. దేవుడు యేసును ఎన్నటికీ సజీవునిగా ఉంచుటకు మృతులనుండి లేపేను. యేసుకు అమర్త్యత ఉ౦ది.
శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్. (1తిమో 6:15,16)
యేసును ” ఆదిసంభూతుడు” అని ఐదుసార్లు, “అద్వితీయ” అని ఐదు సార్లు పిలువబడి ఉన్నడు. “అద్వితీయ” అనేది శరీరధారిగా (భూమిపై అతని భౌతికకాయం) సూచిస్తుంది. క్రొత్త నిబంధనలో ఐదు భాగాలు క్రీస్తుకు ప్రథమప్రాధాన్యతగా చిత్రీకరిస్తాయి. కొలొస్సయులు 1:15 సృష్టి అంతటికీ ము౦దు ఆయనను సమర్పిస్తుంది, ఆయన సృష్టికి మూలపురుషుడు కూడా.
ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. (కొలస్సీ 1:15,16)
యేసు సృష్టిపై మొదట స్థానమున ఉన్నాడు.
యేసు పునరుత్థానమందు మొదట ఉన్నాడు (కొలొస్సయులు 1:18; ప్రకటన 1:5).
యేసు సంఘము మీద అత్యున్త అధికారిగా ఉన్నాడు (రోమా 8:29).
ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. (రోమా 8:29)
యూదా మత౦ క్రి౦ద జ్యేష్ఠకుమారునికి హక్కు, హోదా నిర్వహిస్తుంది. “జ్యేష్ఠ” కుటుంబంలోని ఇతర పిల్లలను సూచింపదు. ఇది హోదా యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. తన తరగతిలో సమస్తముపై ఉన్నతస్థానంలో ఉన్నాడు.
నియమము:
మన జీవితాల్లో యేసుకు మొదటి స్థాన౦ ఇవ్వాలి.
అన్వయము:
మన జీవితాల్లో మొదటి స్థాన౦ ఉ౦డే హక్కు యేసుకే ఉ౦ది.