ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను
పదమూడవ వచనము నుండి పదహారు వచనం వరకు ప్రభువైన యేసును ఆయన మహిమలో చిత్రీకరించబడుట కనిపిస్తుంది . అతను “వలె” అనే పదాన్ని ఐదుసార్లు మరియు “పోలిన” అను పదమును నాలుగుసార్లు ఉపయోగిస్తాడు. ఇవి సారూప్యత మరియు చిహ్నాలకు ఉపయోగిస్తారు. యేసు మనకు పూర్తి నిడివి గల చిత్రమును చూపిస్తాడు.
ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను.
“ తెల్లని” స్వచ్ఛతను వర్ణిస్తుంది మరియు ఉద్ఘాటన కోసం రెండుసార్లు సంభవిస్తుంది.
ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను
“అగ్ని జ్వాల వంటి కన్నులు” సంఘములోనికి చొచ్చుకుపోవు తీర్పును సూచిస్తుంది (2:18, 23).
ఎవడైనను ఈ పునాదిమీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్య కాలు మొదలైనవాటితో కట్టినయెడల, వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును. (1కొరిం 3:12-14)
నియమము:
మనము యేసు నుండి ఏమీ దాచలేము, ఎందుకు వ్యర్ధముగా ప్రయత్నించాలి?
అన్వయము:
తన సంఘము విషయానికి వస్తే, యేసు ఒక లోపమును ఒక లోపము అని పిలుస్తాడు. సంఘము దారితప్పినప్పుడు సంఘమును మందలించడానికి ఆయన భయపడడు.
యేసు ఆవేశముతో కాకుండా స్వచ్ఛతతో, ధర్మంతో తీర్పు తీర్చును. ఆయన దృఢ పరిశీలన నుండి మనలో ఎవరూ తప్పించుకోలేరు. ఆయన తన ఎక్స్-రే వంటి సర్వజ్ఞానంతో పాపాన్ని బహిర్గతం చేస్తాడు. ఆయన మనలను పరిశీలించి మన పాపములను బహిర్గతం చేస్తాడు.