Select Page
Read Introduction to Revelation-ప్రకటన

 

కావున మారుమనస్సు పొందుము; లేనియెడల నేను నీయొద్దకు త్వరగా వచ్చి నా నోటనుండి వచ్చు ఖడ్గముచేత వీరితో యుద్ధముచేసెదను

 

కావున మారుమనస్సు పొందుము; లేనియెడల

           “మారుమనస్సు” అనే పదం బలమైన ఆదేశం. తప్పుడు సిద్ధాంతాన్ని విడచుటకు ఇది పదునైన గద్దింపు.

నేను నీయొద్దకు త్వరగా వచ్చి

పెర్గాములోని సంఘము పశ్చాత్తాపం చెందకపోతే యేసు వచ్చే వేగంతో “త్వరగా” అను మాట సంబంధం కలిగి ఉంది . యేసు వేగంగా యుద్ధానికి వెళ్తాడు. తప్పుడు సిద్ధాంతం విషయానికి వస్తే ఆయన మినహాయింపు ఇవ్వడు (2 పేతురు 2: 1).

నా నోటనుండి వచ్చు ఖడ్గముచేత వీరితో యుద్ధముచేసెదను

యుద్ధము” అనే పదానికి పోరాటము చేయడం, బహిరంగ యుద్ధంలో పాల్గొనడం (12: 7; 13: 4; 17:14). యేసు తప్పుడు సిద్ధాంతంపై యుద్ధం చేస్తాడు. సైన్యాధిపతియైనగా మనం తరచుగా యేసును గురించి ఆలోచించము . ఈ వచనములో, ఆయన వ్యక్తిగతంగా యుద్ధ ఖడ్గాముతో యుద్ధము చేయును. అతను సహనముగూర్చి పూర్తిగా అసహనంగా ఉంటాడు.

నియమము:

యేసు దుర్బోధ పట్ల సహనవిషయముపై అసహనం కలిగిఉన్నాడు.

అన్వయము:

తప్పుడు బోధలను సహించేవారిని  యేసు ఖడ్గము త్వరగా ఖండిస్తుంది. విశ్వాసం యొక్క ప్రాథమికాలను వదిలివేసే సంఘములు లేదా సంస్థలపై ఆయన ప్రాణాంతకమైన గాయాన్ని చేస్తాడు. సత్యం గురించి ఎటువంటి గందరగోళం మరియు అలసత్వమైన ఆలోచన అవసరం లేదు, ఆయన వాటిపై ఏ సందర్భంలోనైనా తీర్పు ఇస్తాడు.

Share