మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితినిగాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు.
మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితిని
బైబిల్ నైతికత నుండి వైదొలగి గణనీయమైన కాలమైపోయింది. యేసు ఆమెతో సహనంతో ఉన్నాడు మరియు పశ్చాత్తాపం చెందడానికి ఆమెకు చాలా సమయం ఇచ్చాడు.
అది తన జారత్వము విడిచిపెట్టి
“పశ్చాత్తాపం” అనే పదానికి అర్ధం మనస్సు లేదా ఉద్దేశ్యాన్ని మార్చుకోవడం . పశ్చాత్తాపపడే వ్యక్తి దేవుని చిత్తం పట్ల వారి ఆలోచన మరియు వైఖరిని మార్చుకుంటాడు. “పశ్చాత్తాపం” అనే ఆంగ్ల పదంలో ధుఃఖం కేంద్ర బిందువు అయితే ఇది గ్రీకు పదం యొక్క ముఖ్యమైన ఆలోచన కాదు. గ్రీకు పదం వెనుక ప్రాధమిక ఆలోచన మార్పుపొందిన ఆలోచన .
మారుమనస్సు పొందనొల్లదు.
యెజెబెలు సిద్ధాంతం మరియు అభ్యాసములో మార్పు పొందలేదు. ఆమె సందేశం సహనం యొక్క సందేశం కావడం ఆసక్తికరంగా ఉంది , కానీ పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఆమె అసహనంతో ఉంది. ఇది తూయతైరాలోని సంఘముపై ఉన్నతీవ్రమైన నేరారోపణ.
నియమము:
జారత్వము దేవుని చిత్తాన్ని రాజీకి అంగీకరించనక తిరస్కరిస్తుంది.
అన్వయము:
జారత్వము తరచుగా హెచ్చరికల నేపథ్యంలో దేవుని చిత్తానికి మొండిగా ఉంటుంది. చివరికి యేసుయొక్క సహనం ముగిసిపోతుంది. ఆయన ఏదో ఒక సమయంలో సంఘమును క్రమశిక్షణ చేస్తాడు.
పశ్చాత్తాపం చెందడానికి దేవుడు మన కాలపు సంఘములను ఆశిస్తున్నాడు. సంఘము ఆమె హృదయాన్ని కఠినపరచుకుంటే, ఆమె స్థితి అధ్వాన్నంగా మారుతుంది. ఇది ఒక పర్వతం పై నుండి పరుగెత్తే బండిలాంటిది; ఆపటం కష్టం.