సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక.
సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక.
“చెవి” అనేది సత్యాన్ని గ్రహించే మరియు స్వీకరించే వ్యవస్థ . తన క్రమము ప్రకారం, యేసు ఈ లేఖనమును సానుకూల ఇష్టానికి సవాలుతో ముగించాడు. మునుపటి ఉపదేశాలలో మాదిరిగా వినడానికి ఈ సవాలుకు ముందు కాకుండా ప్రబోధం అనుసరిస్తుంది.
నియమము:
యేసు తన చిత్తాన్ని అనుసరించమని మన ఇష్టాన్ని సవాలు చేయడం ద్వారా బేషరతుగా లొంగిపోవాలని పిలుస్తున్నాడు.
అన్వయము:
మన ఆధ్యాత్మిక చెవులను ప్రభువుతోకలసి నడవడానికి అనుగుణంగా ఉంచాలి. మన ఆధ్యాత్మిక ఇంద్రియాలు మన చుట్టూ ఉన్న నాశనకరమైన నైతిక ప్రమాణాలను గూర్చి హెచ్చరించాలి.
ప్రభువుకు లొంగిపోయిన ప్రజలు తమ ఇష్టానికి అనుగుణంగా జీవించరు, కానీ రాజు ఇష్టానికి అనుగుణంగా జీవిస్తారు. మహిమగల రాజు యొక్క ఇష్టానికి అనుగుణంగా వారు జీవిస్తారు. “వినుటకు చెవులు” ఉన్నవారు ఆయన చిత్తాన్ని ఉల్లంఘించే దేనినైవిషయమైనా పశ్చాత్తాపపడుతారు. వారు తమ జీవితాన్ని ప్రభువుకు పూర్తిగా అప్పగించినప్పుడు వారు తమ జీవితాన్ని పూర్తిగా ప్రభువుకు అంకితంచేస్తారు (రోమా 12: 1,2).