“ఆయన దానిని తీసి కొనినప్పుడు ఆ నాలుగుజీవులును, వీణెలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱెపిల్ల యెదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు– నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులనుకొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు “
8 వ వచనం నుండి అధ్యాయం చివరి వరకు మూడు సమూహాలు ఆరాధిస్తారు. 8-10 వచనాలలో మొదట నాలుగు జీవులు మరియు ఇరవై నాలుగు పెద్దలు ఆరాధిస్తారు, తరువాత 11 నుండి 14 వ వచనాలలో సర్వసృష్టి ఆరాధిస్తారు.
5: 8
ఆయన దానిని తీసి కొనినప్పుడు ఆ నాలుగుజీవులును, వీణెలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱెపిల్ల యెదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.
పాల్గొనే ప్రతి వారికి ఆరాధన కోసం ఒక సంగీత వాయిద్యం ఉంది-ఒక వీణ. స్పష్టంగా, సంగీతకారులు పరలోకానికి చేరుకుంటారు !! ఇది స్తుతి గురించి తెలియజేస్తుంది.
సువర్ణపాత్రలలో పరిశుద్ధుల ప్రార్టనలు భద్రపరచబడియున్నాయి. ఇది ప్రార్థన యొక్క విలువను చూపిస్తుంది. పాత నిబంధన ఆలయంలో ధూపం వేసినప్పుడు పరిమళవాసన దేవునియొద్దకు చేరేది. ధూపం క్రీస్తును చిత్రీకరిస్తుంది. దేవునియొద్ద మన ప్రార్థన చేర్చే మన అధికారి ఆయన.
5: 9
క్రొత్తపాట పాడుదురు:
ఈ “క్రొత్త పాట” యొక్క ఉద్దేశ్యం తీర్పు యొక్క ముద్రలను తొలగించడానికి గొర్రెపిల్ల యొక్క విలువను నిర్ధారించడం . క్రీస్తు మాత్రమే భూమిపై తీర్పును అమలు చేయడానికి అర్హుడు. ఆయనకు మాత్రమే అర్హతలు ఉన్నాయి.
నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు
ప్రపంచాన్ని తీర్పు తీర్చడానికి యేసు మాత్రమే అర్హుడు, ఎందుకంటే పాపం లేకుండా జీవించిన ఏకైక వ్యక్తి ఆయన మాత్రమే . అందువల్ల, ఆయన మన స్తుతికి మరియు ఆరాధనకు అర్హుడు.
గనుక
యేసును ఆరాధించడానికి మరియు ఆయన విలువను ప్రదర్శించడానికి యోహాను ఇప్పుడు కారణాలు చెప్పాడు .
వధింపబడినవాడవై,
మొదట, యేసు వధింపబడ్డాడు. నేను అతని పరలోకాన్ని కలిగి ఉండటానికి యేసు నా నరకాన్ని తీసుకున్నాడు. ఇది పాపాలకు అతని ప్రత్యామ్నాయ మరణం. అతను సిలువపై నా ప్రత్యామ్నాయం. నా పాపాల కోసం నేను చనిపోయి ఉండాలి , కాని ఆయన నాకోసం చనిపోయాడు.
5:10
నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను
రెండవది, యేసు తన రక్తం ద్వారా దేవుని కొరకు మనలను విమోచించాడు. “విమోచన” అనే పదానికి చెల్లించుట అని అర్థం . అంటే మార్కెట్లో కొనడం వంటిది . యేసు అన్ని కాలాల, గత, వర్తమాన మరియు భవిష్యత్తు యొక్క అన్ని పాపాలకు చెల్లించాడు . పాపాలవలన బాధపడాల్సిన బాధలు ఇంకేమీ లేవు. అతని మరణం పాపాలకు చెల్లించాలన్న దేవుని షరతును సమర్థవంతంగా సంతృప్తిపరిచింది. ఆ చెల్లింపు పూర్తయిన వాస్తవం.
నరకం నుండి తరలింపు లేదు మరియు స్వర్గం నుండి మరలింపు లేదు. మనము రెండూ స్టలాలలో శాశ్వతకాలం నివసిస్తాము . మనం నివసించే స్థానాన్ని నిర్ణయించే వ్యత్యాసం పాపాలను క్షమించటానికి క్రీస్తు రక్తంపై విశ్వాసం.
మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి;
యేసు తనను నమ్మిన వారిని “మన దేవునికి రాజులు, యాజకులు” గా చేసాడు. “రాజులు” అనే పదం క్రైస్తవులు ఒక రాజ్యంలో పాలనచేస్తారు అని సూచిస్తుంది . “యాజకులు” అనే పదం దేవునికి మనుష్యుల తరుపున మన ప్రాతినిథ్యాన్ని సూచిస్తుంది.
వారు భూలోకమందు ఏలుదురని
క్రైస్తవులు భూమిపై రాజ్యం చేస్తారు. సంఘము ఇప్పుడు భూమిపై పాలించదు, కానీ అది భవిష్యత్ రాజ్యమైన వెయ్యేండ్ల రాజ్యంలో పాలన చేస్తుంది.
నియమము:
నేను అతని పరలోకమును పొందుకొనుటకు యేసు నా నరకాన్ని తీసుకున్నాడు.
అన్వయము:
యేసు స్తుతులకు అర్హుడు ఎందుకంటే ఆయనను విశ్వసించే వారందరికీ ఆయన నిత్యజీవమును అందించాడు. ఆయన పరలోకమును మనము పొందుకొనుటకు ఆయన మన నరకాన్ని తీసుకున్నాడు.
లోకపాపాల కోసం చనిపోవుటకు అర్హత కలిగిన ఏకైక వ్యక్తి యేసు. ఎందుకంటే ఆయన మాత్రమే పరిపూర్ణ వ్యక్తి. పరిపూర్ణ వ్యక్తిగా, అతను అస్సలు మరణించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ, మనపట్ల ఆయనకున్న ప్రేమ వల్ల, పాపములనుబట్టి మనము అనుభవించవలసిన శ్రమలను ఆయన తీసుకున్నాడు. పాపములనుబట్టి మనమిక శ్రమపరచబడనవసరం లేదు. యేసు ఇవన్నీ చేసాడు, ఆయనకు మనం రుణపడి ఉంటాము. ఇది మన ఆరాధనకు ఆధారం.