“ ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు–నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూని వాసులకు ప్రతి దండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్య బడెను; మరియు–వారివలెనే చంపబడబోవువారి సహ దాసులయొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.
ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె నలు పాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను, పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీద రాలెను. మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతికొండయు ప్రతిద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను. భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని–సింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు? మీరు మామీదపడి ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు “
6: 9
ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని.
ఐదవ ముద్ర క్రీస్తు కోసం హతసాక్షులైనవారిని బయలుపరుస్తుంది.
“బలిపీఠం క్రింద” అనే పదం క్రీస్తు కొరకు హతసాక్షులైనవారు చిందించిన రక్తాన్ని సూచిస్తుంది. ఇక్కడ “బలిపీఠం” అనేది ఆలయం లేదా గుడారం యొక్క బలిపీఠానికి సూచన. ఇది అతిపరిశుద్ధస్తలమునకు వెలుపల ఉన్న ఒక ఇత్తడి బలిపీఠం, జంతువుల బలి జరుగు స్థలం. ఇది సిలువపై క్రీస్తు చేసిన పనిని సూచిస్తుంది. సిలువపై ఆయన చేసిన కార్యమునకు సాక్ష్యం ఇచ్చినందుకు ఈ హతసాక్షులు మరణించారు .
దేవుని వాక్యము మరియు క్రీస్తు వ్యక్తిత్వము మరియు అయన వారికి చేసిన కార్యములకు సాక్షులుగా నిలబడినందుకు ఈ హతసాక్షులు మరణించారు .
6:10
వారు–నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూని వాసులకు ప్రతి దండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.
హతసాక్షులు బిగ్గరగా దేవునికి మొఱ్ఱపెడుతూ ఈ హింస ఎంతకాలం కొనసాగుతుందని అడుగుతారు. తమను హింసించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని వారు పిలుపునిచ్చారు . ఇది కృపచూపే రోజు కాదు, భూమిపై దేవుని తీర్పు ఇచ్చే రోజు. ప్రపంచంపై అన్యాయం చేసేవారిని లెక్కచూడడానికి దేవుడు పిలుస్తాడు . ఈ హతసాక్షుల ప్రార్థనలు ప్రతి దండన కోసం దేవుని కార్యక్రమానికి అద్దం పడుతున్నాయి. ఈ రోజు, మొదటి హతసాక్షియైన స్తెఫెనులాగా క్షమించమని దేవుడు క్రైస్తవులకు పిలుపునిస్తున్నాడు.
6:11
తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్య బడెను; మరియు–వారివలెనే చంపబడబోవువారి సహ దాసులయొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.
దేవుడు హతసాక్షులకు తెల్లని వస్త్రాలు ఇస్తాడు. “తెలుపు” వస్త్రం హతసాక్షులుగా వారి విజయాన్ని మరియు నిత్యజీవితంలో పాలుపొందుటను సూచిస్తుంది. “తెలుపు” వారు పొందుకున్న నీతిని సూచిస్తుంది . ఇది వారి స్వంత నీతి కాదు, దేవుడు వారికి ఇచ్చే నీతి.
ఇతర హతసాక్షులు తమ విధిని ఎదుర్కొనే వరకు వారు [విశ్రాంతి] వేచి ఉండాల్సి ఉంటుంది. దేవునికి ప్రతిదానికీ సరైన సమయం ఉంది . ప్రతీకారం దేవునిది; ఆయన తన సమయములో తిరిగి చెల్లిస్తాడు. మనము దేవుని న్యాయాన్ని దేవుని చేతుల్లో వదిలివేయాలి. దేవునికి ప్రతిదానికీ సమయం ఉంది కాబట్టి మనం విశ్రాంతి తీసుకొని అతని సంరక్షణలో వదిలివేయాలి. కలత చెందడానికి మరియు బాధగా ఉండటానికి అర్ధం లేదు. ద్వేషం లేదా ప్రతీకారం, అస్పష్టత లేదా భయం మనకు సహాయపడవు. మనము దేవుని సార్వభౌమాధికారంలో విశ్రాంతి తీసుకోవాలి. దేవుని ప్రతీకారం తీర్చుకోవడానికి సరైన సమయం ఉంది.
6:12
ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె నలు పాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను.
ఆరవ ముద్రను విప్పినప్పుడు గొప్ప భూకంపం కలిగింది. సూర్యుడు కంబళివలె నల్లగా మారుతుంది మరియు చంద్రుడు ఎరుపు రంగులోకి మారుతుంది. ఇది సూర్యగ్రహణం కావచ్చు.
6:13
పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీద రాలెను.
బలమైన గాలులలో ఒక అంజూరపు చెట్టు నుండి అంజూరపు పండ్లు రాలినట్టు నక్షత్రాలు భూమిపై రాలాయి. ఇవి ప్రకృతిలో గొప్ప విపత్తులు మరియు విశ్వ వ్యాప్తంగా అంతరిక్ష అవాంతరాలు.
6:14
మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతికొండయు ప్రతిద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను.
ఆకాశం చుట్టిన గ్రంథము లాగా ఉంది . పర్వతాలు మరియు ద్వీపాలు వాటి స్థానాల నుండి కదిలాయి.
6:15
భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని,
ఈ మునుపటి సంఘటనల కారణంగా, భూమి యొక్క నాయకులపై గొప్ప భయం వచ్చింది. అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఎంతో భయపడే స్థితికి వెళతారు. ఈ విశ్వ అవాంతరాల వల్ల ఏడు రంగాల జీవితాలు ప్రభావితమయ్యాయని యోహాను సూచిస్తున్నాడు. ఈ సంఘటనలవలన భయభ్రాంతులకు లోనైన సమాజంలోని అన్ని స్థాయిలలోని ప్రజలను ఇది సూచిస్తుంది. ఈ సంఘటనలలో ఏ రాజకీయ నాయకుడికి ఆశ్రయం ఉండదు.
6:16
మీరు మామీదపడి ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు
భూమి యొక్క నాయకులు మరణానికి పిలుపునిచ్చారు . ప్రకృతి ఆటంకాల వలన వారు చనిపోతారు కాని గొర్రెపిల్లకి లొంగడానికి మాత్రం ఇష్టపడరు .
6:17
సింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను,
దేవుడు ప్రేమగల దేవుడు మాత్రమే కాదు, ఆయన తీర్పు తీర్చు దేవుడు – “ఆయన ఉగ్రతయొక్క మహాదినం వచ్చింది.”
దానికి తాళజాలినవాడెవడు?
మన పాపములకొరకు వధించబడిన గొర్రెపిల్లను కలిగినవారుమాత్రమే నిలువగలరు. మిగతా వారంతా నిలువలేరు. దేవుని కృప యొక్క ప్రతిపాదనను తిరస్కరించే వారందరికీ దేవుని సన్నిధిలో నిలబడటానికి ఆధారం ఏమీ ఉండదు .
నియమము:
అహంకారం గొప్ప సాక్ష్యాల నేపథ్యంలో కూడా ప్రజలను దేవుని నుండి దూరంగా ఉంచుతుంది.
అన్వయము:
భూమిపై దేవుని ప్రత్యక్ష హస్తాన్ని చూసినప్పటికీ ప్రజలు ఆయనను నమ్మడానికి నిరాకరించడం వింతగా ఉంది. నమ్మకం కంటే మరణం మంచిదని వారు భావిస్తారు. వారు ఉపేక్షలోకి ప్రవేశించడం ద్వారా, మరణం ద్వారా దేవుని నుండి తప్పించుకోగలరని వారు నమ్ముతారు.
దేవుడు ఇలా అంటాడు, ” మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియ మింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును” (హెబ్రీ 9:27). అహంకారం తమను తాము వినయంగా దేవునికి సమర్పించకుండా చేస్తుంది. వారు తమ జీవితానికి బాధ్యత వహించాలి. వారు తమను తాము దేవునికి లొంగలేరు. క్రీస్తు మరణం మాత్రమే మన పాపములకు ఏకైక చెల్లింపు అని విధేయత చూపించుట అనేది గర్విష్తులైన మానవులకు మింగుడుపడని చేదు మందులాంటిది. కృపవలన మాత్రమే మనం దేవునియొద్దకు చేరగలము. కృప వలన మన ము విధేయలు కాకపోతే దేవుని తీర్పులో నిత్యం అణగద్రొక్కబడుతాం.