Select Page
Read Introduction to Galatians గలతీయులకు

 

ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరు చున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.

 

నేనిప్పటికిని

పౌలు క్రీస్తు న౦దురాక ము౦దు ఆయన మనుష్యులను స౦తోషపరచు పనిలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన మనుషులమధ్య ప్రజాదరణ పొందాలనే ప్రయత్నంలో లేడు. ఆయన ప్రజల అభిమానము కొరకు ప్రయాసలో లేడు.

” నేనిప్పటికిని” క్లాజు వ్యతిరేక సమాధానం ఆశిస్తుంది: ” నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.” పౌలు మనుష్యులను స౦తోషపెట్టుటకు తన స౦దేశాన్ని నీరుగార్చడు.

మనుష్యులను సంతోషపెట్టువాడనైతే

గలతీయులకు పౌలు జాడలను తప్పుబట్టిన ధర్మశాస్త్రవాదులు, గలతీయులను స౦తోషపెట్టడానికి పౌలు తన స౦దేశాన్ని తారుమారు చేశారని వాది౦చారు. దాని అంతర౦ ఏమిటంటే, కృపతో కూడిన స౦దేశ౦ మనుష్యులను స౦తోషపరచును ఎ౦దుక౦టే, రక్షణ భాద్యత ప్రజల కార్యములపైగాక, కేవల౦ క్రీస్తుమీద మాత్రమే ఉ౦డడ౦. “పౌలు తన స౦దేశాన్ని ఇతరుల అభిప్రాయాలకు, కోరికలకు, ఆసక్తులకు అనుగుణముగా చెప్పాడు” అని వారు అన్నారు. పౌలు తన స౦దేశాన్ని సవరి౦చి మనుష్యులను ఎన్నడూ స౦తోష౦గా మార్చలేదు.

సూత్రం:

సత్య౦ కంటే ప్రాచుర్య౦ ఆశించువారు, కృప అనే క్రీస్తు స౦దేశాన్ని త్యజిస్తారు.

అనువర్తనం:

తన అనుచరులను సంతోషపెట్టు సందేశం ఇచ్చిన నాయకుడు చాలా ప్రమాదకరమైన భూభాగాన్ని చేరుకు౦టాడు. చివరికి అతను మరియు అతని అనుచరులు క్రైస్తవ్యము యొక్క మూలమును మరియు ఆత్మను కోల్పోతారు. దేవుని స౦దేశ౦ అందించువాడు, కృప సువార్త యొక్క పూర్తి యథార్థతను కలిగి ఉ౦టాడు.

” సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవునివలన ఎంచబడిన వారమై, మనుష్యులను సంతోషపెట్టు వారముకాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము.” (1 థెస్స 2:4).

” అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతి శ్రేప్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును “(ఫిలిప్పీయులకు 3:7-9).

కోపము గల ముఖము కలిగి తిరగటం ఇక్కడ విషయం కాదు. మన౦ “సంతొషపరచకుండా” మనుష్యులకు సువార్తప్రకటి౦చలేము! మా సందేశాన్ని సర్దుబాటు చేయడం ద్వారా మనము వ్యక్తులను సంతృప్తిపరచము గాని, మన విధానాలను సర్దుబాటు చేయడం ద్వారా మనము సంతృప్తిపరచగలము.

Share