–మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడుచేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతిమాత్రమే విని, వారు నన్నుబట్టి దేవుని మహిమపరచిరి.
–మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడుచేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతిమాత్రమే విని,
యూదయలోని సంఘములు పౌలు గురి౦చి విన్నవి, కానీ ఆయనను ఎన్నడూ వ్యక్తిగత౦గా కలుసుకోలేదు. క్రీస్తువైపు ఆయన మార్పు గురించి వారికి తెలిసిన విషయం ఒకటి ఉంది. దేవుడు క్రియల ద్వారా రక్షణ అను పౌలు యొక్క అలొచన విధానము నుండి విశ్వాసము ద్వారా రక్షణగా మార్చాడు.
వారు నన్నుబట్టి దేవుని మహిమపరచిరి.
యూదా సంఘములు పౌలు జీవిత౦లో జరిగిన మార్పును బట్టి, గ్రీకులో ఉపయొగించిన పద౦ దేవునికి మహిమను ఇచ్చుచుండిరి అని భావము వస్తుంది. పౌలు సాక్ష్య౦ దేవుణ్ణి మహిమపరిచేందుకు ఒక స౦దర్భ౦. పీడకుడు బోధకుడు అయ్యాడు. బాగా స్థిరపడిన ఈ సంఘములు పౌలు సాక్ష్యాన్ని ఆమోది౦చాయి. ఇది పౌలుపై ధర్మశాస్త్రవాదుల ఆరోపణలకు బలమైన దెబ్బ.
సూత్రం:
దేవుడు పరివర్తనను చేస్తాడు, మానవులు కాదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.
అనువర్తనం:
ఒక వ్యక్తి సాక్ష్యానికి దేవునిని మహిమపర్చుట సరైనది. అయితే మన౦ దేవుని స్తుతిలొ తోటి మానవులను స్తుతి౦చకూడదు. దేవుడు పరివర్తన చేస్తాడు, మానవులు కాదు.