దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్.
దేవునికి యుగయుగములకు
“యుగయుగములకు” అనే పదబంధం శాశ్వతమైన స్థితికి, అంతం లేని స్థితికి ఒక ఉపదేశమని చెప్పబడింది. నిత్యయుగం ప్రస్తుత దుష్ట యుగాన్ని వ్యతిరేకిస్తుంది. దేవుని మహిమ నిత్యస్తుతికి అర్హమైనది.
ఆమెన్
“ఆమెన్” మనల్ని రక్షి౦చడానికి దేవుని ప్రత్యేక మైన మహిమను ధృవీకరిస్తో౦ది. పౌలు ఇలా అన్నాడు, “నేను నమ్ముతున్నాను!” యేసు దేవుని చిత్తాన్ని (1:4) చేశాడు, ఎందుకంటే మనల్ని మనం రక్షించుకోలేనప్పుడు మన పాపములను౦డి మనలను రక్షించెను, ఆయన శాశ్వతమైన మహిమకు అర్హుడు.
సూత్రం:
దేవుడు చేసిన కార్యము వల్ల ఆ మహిమకు దేవుడు అర్హుడు.
అనువర్తనం:
రక్షణ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ప్రధానంగా దేవునికి మహిమ కలుగుట, మనిషి లాభం కోసం కాదు. దేవుని మహిమను మనం దోచుకోవడానికి మనం సాహసి౦చకూడదు. మన రక్షణకొరకు దేవుని మహిమపరచినప్పుడు, మనము మనుష్యుని మహిమను విసర్జిస్తాము. దేవుడు చేసిన కార్యమునకు చెందవలసిన మహిమను మనము తీసుకోలేము.
“…ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్.” (రోమా 9:5).
” ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగములవరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్.” (రోమీయుల 11:36).
” సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్.” (1 తిమోతి 1:17).