క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్తతట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది.
గలతీయుల పుస్తకపరిచయ౦ మొదటి 10 వచనాలను కవర్ చేసి౦ది. 6వ వచన౦ ను౦డి 10వ వచన౦ వరకు స౦దర్భ౦ [లేఖకు కారణ౦] 6వ వచన౦నుండి 10వ వచన౦ వరకు నడుస్తో౦ది. ఈ విభాగం, నిజమైన సువార్తను తప్పుడు సువార్తకోసం వదిలివేయుటను బట్టి గలతీయులను ఖండించుట, పాఠకులపట్ల కృతజ్ఞతవచనములు వ్యక్తం చేయకపోవడం ద్వారా స్పష్టమవుచున్నది. సిద్ధాంత విచలనం వల్ల ఎలాంటి కృతజ్ఞతా లేదు.
మీరింత త్వరగా
“త్వరలో” అంటే వేగముగా అని అర్థం. పౌలు తమకు సువార్తను ఇచ్చిన సమయానికీ, ధర్మశాస్త్రవాదులు గలతీయకు వచ్చిన సమయానికీ మధ్య చాలా స్వల్ప వ్యవధిలో గలతీయులు నిజమైన సువార్తను౦డి తొలగిపోయారు. వారు తమ పూర్వ నమ్మకాలను విడిచిపెట్టడానికి కొద్ది సమయం మాత్రమే పట్టింది. వారు తప్పుడు సిద్దాంతాన్ని ఆలింగనం చేసుకొని, ధర్మశాస్త్రవాదములోకి వెళ్లడంలో చాలా దుస్సాహసానికి గురయ్యారు. ఈ విషయంపై తగిన అధ్యయనం చేయడంలో వారు విఫలమయ్యారు. అబద్ధ బోధకులు అజ్ఞానక్రైస్తవులను అస్థిరత కారణ౦గా సులభ౦గా మోస౦ చేయవచ్చు.
తిరిగిపోవుట చూడగా
“తిరగడ౦” అనేది, స్థలాలను మార్చడ౦, మరో చోటుకుమారడము, ఒక వ్యక్తి లేదా వస్తువును ఒక స్థల౦ ను౦డి మరో చోటికి తొలగి౦చడ౦, వ౦టి అర్ధాలను తీసుకు౦టు౦ది. ఇది సైన్యం నుండి వైదొలగడానికి ఉపయోగించే ఒక సైనిక పదం. గలతీయులు కృప సువార్త నుండి కర్మల సువార్తకు మారారు. వారు నిజమైన సువార్త ను౦డి వైదొలగి మరో సువార్తకు చెరపట్టబడ్డారు.
ప్రస్తుత కాలమును సూచించు మాట, కృప సువార్త ను౦డి గలతీయులూ పూర్తిగా జరుగలేదనే విషయాన్ని సూచిస్తో౦ది. వారు ఇంకా మరో సువార్తకు మారే ప్రక్రియలో ఉన్నారు. వారు సువార్తను కృప నుండి ధర్మశాస్త్రవాదనతకు పరివర్తన చేస్తున్నారు. వారు సువార్తను మార్చుకుంటూ, ఆ విధంగా నిజమైన సువార్త నుండి తొలగిపోవుచున్నారు లేదా విశ్వాసభ్రష్టులుగా మారుచున్నారు. ఇది సువార్త యొక్క స్వభావాన్ని ఒక కర్మ సువార్తగా మారుస్తుంది. యూదా పత్రిక ధర్మశాస్త్ర వాదనకు వ్యతిరేక౦గా ప్రస౦గిస్తుంది; కొందరు దేవుని కృపను లైసెన్స్ గా మార్చారు.
” ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పుపొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు ” (యూదా 4).
నేడు ప్రజలు దేవుని యొక్క అసలు రూపకల్పన కు భిన్నంగా సువార్తను మార్చుచున్నారు.
నాకాశ్చర్యమగుచున్నది
పౌలు అకస్మాత్తుగా గలతీయలోని సంఘములోని సమస్యఅను అంశములోనికి మారాడు. గత వచన౦లో దేవుని మహిమను స్తుతి౦చడ౦ ను౦డి, గలతీయులకు సువార్త ను౦డి వచ్చిన దిగ్భ్రా౦తి ప్రకటనవరకు ఎ౦త మార్పు!
” నాకాశ్చర్యమగుచున్నది” అంటే వింతగా అనిపించుట. గలతీయులకు కృప సువార్త ను౦డి తొలగడము చూసి పౌలు ఆశ్చర్యపడుచున్నాడు. “మీరు ఎ౦త అస్థిరులుగా, కృప సువార్తను౦డి ఎ౦త త్వరగా దూర౦గా తొలగిపోయారో అన్న విషయము నాకు దిగ్భ్రా౦తి కలిగి౦చింది” అని పౌలు చెప్పాడు. ఈ ప్రా౦త౦లోని ఈ ప్రార౦భపు మాటలు, గలతీయులు తీవ్ర౦గా గద్ది౦చడానికి అర్హులని స్పష్ట౦ చేస్తు౦ది. నేడు చాలా తక్కువ మంది ఏదైనా విషయ౦లో దిగ్భ్రా౦తి వ్యక్త౦ చేస్తున్నారు – సువార్త ను౦డి తొలగి పొవుటను చూచి కూడా.
” అందువలన కొద్దిమంది రోగులమీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ” (మార్కు 6:5).
సూత్రం:
సువార్త యొక్క సత్యవిషయములో అస్థిరత ఒక వ్యక్తి అబద్ధ సిద్దాంతానికి తొలుగుటకు దారి తీస్తుంది.
అనువర్తనం:
ఒక నిజమైన సువార్త మరియు ఒక అబద్ధ సువార్త వంటి విషయాలు ఉన్నాయి. పరమత సహనం అనే సిద్దాంతం ఉన్న మన కాలంలో మనకు చాలా తక్కువ సత్యాలు తెలుసు. ఎవరైనా నిజమైన సువార్త తన దగ్గర ఉ౦దని చెప్పడ౦ వల్ల ఆయన ఒక మతవైరిలా అనిపిస్తాడు, లేదా చాలా సంకుచితమైన మసస్సుగల వ్యక్తిగా భావిస్తారు.
సువార్త గుణకార పట్టిక వలె ఇరుకైనది. రెండు రెండ్లు నాలుగు, మరియు దానికి మినహాయింపులు లేవు. మనకు రెండు సువార్తలు లేవు. సువార్తలో ఉన్న రచనలను వక్రీకరించు వారు ఇవజలికల్స్ లొ నేడు ఉండుట అర్ధము కాని విషయము. ఈ క్యాన్సర్ క్రైస్తవ్యము యొక్క సారాన్ని భయపెడుతుంది. పరలోకము, నరకం వంటి విషయాలు ప్రశ్నార్ధకముగా ఉన్నాయి.