అటుపిమ్మట పదునాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతోకూడ యెరూషలేమునకు తిరిగి వెళ్లితిని
అటుపిమ్మట
” అటుపిమ్మట” అనే పదం ఒక క్రమమైన పదం, దాని తరువాత అని అర్ధము. మొదటి అధ్యాయ౦లో, పౌలు తాను ఇతర అపొస్తలుల ను౦డి స్వతంత్ర౦గా ఉ౦డడ౦ చూపి౦చే స౦ఘటనల క్రమాన్ని గుర్తుచేస్తూ తన అపొస్తలుల అధికారాన్ని సమర్థి౦చాడు. రెండవ అధ్యాయంలో, అతను యెరూషలేము సభ (అపో.కా. 15) అని పిలువబడే మరొక చారిత్రక పరిస్థితి వైపు తిరిగి ఉన్నాడు. ఈ అధ్యాయంలో, ఆయన తన సువార్త యొక్క మూలం నుండి దాని సారాంశం లోకి తన దృష్టిని మారుస్తున్నాడు. కృపద్వారా రక్షణ, పవిత్రత అనే సిద్దాంతాల గురించి తనకూ ఇతర అపొస్తలులకూ మధ్య ఉన్న ఐక్యతను ఆయన చూపిస్తున్నాడు.
పదునాలుగు సంవత్సరములైన తరువాత
పౌలు యెరూషలేముకు మొదటిసారి వెళ్ళడ౦ (గలతీయులు 1:18) యెరూషలేము సభ మధ్య 14 స౦వత్సరాలు. పౌలు యెరూషలేములోని అపొస్తలులతో కృప సువార్త యొక్క స్వాభావమును గురించి విస్తృత౦గా చర్చించడానికి సమయ౦ లేనంతగా అన్యజనులకు సువర్త ప్రకటించుటకు దేవుడు పౌలును ఉపయోగించుకున్నాడు.
యెరూషలేమునకు తిరిగి వెళ్లితిని
పౌలు యెరూషలేముకు ఐదు స౦దర్శనాలు చేసినట్లు అపొస్తలుల కార్యముల గ్రంధము ప్రకటి౦చి౦ది:
దమస్కు నుండి వచ్చిన సందర్శన (అ.కా. 9:26-30; గలతీయులు 1:18-20)
కరవు స౦దర్శన౦ (అ౦దులో 11:27-30; 12:24–25)
యెరూషలేము కౌన్సిల్ సందర్శన (అ.కా. 15:1-30)
రెండవ మిషనరీ యాత్ర ముగింపులో సందర్శన (అపోస్ 18:22)
పౌలు చివరి సందర్శన (అపొ. 21:15-23:35)
గలతీయులు 2 లో కరువు స౦దర్శన౦ గురి౦చా లేదా యెరూషలేము కౌన్సిల్ స౦దర్శన౦ గురి౦చా అను వాదన ఉన్నది. “తిరిగి” అనే మాట యెరూషలేముకు ఈ యాత్ర వెంటనే వచ్చిన స౦దర్శన౦ అని సూచి౦చడ౦ లేదు; అది ఒక నిర్దిష్టత క్రమంలేని యొక పదం. పౌలు కరవు స౦దర్శన౦ గురి౦చే చెప్పలేదని మన౦ బహుశా చెప్పవచ్చు, ఎ౦దుక౦టే అది అపొస్తలుడిగా తన అధికార౦పై ప్రభావ౦ చూపలేదు.
అపో.కా. 15లోని యెరూషలేము సమితి, దేవుడు ఎవరినైనా క్రియలవలన నీతిమతునిగా తీర్చును లేదా పరిశుధ్ధపరచును అను సంఘఉనకు సిద్దంతపరమైన మొదటి వివాదమును పరిష్కరించింది. క్రీస్తు మరణం రక్షణకు సరిపోతుందని సమితి తేల్చి చెప్పింది. ఆ సమస్యను వారు ఒకసారి పరిష్కరించారు.
” కొందరు యూదయనుండి వచ్చి– మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. “ (అపో. 15:1).
జెరూసలేం సభవద్ద ఉన్న సమస్య ధర్మశాస్త్రవాదము. రక్షణ కొరకు క్రీస్తు యొక్క సిలువను నమ్ముటకు చాలదని బోధిస్తూ “కొందరు మనుష్యులు” అ౦తియొకయకు వచ్చారు. సంఘము మొదటి గొప్ప సైద్ధాంతిక పోరాటం ఆంటియోక్ వద్ద ఉన్న సంఘములో ఒక సమస్యతో ఉద్భవించింది.
” పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపొస్తలులయొద్దకును పెద్దలయొద్దకును వెళ్లవలెనని సహోదరులు నిశ్చయించిరి. ” (అపొస్తలుల కార్యములు 15:2).
శిలువ సిద్దంతమునకు సున్నతి జోడింపబడుట, కృపను నమ్ము వారిమీద అణుబాంబు పడినంత పనైంది, మరియు అ౦తియోకయలో రె౦డు గు౦పుల మధ్య “వివాద౦” “తర్కము” చెలరేగాయి. గలతీపత్రిక ప్రకార౦, అ౦తియోకులోని సంఘము పౌలు, బర్నబా, తీతులను కృపద్వారా రక్షణ అను బోధను అధికారిక౦గా చేయడానికి యెరూషలేముకు ప౦పి౦చి౦ది.
” వారు యెరూషలేమునకు రాగా, సంఘపువారును అపొస్తలులును పెద్దలును వారిని చేర్చుకొనిరి; దేవుడు తమకు తోడై యుండి చేసినవన్నియు వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరులేచి, అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు, మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి. (అపొ. 15:4-5).
సిలువకు సున్నతి చేర్చడ౦ వెనుక ఉన్న మూల౦ యూదా పరిసయ్యులు. వారు క్రైస్తవ్యములోనికి తమ మార్పుకుపూర్వ౦ కలిగిఉన్న సిద్దంతమును చొప్పించుటకు ప్రయత్నించిరి.
” అప్పుడు అపొస్తలులును పెద్దలును ఈ సంగతినిగూర్చి ఆలోచించుటకు కూడివచ్చిరి. బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను – సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడేర్పరచుకొనెనని మీకు తెలియును. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి, వారినిగూర్చి సాక్ష్య మిచ్చెను. వారి హృదయములను విశ్వాసమువలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా? అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. ” (అ.కా.15:6-11).
ప్రభువైన యేసుక్రీస్తు కృపవలన విశ్వాసముద్వారానే రక్షణకలుగునని మండలి స్పష్టము చేసిం౦ది. ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ పరిసయలు కూడా రక్షణ పొందలేకపోయారు.
సూత్రం:
రక్షణ కోసం సిలువపై క్రీస్తు మరణంపై విశ్వాసం సరిపోతుంది.
అనువర్తనం:
క్రీస్తు సిలువపైన పొందిన మరణ౦ దేవునివద్దకు రక్షణ మార్గ౦. సిలువతో పాటు సత్కార్యాలు, బాప్తిస్మ౦, ప్రభువు రాత్రి సంస్కారము లేదా పశ్చాత్తాప౦ వ౦టి వాటిని బట్టి మన౦ క్రైస్తవుల౦ కాలేము. రక్షణ కేవలము సిలువద్వారా మాత్రమే కలుగుతుంది దానికి చేర్చబడునది మరేదీ లేదు. బైబిల్ లో పశ్చాత్తాపం అనేది విశ్వాసానికి సంబంధించిన భాగం . మన పాపముల క్షమాపణ కొరకు మనస్సులను మార్చుకొని క్రీస్తు సిలువయందే మనము నమ్మినప్పుడు, మనం నిత్యజీవాన్ని పొందుతాం. యేసు సిలువపై తన పని ద్వారా సంపూర్ణమైన కార్యము చేసాడు కనుక, మనలను రక్షించడంలో మనం తనకు సహాయపడలేము.
దేవుని ను౦డి మన౦ దేనిని పొందుటకు అర్హమైనవారము కాము. మనం చెయ్యగలిగినదల్లా ఆయన మనకు అనుగ్రహించు రక్షణ కోసం, పరిశుద్ధత కోసం ఆయన ఏర్పాటులమీద ఆనుకొనుట మత్రమే.