Select Page
Read Introduction to Revelation-ప్రకటన

 

మరియు ఒకడు చేతికఱ్ఱవంటి కొలకఱ్ఱ నాకిచ్చినీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి, ఆలయములో పూజించువారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచి పెట్టుము; అది అన్యులకియ్యబడెను, వారు నలువది రెండు నెలలు పరిశుద్ధపట్టణమును కాలితో త్రొక్కుదురు.”

 

పదవ అధ్యాయంలో ప్రారంభమమైన విరామాన్ని పదకొండవ అధ్యాయం కొనసాగిస్తుంది. ప్రకటన యొక్క ఈ విభాగం విరామం కాబట్టి, పది మరియు పదకొండు అధ్యాయాలలో కాలక్రమంలో పురోగతి లేదు. ఏడవ మరియు చివరి బూర పదిహేనవ వచనంలో వినిపిస్తుంది.   

పది మరియు పదకొండు అధ్యాయాల ఇతివృత్తం క్రీస్తు రెండవ రాకడ యొక్క సమాచారవాహకులు. దూతల సమాచారవాహకులను పదియవ అధ్యాయం సమర్పించింది, ఇప్పుడు మనము మానవ సమాచారవాహకుల వైపుకు వెళ్తాము. 

11: 1

మరియు ఒకడు చేతికఱ్ఱవంటి కొలకఱ్ఱ నాకిచ్చినీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి, ఆలయములో పూజించువారిని లెక్కపెట్టుము.

యోహాను కొలిచే పరికరాన్ని తీసుకొని ఆలయం, బలిపీఠం మరియు అక్కడ పూజించేవారిని కొలవాలి. ఇది శ్రమల కాలములోని అతిపరిశుద్ధ స్థలము యొక్క కొలత, బయటి ఆవరణం కాదు. దేవుడు యూదులకు సంబంధించిన విషయాలను కొలుస్తున్నాడు, అన్యజనులవి కాదు. ఆలయం ప్రాతినిధ్యం వహిస్తున్న మెస్సీయ గురించి వారు అవిశ్వాసంలో ఉన్నారు. వారు మెస్సీయను మొండిగా తిరస్కరించారు. బయటి ఆవరణం అన్యజనుల ప్రాంగణం. దేవుడు ఈ సమయంలో అన్యజనులను కొలవడానికి ఆసక్తి చూపడు.      

ఇశ్రాయేలీయుల యొక్క మతమును మరియు శ్రమలకాలములో ఇశ్రాయేలు ప్రజలను “ఆలయం” సూచిస్తుంది . అవిశ్వాసులైన యూదులు శ్రమలకాలములోని ఆలయాన్ని నిర్మిస్తారు. యేసుక్రీస్తును మరియు అతని పనిని వెల్లడించడం అనే దేవుని అసలైన ఆలయం యొక్క నిజమైన ఉద్దేశ్యంతో దీనికి సంబంధం లేదు. అబద్ధ ప్రవక్త శ్రమలకాలములోని ఆలయానికి సహాయాన్ని చేస్తాడు. అదనంగా, పునరుద్ధరించబడిన రోమన్ సామ్రాజ్యం యొక్క నియంత శాంతి ఒప్పందంలో భాగంగా అతిపరిశుద్ధ స్థలములో తన బంగారు విగ్రహాన్ని ఉంచుతాడు. కూటమి ఏర్పడే వరకు ఈ విగ్రహం నిలబెట్టబడదు. ఇది “నాశనకరమైన హేయమైనది” (దా 9:27; 11:31; 12:11; మత్త 24:15; 2 వ 2: 4; రీ 13: 14-15).       

ఈ ఆలయంలో ఇద్దరు నియంతలు ఆరాధిస్తారు: 1) పునరుద్ధరించబడిన రోమన్ సామ్రాజ్యం యొక్క అన్యుడైన రాజకీయ నాయకుడు మరియు శ్రమలకాలములో క్రైస్తవ మతానికి అధిపతి (13: 1-9). 2) పాలస్తీనా నియంత, యూదుడు అయిన అబద్ధ ప్రవక్త, (13: 10). యేసు ఇద్దరు సాక్షు లను మరియు అపవాది తన ఇద్దరు సాక్షులను కలిగి ఉన్నారు.   

“ఆరాధించేవారు” నిజమైన విశ్వాసులు కాదు. నిజమైన విశ్వాసులు పర్వతాలకు పారిపోయారు. ఈ మతపరమైన యూదులకు బలిపీఠం ఉన్నప్పటికీ, అది అర్థరహిత ఆభరణం. ఈనాటికీ క్రైస్తవ్యంలో చాలా మందికి సిలువ అర్థం గ్రాహ్యం కాలేదు. చిహ్నరూపము వారి మనస్సులలో క్రీస్తు పూర్తి చేసిన పనిని ఆక్రమిస్తుంది.      

“వారు పొడిచినవానిని చూసేవరకు” ఇశ్రాయేలీయులు నిజంగా నమ్మరు (జ 12:10). అది వారి జాతీయ రక్షణకు కూడా కారణం అవుతుంది (రో 11:26). అయినప్పటికీ, హోషేయ తన వ్యభిచార భార్యను చూసినట్లుగా తండ్రి యూదులను చూస్తాడు. మతభ్రష్టులలో కూడా, దేవుడు తన ప్రజలను చూస్తాడు. వారు పశ్చాత్తాపం చెందకపోతే తీర్పు కోసం ఆయన వారిపై గుర్తువేస్తాడు.     

11: 2

ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచి పెట్టుము; అది అన్యులకియ్యబడెను.

యోహాను ఆవరణాన్ని (బయటి ప్రాంగణాన్ని) కొలువకూడదు. ఆవరణములోనికి వెళ్ళడానికి అన్యులకు అనుమతి ఉంది కాని దేవాలాయంలోనికి కాదు. అన్యజనులు నలభై రెండు నెలలు బయటి ఆవరణాన్ని తొక్కేస్తారు. ఆలయం వెలుపల ఆవరణాన్ని కొలవవద్దని దేవుడు యోహానుకు నిర్దిష్ట సూచనలు ఇస్తున్నాడు . ఈ సమయంలో ఇది అన్యజనుల సమస్య కాదు.     

వారు నలువది రెండు నెలలు పరిశుద్ధపట్టణమును కాలితో త్రొక్కుదురు.

1,260 రోజుల భావము దానియేలు 7:25 నుండి వచ్చింది, “ఒక కాలము కాలములు అర్ధకాలము.”  42 నెలల మహా గొప్ప శ్రమ అక్షరాలా వాస్తవం (11: 3; నలభై రెండు నెలలు 30 రోజులు). ఈ వ్యవధిలో అన్యజనులు ఆలయాన్ని నియంత్రిస్తారు. శ్రమ ఏడు సంవత్సరాల పాటు కొనసాగుతుంది, కాని మహా గొప్ప శ్రమ 42 నెలల కాలానికి శ్రమల చివరి సగం వరకు మాత్రమే ఉంటుంది . ఇది ప్రకటన గ్రంథం ఎక్కువ శ్రద్ధ చూపే తరువాతి కాలం. ఈ కాలం క్రీస్తు రెండవ రాకడతో ముగుస్తుంది.       

శ్రమకాలం రెండు 3 ½ సంవత్సరాలుగా విభాగింపబడింది. రెండవ 3 ½ సంవత్సరాలు మహా గొప్ప శ్రమకాలం. ఒక ప్రపంచ పాలకుడు నలభై రెండు నెలల ( 3 ½ సంవత్సరాలు ) మహా గొప్ప శ్రమకాలం ప్రారంభంలో ఆలయాన్ని అపవిత్రం చేస్తాడు మరియు తన విగ్రహారాధన క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తాడు. అతను తనను తాను దేవుడని ప్రకటించుకుంటాడు (దాని 9:27; 12:11; 2 థెస్స 2: 4; ప్రక 13: 14-15). “అన్యజనుల కాలము” క్రీస్తు రెండవ రాకడలో ఆయన వెయ్యేళ్ళ రాజ్యం స్థాపించడంతో ముగుస్తుంది (లూకా 21:24).    

నియమము :

మతం ప్రజలను సత్యం తెలుసుకోలేని గ్రుడ్డివాళ్ళను చేస్తుంది.

అన్వయము :

మహా గొప్ప శ్రమకాలం ప్రపంచం ఇప్పటివరకు ఎరగని మతతత్వకాలం. మతం ఎల్లప్పుడూ సత్యాన్ని కనుమరుగు చేస్తుంది. సాతాను తన పునరుజ్జీవనానికి మతాన్ని ప్రాతిపదికగా ఉపయోగిస్తాడు.   

శ్రమకాలం సమయంలో ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ మతానికి బాధ్యత వహించే ప్రపంచ నియంత రోమ్‌లో ఉంటాడు .

Share