Select Page
Read Introduction to Revelation-ప్రకటన

 

మరియు ఆశ్చర్యమైన మరియొక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా, ఏడు తెగుళ్లు చేతపట్టుకొనియున్న యేడుగురు దూతలు. ఇవే కడవరి తెగుళ్లు; వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. మరియు అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినవారు దేవుని వీణెలుగలవారై స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని.

వారుప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి;

 యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి

ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు?

 నీ నామమును మహిమపరచనివాడెవడు?

 నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారముచేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱెపిల్ల కీర్తనయు పాడుచున్నారు

 

పదిహేనవ అధ్యాయంలో, ప్రపంచంపై దేవుని తీర్పు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుంటాము. పదహారవ అధ్యాయంలో పాత్ర నుండి పోయబడే తీర్పులను గూర్చి పదిహేనవ అధ్యాయం మనలను సిద్ధం చేస్తుంది . దేవుని ఉగ్రత గొప్ప ముగింపును నిర్మిస్తోంది.

15: 1

మరియు ఆశ్చర్యమైన మరియొక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా, ఏడు తెగుళ్లు చేతపట్టుకొనియున్న యేడుగురు దూతలు. ఇవే కడవరి తెగుళ్లు; వీటితో దేవుని కోపము సమాప్తమాయెను.

పరిశుద్ధాత్మ భవిష్యత్ ప్రపంచ నియంత యొక్క మరియు అతని మత వ్యవస్థ యొక్క తీర్పుకు మరొక ” సూచన ”  ఇస్తున్నాడు.

ఈ అధ్యాయంలోని ఏడుగురు దూతలు వేరు మునుపటి అధ్యాయంలోని దూతలు వేరు. ఏడు తెగుళ్ళ యొక్క ఈ చివరి శీర్షిక శ్రమల కాలాన్ని పూర్తి చేస్తుంది. దేవుని ఉగ్రత శతాబ్దాలుగా పెరుగుతూ ఉంది. శ్రమల కాలములో ఆయన తన ఉగ్రతను క్రుమ్మరిస్తాడు. పాత్ర తీర్పులలో, ఆయన ప్రపంచంపై తన తీర్పును ముగిస్తాడు.

15: 2

మరియు అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినవారు దేవుని వీణెలుగలవారై స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని.

మృగాన్ని జయించిన హతసాక్షులు దేవుని వీణలతో “స్పటిక సముద్రం” దగ్గర నిలబడతారు. ఏడు పాత్రల నుండి పోయబడే తీర్పులకు సన్నాహకంగా, దేవుని ప్రజలు ఆరాధనలో ప్రవేశిస్తారు .

మృగం మరియు అతని సంబంధికులు శ్రమల కాలము మధ్య వరకు బయటపడరు. అంటే మృగం మీద విజయం సాధించిన వారు శ్రమల కాలపు మధ్య భాగం తర్వాత విజయం సాధించి ఉండాలి . ఈ విశ్వాసులు ఇప్పటికే హతసాక్షులయ్యారు మరియు పరలోకములో ఒక పాట పాడుతున్నారు.

15: 3

దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱెపిల్ల కీర్తనయు పాడుచున్నారు

ఈ వచనములో, శ్రమల కాలపు హతసాక్షులు పరలోకములో పాడే పాట యొక్క సాహిత్యం  ఉంది. “మోషే కీర్తన” మరియు “గొర్రెపిల్ల కీర్తన” దేవుని కార్యములు, సత్యము, న్యాయం, నామము ( లక్షణము) మరియు పరిశుద్ధతను గూర్చి ఆయనను స్తుతిస్తాయి . ఈ లక్షణాలు ఆయన యొక్క మహిమ.

వారుప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి;

దేవుని క్రియలు చాలా గొప్పవి మరియు అవి పరిశుద్ధుల మనస్సులలో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక్కడ మనుష్యులు తమ సమస్యలను మరియు చిన్న లక్ష్యాలను మరచిపోయి తమను తాము దేవుని ఆశ్చర్యక్రియలలో మునిగి తేలుతారు. ప్రపంచ చరిత్ర మొత్తం వారి కళ్ళముందు కనిపించే తీర్పులలో ఒక ముగింపుకు రావడాన్ని వారు చూస్తారు . మునుపెన్నడూ లేని విధంగా దేవుని మహిమ ప్రదర్శించబడుట వారు చూస్తారు. వారు జీవితంలో వేసుకున్న చిన్న ప్రణాళిక లను వారికపై పట్టించుకోరు. స్వీయ-ప్రాముఖ్యత దేవుని కేంద్రీకృత ధోరణిలోకి మసకబారుతుంది .

యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి

ఆరాధన అంటే దేవుని వ్యక్తిత్వాన్ని, ఆయన క్రియలను గుర్తించడం. ఆయన వ్యక్తిత్వం గురించి, క్రియలను గురించి మనకు తెలిసే వరకు మనం ప్రభువును ఆరాధించలేము . ఒక పురుషుని లేదా స్త్రీని గురించి మనకు తెలిసే వరకు మనం వారిని ప్రేమించలేము.

15: 4

ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు?

 నీ నామమును మహిమపరచనివాడెవడు?

క్రీస్తు రెండవ రాకడ ద్వారా దేవుడు భూమిపై న్యాయాన్ని పూర్తిగా నిరూపిస్తాడు . అందుకే ఆయన తనవారి నుండి మహిమ పొందుటకు అర్హుడు. వారు దేవుని యొక్క సర్వశక్తి మరియు న్యాయమునుగూర్చి ఒక పాట పాడతారు. ఆయన కాలముకు మరియు నిత్యత్వముకు దేవుడు. దేవుడు చేసే ప్రతి పనిని ముందస్తు ఆలోచనతో చేస్తాడు. ఆయనతో ఎటువంటి ప్రమాదాలు లేవు. ఆయన అదృష్టం మీద కాదు  తన సార్వభౌమాధికారం మీద పనిచేయస్తాడు. ఆయన మహిమ లెక్కకు మించినది , అయితే ఆయన నామాన్ని మహిమపర్చడానికి మనలను భూమిపై ఉంచాడు.

నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారముచేసెదరని చెప్పుచు

దేశములు “అన్నియు” కూడివచ్చి ఆరాధించుట వెయ్యేండ్ల పాలనలోని అంచనా. ప్రపంచ రాజుగా యేసు తన హక్కును బహిరంగంగా స్వీకరించినప్పుడు ఇది జరుగుతుంది. రాజ్యంలో, అన్ని దేశాలు ఆరాధనలో మెస్సీయ ముందు సాగిలపడుతారు. యేసు రాజుగా తన స్థానాన్ని స్వీకరించడం ఏడవ పాత్ర  తీర్పు తరువాత జరుగుతుంది.

“మనిషిని, మనిషి సాధించిన వాటిని చూడండి” అని ఆ రోజు ఎవరూ అనరు.  “సృష్టి కోసం దేవుని ప్రణాళికను చూడండి. ఆయన వాగ్దానం చేసినట్లే అది సఫలీకృతం అయ్యింది. ” అని వారు అంటారు

నియమము :

దేవుని ఆర్థిక వ్యవస్థలో విషయాలు ఎల్లప్పుడు మనకు కనిపించే విధంగా వుండవు.

అన్వయము:

, “ఓ ప్రభూ, ఎంతకాలం?” అన్న ప్రార్థనకు దేవుడు ఇప్పుడు సమాధానం ఇస్తాడు. దేవుడు అన్ని అగుపడుచున్న అన్యాయాలను సరైన గాడిలోనికి తెస్తాడు.

కొన్ని సమయాల్లో, నష్టంగా కనిపించేది నిజంగా విజయం. పై వచనాలలోని హతసాక్షులు మృగముతో ఓడిపోయినట్లు కనిపిస్తారు, కాని వారు గొప్ప విజయంతో తిరిగి వస్తారు. దేవుడు మనిషి కంటే రకరకాలుగా పనిచేస్తాడు. విషయాలు ఎల్లప్పుడూ అవి కనిపించేవిధంగా ఉండవు. మృగం తన శత్రువులను వదిలించుకున్నాడని అనుకున్నాడు , కాని వారు తమ సార్వభౌమ ప్రభువుతో మాత్రమే తిరిగి వచ్చారు.

క్రైస్తవులు తాము నమ్మే దాని కోసం స్థిరంగా నిలవాలని దేవుడు ఆశిస్తాడు. దేవుని వాగ్దానాలపై మీ విశ్వాసం ఉంచండి. జీవితంలో మిగతావన్నీ బలహీనమైనవి మరియు మోసకరమైనవి. దేవుని వాగ్దానాలను మించి మనం మెరుగుపడలేము. మీరు గొప్ప అన్యాయాన్ని ఎదుర్కొంటున్నట్లు కనిపించినప్పటికీ, మీ పరిస్థితి ద్వారా మిమ్మల్ని తీసుకెళ్లాలని దేవుడిని నమ్మండి.

పరిపూర్ణంగా ఆరాధించడానికి పరిపక్వత అవసరం. ఆయన వ్యక్తిత్వాన్ని మరియు క్రియలను పూర్తిగా తెలుసుకునే వరకు మనం దీన్ని చేయలేము. అంటే అత్యున్నత స్థాయిలో ఆరాధించడానికి దేవుని వాక్యాన్ని మనం తెలుసుకోవాలి.

మీకు ఆరాధన కళ్ళు మరియు చెవులు ఉన్నాయా? మీరు దేవుని గొప్పతనాన్ని గమనించారా? మీరు రాతి పర్వతాల ముందు నిలబడినప్పుడు, మీరు ఆరాధిస్తారా?

Share