“మరియు ఇంకొక స్వరము పరలోకములోనుండి ఈలాగు చెప్పగా వింటిని–నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు. అది యిచ్చినప్రకారము దానికి ఇయ్యుడి; దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి; అది కలిపిన పాత్రలో దానికొరకు రెండంతలు కలిపి పెట్టుడి. అది–నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక, అది తన్నుతాను ఎంతగా గొప్పచేసికొని సుఖ భోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్లు, అనగా మరణమును దుఃఖమును కరవును వచ్చును; దానికి తీర్పుతీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును ”
4-8 వచనాలు బబులోనీయ ప్రపంచ వాణిజ్య వ్యవస్థ నుండి తమను తాము వేరుచేసుకోవాలని శ్రమలకాలపు విశ్వాసులకు పిలుపు .
18: 4
మరియు ఇంకొక స్వరము పరలోకములోనుండి ఈలాగు చెప్పగా వింటిని–నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి.
మరొక దేవదూత మరొక ప్రకటనతోవచ్చి బబులోనును విడచి బయలుదేరమని పరిశుద్ధులను హెచ్చరిస్తాడు. తీర్పు ఈ భావజాలానికి దగ్గరగా ఉంది. శ్రమలకాలములో, వాణిజ్యంలో సమైఖ్యత ఉంటుంది. మీరు మొత్తం వ్యవస్థను కొనుగోలు చేయకపోతే , వారు మిమ్మల్ని వెలి వేస్తారు.
“విడచి వచ్చుట” ఒక తక్షణ అత్యవసరం. “ఇప్పుడే విడచి రండి. ఆలస్యం చేయవద్దు. ” ఇలాంటి వ్యవస్థతో వ్యవహరించే విషయానికి వస్తే, నిర్ణయాత్మకత చాలా ముఖ్యమైనది. పరిశుద్ధులు ఈ వ్యవస్థ నుండి తమను తాము నిర్ణయాత్మకంగా వేరు చేసుకోవాలి.
పరిశుద్ధులు బబులోనీయ వ్యవస్థ నుండి తమను తాము వేరుచేసుకోవడానికి పరలోకము నుండి వచ్చిన స్వరం రెండు కారణాలు ఇస్తుంది :
1) “మీరు ఆమె పాపాలలో పాలివారు కాకుండా” మరియు
2) ” ఆమె తెగుళ్ళు మీకు ప్రాప్తించకుండ.”
“పాలివారు” అనే పదానికి భాగస్వామ్యం కలిగియుండటం, సహవాసం కలిగియుండటం, సంబంధం కలిగియుండటం అని అర్థం . విశ్వాసులు ప్రభువైన యేసుతో సహవాసం కలిగియున్న కారణాన వారు ఆయనకు ప్రాథమికంగా వ్యతిరేకమైన వ్యవస్థతో సహవాసం చేయలేరు (2 కొరింథీయులకు 6:14-18). ఇక్కడ సంబంధం ఏమిటంటే శ్రమలకాలములో ఏక ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో సంబంధం. తమను తాము వేరు చేసుకొనని పరిశుద్ధులు తీర్పులో పాలు పొందుతారు.
18: 5
దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు.
దేవుడు తన సహనం హద్దుకి వచ్చాడని ఆ స్వరం హెచ్చరిస్తుంది. ఆయన ఇప్పుడు ప్రభుత్వ బబులోనుకు తీర్పు ఇస్తాడు. దేవుడు న్యాయాన్ని మరచిపోడు. ఆయన చక్రాలు నెమ్మదిగా రుబ్బుతున్నట్లు అనిపించవచ్చు, కానీ అవి బాగా మెత్తగా కూడా రుబ్బుతాయి. దేవుని అంతిమ తీర్పు తప్పించుకోలేనిది. ఇది ఖచ్చితం.
18: 6
అది యిచ్చినప్రకారము దానికి ఇయ్యుడి; దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి; అది కలిపిన పాత్రలో దానికొరకు రెండంతలు కలిపి పెట్టుడి.
బబులోను తీర్పు ఆమె చెడుకు అనుగుణంగా ఉంటుంది . ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా దేవుడు తన తీర్పును రెట్టింపు చేస్తాడు. విత్తినదానినే కోయవలసివస్తుంది. “ఇయ్యుడి” అనే పదానికి రుణం చెల్లించడం అని అర్థం. ఏక ప్రపంచ ప్రభుత్వానికి దేవుడు తన రుణాన్ని చెల్లిస్తాడు; ఆయన దానికి ఒక్కసారిగా తీర్పు ఇస్తాడు.
18: 7
అది–నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక, అది తన్నుతాను ఎంతగా గొప్పచేసికొని సుఖ భోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి.
బబులోనీయ ప్రపంచీకరణ సంపదను ఎంత ముఖ్యమైనదిగా మరియు విలువైనదిగా అభివర్ణించిందో, అదే స్థాయిలో ఆమె హింస మరియు దుఃఖం ఉంటుంది. ఈ బబులోనీయ వ్యవస్థ తనను ఏదీ భయపెట్టదని భావిస్తుంది. ఈ వ్యక్తులు తాము అజేయులమని నమ్ముతారు. వారు అహంకారంతో నిండి ఉన్నారు. ప్రాపంచిక ప్రభుత్వం మరియు మతం అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడతాయి. వారు ఒక సత్యానికి తమను తాము కట్టుబడి ఉండరు .
18: 8
అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్లు, అనగా మరణమును దుఃఖమును కరవును వచ్చును;
“అందుచేత” అనే పదం ఒక హేతుబద్దతను సూచిస్తుంది. తాము అజేయంగా ఉన్నామని భావించే వ్యక్తులు ప్రత్యేక తీర్పును పొందుతారనే హేతుబద్దతను దేవుడు చేస్తున్నాడు. అహంకారం ఎల్లప్పుడూ పతనాన్ని తెస్తుంది. దేవుడు అంతర్జాతీయవాదానికి అకస్మాత్తుగా , కోలుకోలేని ఆర్థిక పతనాన్ని తెస్తాడు . ఈ వ్యవస్థ యొక్క ఆర్ధిక నిర్మాణం కనుమరుగవుతుంది.
ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా తీర్పు ఒక్కసారిగా వస్తుంది . వారు అజేయులని ఒక క్షణంలో నమ్ముతారు మరియు తరువాతి క్షణంలో మొత్తం వ్యవస్థ ఒక గొప్ప పతనానికి వస్తుంది. మొత్తం ప్రపంచంలోని స్టాక్ మార్కెట్ పూర్తిగా మరియు చివరగా కుప్పకూలిపోతుంది.
నియమము :
సత్యంతో అనుసంధానములో ఉండటానికి మతం నుండి వేరుచేయబడడం ప్రాథమికమైనది. సంపద భద్రత యొక్క తప్పుడు భావాన్ని తెస్తుంది.
అన్వయము:
ఈ ప్రకరణం యొక్క ప్రాధమిక వివరణ శ్రమలకాలపు పరిశుద్ధులకు. ఏదేమైనా, ఒకరి నమ్మకంతో రాజీ పడే ప్రలోభం ప్రతి తరం ఎదుర్కోవాల్సిన విషయం (2 కొరింథీయులు 6: 14-17; 1 యోహాను 2: 15-17).