“ మరి రెండవసారి వారు–ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది “
మరి రెండవసారి వారు–ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది
పరిశుద్ధులు బబులోను యొక్క శాశ్వతమైన విధ్వంసమును బట్టి ఒక ప్రత్యేకమైన “అల్లెలుయా” చెప్పారు. ఈ “అల్లెలుయ” వెనుక కారణం దేవుడు ఆయన వ్యవహారాలలో న్యాయమైనవాడు. ఆయన ఏక ప్రపంచ మతాన్ని, ఏక ప్రపంచ ప్రభుత్వాన్ని ఓడించాడు. అన్ని తప్పుడు మతాలు పోతాయి. తప్పుడు సిద్ధాంతాల సంస్కృతులు లేదా భోధకులు ఇకపై ఉండరు. దేవుడు మతం యొక్క ప్రధాన యాజకుడైన సాతానును అణచివేస్తాడు. ఈ రోజు “మతాన్ని” నడుపుతున్న దెయ్యములన్ని విడచిపోతాయి.
యేసు ప్రపంచం నుండి అన్ని మతాలను పూర్తిగా తొలగిస్తాడు . అప్పుడు ఆయన వెయ్యేండ్ల పాలనలో పరిపూర్ణ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇందులో, మానవులు దేవునిపై ఆధారపడాలని ఆయన నిర్ధారిస్తాడు.
నియమము :
దేవుడు మాత్రమే మానవాళికి పరిపూర్ణ వాతావరణాన్ని ఏర్పాటు చేయగలడు.
అన్వయము:
మానవులు మరియు మానవ చాతుర్యం ఈ పరిపూర్ణ వాతావరణాన్ని ఎప్పటికీ స్థాపించలేవు. ప్రపంచ చరిత్ర దీనిని రుజువు చేస్తుంది. మరెవరూ చేయలేని విధంగా యేసు వెయ్యేండ్ల పాలనలో పరిపూర్ణ వాతావరణాన్ని నెలకొల్పుతాడు.
పరిపూర్ణ వాతావరణాన్ని స్థాపించగల యేసు సామర్థ్యం కారణంగా, పరిశుద్ధులు ఆయనను ప్రత్యేకంగా “అల్లెలుయా” తో పునరుద్ఘాటిస్తారు. “హల్లెలూయా” అనే పదం క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం వరకు రాకపోవడం విశేషం. క్రీస్తు రెండవ రాకడతో వ్యవహరించే పంతొమ్మిదవ అధ్యాయం వరకు ఈ పదం ప్రకటనలో లేదు. క్రీస్తు రెండవ రాకడ బబులోనీయ వాదాన్ని ఓడించే సంఘటన .