“ గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్నుతాను సిద్ధపరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను–గొఱ్ఱెపిల్ల పెండ్లివిందుకు పిలువబడినవారు ధన్యులని వ్రాయుము; మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను”
19: 7b
గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్నుతాను సిద్ధపరచుకొనియున్నది
వివాహం అనేది విశ్వాసులు మరియు దేవుని మధ్య లేదా సంఘము మరియు దేవుని మధ్య ఉన్న సంబంధానికి మంచి వర్ణన . మొదటి శతాబ్దపు వివాహ వేడుక నేటి వివాహాలకు చాలా భిన్నంగా ఉంది. ఆ వేడుకకు నాలుగు దశలు ఉన్నాయి:
1) ప్రథానం నిశ్చితార్థం కంటే ఎక్కువ ఒప్పందం కలిగియుంటుంది. ప్రథానంలో తల్లిదండ్రులు అంగీకరించిన వివాహ నిబంధనలు ఉన్నాయి. ఇది కట్నం ద్వారా ధృవీకరించబడిన చట్టపరమైన ఏర్పాటు.
2) ప్రథానం మరియు వివాహ విందు మధ్య కాలంలో, వరుడు వధువు తండ్రికి ఇంతకు ముందు ఇయ్యని పక్షంలో వరకట్నం చెల్లించేవాడు (ఆదికాండము 29:20; 34:12).
3) పట్టణ వీధుల గుండా వివాహ ఊరేగింపు వివాహాన్ని ముగింపుకు తీసుకువస్తుంది (మత్తయి 25: 1-3). ఈ కార్యక్రమానికి వధువు తనను తాను సిద్ధం చేసుకుంటుంది. వరుడు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లడానికి ఆమె ఇంటికి వెళ్తాడు (మత్తయి 9:15).
4) చివరగా, పెండ్లి భోజనంతో కూడిన వివాహ విందు ఏడు రోజులు ఉంటుంది.
“దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి యున్నాను; ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని, మిమ్మును ప్రదానము చేసితిని ”(2 కొరింథీయులు 11: 2).
సంఘము క్రీస్తుకు వధువు. క్రీస్తు, వరుడుగా తన వధువు కోసం రెండవ రాకడలో వస్తాడు. యేసు సిలువపై చిందించిన రక్తంతో కట్నం చెల్లించాడు. గొర్రెపిల్ల యొక్క పెండ్లివిందుకు సంఘము తనను తాను సిద్ధం చేసుకోవాలి.
విశ్వాసం ద్వారా క్రీస్తుతో కలయికలోనికి ప్రవేశించడం ద్వారా భార్య తన్నుతాను సిద్ధ చేసుకుంటుంది. అప్పుడు యేసు తన రాకడలో వచ్చి తన వధువును పెండ్లి విందుకు తీసుకువెళతాడు. వరుడి స్నేహితులు పాత నిబంధన భక్తులు. వరుడి స్నేహితులు ఇప్పటికే ఇంట్లో ఉన్నారు. వధువు స్నేహితులు శ్రమలకాలపు పరిశుద్ధులు. వరుడు తన వధువుతో వచ్చే వరకు వారు వరుడి ఇంటి బయట వేచి ఉంటారు. పెండ్లి విందు వెయ్యేండ్లపాలన కావచ్చు .
సాధారణంగా వధువు తన వివాహానికి సిద్ధం కావడానికి చాలా సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది నెలలు పడుతుంది. గొర్రెపిల్లతో వివాహానికి పెంతేకొస్తు నుండి సంఘము తనను తాను సిద్ధం చేసుకుంటోంది .
19: 8
మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు
“ఇయ్యబడెను” అనే పదాలు పెండ్లివిందుకు రావడానికి దేవుడు సంఘమునకు ప్రత్యేక ఆధిక్యతను ఇస్తున్నట్లు స్పష్టం చేస్తుంది. ఇది దేవుని కృప యొక్క ప్రత్యేక మంజూరు. ఈ మంజూరు ఫలితం ఏమిటంటే, వధువు అనుగ్రహించబడిన నీతిని పొందింది.
” సన్నపు నార బట్టలు” ధరించిన సంఘము దేవునిముందు న్యాయసభాసంబంధమైన (న్యాయ) నీతియందు నిలుస్తుందని సూచిస్తుంది. మన పాపములకొరకు యేసు మరణించుట ద్వారా, యేసు వలె మనము కూడా దేవుని ముందు నీతిమంతులుగా నిలుస్తాము, కాని ఈ భాగములో ఇంకా చాలా ఉంది. “నీతిక్రియలు” (బహువచనం) అనే పదాలు పరిశుద్ధులు దేవుని శక్తి ద్వారా నీతి సంబంధిత కార్యాలు చేశారని సూచిస్తున్నాయి. యేసు మన పెండ్లి వస్త్రాన్ని మనకొరకు కొన్నాడు.
ఇది ప్రకటన గ్రంథములో 14 వ సారి దేవునికి అర్పించబడిన స్తుతి (4:8, 11; 5:9-10, 12-13; 7:10, 12; 11:16-18; 15:3-4; 16:5-7; 19:1-4, 6-8 లలో)
19: 9
అతడు నాతో ఈలాగు చెప్పెను–గొఱ్ఱెపిల్ల పెండ్లివిందుకు పిలువబడినవారు ధన్యులని వ్రాయుము
ఒక ప్రత్యేక ఆశీర్వాదం గురించి పెండ్లివిందు యొక్క అతిథులకు ఒక సందేశాన్ని వ్రాయమని ఒక దేవదూత మళ్ళీ యోహానును ఆదేశిస్తాడు. వ్రాయవలసిన ఆదేశం దేవుని నుండి ఒక ముఖ్యమైన సంభాషణను సూచిస్తుంది (14:13; 21: 5). ప్రకటనలోని ఏడు ఆశీర్వాదాలలో ఇది ఒకటి. ఈ ఆశీర్వాదం భూమిపై జరిగే గొర్రెపిల్ల యొక్క పెండ్లివిందుకు సంబంధం కలిగి ఉంటుంది. “ధన్యులు” అనే పదానికి ఆత్మ యొక్క అంతర్గత శ్రేయస్సు అని అర్థం .
మనము పరలోకములో తింటాము. యేసు మృతులలోనుండి లేచిన తరువాత తిన్నాడు. ఆయన తన పునరుత్థాన శరీరంతో తిన్నాడు. మనము మన పునరుత్థాన శరీరాలతో తింటాము.
వివాహాలలో రెండు వర్గాల అతిథులు ఉంటారు – వరుడి అతిథులు మరియు వధువు యొక్క అతిథులు (యోహాను 3: 27-29). వరుడు క్రీస్తు మరియు వధువు సంఘము. వధువు సిద్ధపడిన తరువాత వివాహం జరుగుతుంది. వరుడి స్నేహితులు పాత నిబంధన భక్తులు. వధువు స్నేహితులు శ్రమలకాలపు పరిశుద్ధులు (మత్తయి 25: 1-13).
మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను”
ధన్యులగుట అనే ధన్యత “దేవుని యథార్థమైన మాటలు” గా చేసిన వ్యాఖ్య దేవుని నుండి వచ్చే ఈ సత్యానికి భరోసా , ఇది వాగ్దానానికి సమానం. ఈ వాక్యం ఆయన తన మాటను నెరవేరుస్తాడనే దేవుని వాగ్దానం యొక్క ఖచ్చితత్వాన్ని బలపరుస్తుంది.
నియమము :
క్రైస్తవులు యేసు వధువుగా గొర్రెపిల్ల పెండ్లి విందుకు వెళతారు.
అన్వయము:
పెండ్లి విందుకు రావాలని యేసు మనలను తన వధువుగా ఆహ్వానించాడు. ఆయనకు వధువు కావడం మరియు ఆయనతో సన్నిహిత సహవాసం కలిగి ఆనందించడం ఎంత ఆనందం! ఈ సంఘటనపై దేవదూత అంత ప్రాముఖ్యతను ఇస్తూ చెప్పాడు, “ఇవి దేవుని యధార్థమైన మాటలు.”
పెంతేకొస్తు దినము నుండి సంఘము శతాబ్దాలుగా తనను తాను పెళ్లికి సిద్ధం చేసుకుంటోంది. ఒకానొక రోజు ఆమె పరలోకములో తన వివాహ విందుకు వెళుతుంది. ఇది సంఘము ఎత్తబడిన తరువాత జరుగుతుంది. వధువులో చాలా మంది ఇప్పటికే అక్కడ ఉన్నారు మరియు మిగతా వారు పెళ్లికి వస్తారని వారు ఎదురు చూస్తున్నారు. మనమంతా అక్కడ ఉన్నంత వరకు పెళ్లి జరగదు. వధువు కాదు వరుడు ఈ వివాహములో ఆకర్షణకు కేంద్రంగా ఉంటాడు.