Select Page
Read Introduction to Revelation-ప్రకటన

 

మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను; గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.

 

లేఖనము యొక్క ఈ భాగం ధవళమైన మహా సింహాసనపు  తీర్పును అందిస్తుంది. ఈ తీర్పు క్రైస్తవేతరులకు మాత్రమే. దేవుడు విశ్వాసులను శాశ్వత స్థితికి తీసుకురావడానికి ముందే ఇది జరుగుతుంది . ఇది నిజంగా గంభీరమైన మరియు విచారకరమైన దృశ్యం.

20:11

మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని;

వెయ్యేండ్ల తరువాత సంభవించే ధవళమైన మహా సింహాసనపు తీర్పులో, యేసు క్రీస్తు మృతులైన అన్ని వయసులవారికి తీర్చే తుది తీర్పు . ఈ సింహాసనం ముందు ఏ విశ్వాసి నిలబడడు. యేసుక్రీస్తును తిరస్కరించిన ప్రతి ఒక్కరూ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటుకు లెక్క చెప్పాలి. అందువల్ల ఇది మునుపటి ఇతర తీర్పులకు భిన్నంగా ఉండే “గొప్ప” తీర్పు. ఇది “ధవళమైన” తీర్పు కూడా, దేవుని పరిశుద్ధత మరియు నీతి యొక్క చిహ్నం.

భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను;

ధవళమైన మహా సింహాసనముపై ఉన్న అద్భుతమైన న్యాయమూర్తి నుండి విశ్వం మొత్తం పారిపోతుంది. వారు దేవుని పరిపూర్ణ మహిమను తట్టుకోలేరు .

మనకు తెలిసిన విశ్వం మొత్తాన్ని దేవుడు నాశనం చేస్తాడు (హెబ్రీయులు 12: 25-27; 2 పేతురు 3: 7-12). విశ్వాసులు తప్ప మరెవరూ నూతన అకాశం మరియు నూతన భూమిలో నివశించరు. ధవళమైన మహా సింహాసనపు తీర్పు తరువాత విశ్వం యొక్క మొత్తం క్రమాన్ని దేవుడు భర్తీ చేస్తాడు. ఈ క్రొత్త క్రమం భూమిపై ఉన్నప్పుడు విశ్వసించినవారికి సరిపోతుంది.

వాటికి నిలువ చోటు కనబడకపోయెను.

ఇరవై ఒకటి అధ్యాయంలో, దేవుడు క్రొత్త అకాశం మరియు భూమిని ఏర్పాటు చేస్తాడు. ప్రస్తుత ఆకాశం మరియు భూమి కనుమరుగవుతాయి (మత్తయి 24:35; మార్కు 13:31; లూకా 16:17; 21:33; 2 పేతురు 3: 10-13).

20:12

మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని.

” మృతులైనవారు దేవుని ముందు నిలువబడుట” అనేది విశ్వాసులు కాని వారందరి రెండవ పునరుత్థానాన్ని సూచిస్తుంది . చరిత్ర అంతటా దేవుని రక్షణ ప్రణాళికను తిరస్కరించిన వారందరూ దేవుని ధవళమైన మహా సింహాసనం ముందు నిలబడతారు. ఈ ప్రజలు శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా అంటే శాశ్వతంగా చనిపోయారు. మరణం ప్రతి ఒక్కరినీ ఒకే తలముపై ఉంచుతుంది, “గొప్పవారు మరియు కొద్దివారు.” రాష్ట్రపతి మరియు చెత్త సేకరించేవాడు ఇద్దరూ శాశ్వతమైన మరణాన్ని ఎదుర్కొంటారు.

మొదటి పునరుత్థానం వెయ్యేళ్ళకు పూర్వం మరియు రెండవ పునరుత్థానం వెయ్యేళ్ళ తరువాత.

అప్పుడు గ్రంథములు విప్పబడెను;

దేవుడు “జీవగ్రంథముతో” తో సహా అనేక గ్రంథాలను తెరుస్తాడు . పలుకుబడి ఈ తీర్పును ప్రభావితం చేయదు ఎందుకంటే యేసు గొప్పవారికి మరియు చిన్నవారికి తీర్పు ఇస్తాడు. మొదట, దేవుడు జీవగ్రంథము కాకుండా ఇతర గ్రంథాలను తెరుస్తాడు. ఇది క్రియల పుస్తకం . ఈ ప్రజలు సిలువపై క్రీస్తు చేసిన కార్యము మీద కాకుండా వారి సరిపోని క్రియలపై నిలబడతారు. ఈ తీర్పు వద్ద తెరిచిన గ్రంథాలలో బైబిల్ ఒకటి.

మరియు జీవగ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను;

“జీవగ్రంథము” అనేది ఏదో ఒక సమయంలో శాశ్వత జీవాన్ని పొందిన వారి సమాచార గ్రంథం. వీరు విశ్వాసులు (3: 5; 13: 8; 17: 8; 20:15; 21:27).

గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.

దేవుని తుది తీర్పు సాక్ష్యం ప్రకారం ఉంటుంది – క్రియలు. “క్రియలు” అనే పదానికి మంచి లేదా చెడు పనులు అని అర్ధం . ధవళమైన మహా సింహాసనపు తీర్పు వద్ద ముఖ్య విషయము శిక్ష యొక్క స్థాయి .

మనము విశ్వాసం ద్వారా నీతిమంతులమని తీర్చబడుతున్నాము కాని మన క్రియల ప్రకారం (వలన కాదు) తీర్పు ఇవ్వబడుతున్నాము. దేవుని తుది తీర్పు దేవుని నీతిని నిరూపిస్తుంది . వారి శాశ్వతమైన స్థితిని నిర్ణయించే స్పష్టమైన పరీక్ష వారి క్రియలు. ప్రజల పనులు వారి హృదయం ఎలా ఉంటుందో తెలుపుతాయి. ఇది వారి నిజమైన నమ్మకాలు ఏమిటో చూపిస్తుంది. ప్రజలు తమ క్రియలపై నిలబడినప్పుడు, వారు తమను తాము దేవుని పరిపూర్ణమైన మరియు సంపూర్ణమైన నీతికి గురి అవుతారు.

నియమము :

దేవుడు క్రైస్తవుని పాపపు సమాచార గ్రంథమును తుడిచివేస్తాడు.

అన్వయము:

యేసు విశ్వాసి యొక్క పాపపు సమాచార గ్రంథమును తీసివేస్తాడు. ప్రభుత్వం నేరస్తుల యొక్క ప్రతి నేరాన్ని నమోదు చేస్తుంది. యేసు మన పాపాలకు చెల్లించినందున దేవుడు క్రైస్తవుని పలకను శుభ్రంగా తుడిచివేస్తాడు.

ప్రతి చీకటి పరిస్థితి, ప్రతి వంచన, దేవునికి వీటన్నిటిగూర్చి తెలుసు. దేవుని కృపా సువార్త ద్వారా తప్ప దేవుని తీర్పు నుండి తప్పించుకోవడానికి మార్గం లేదు.

Share