Select Page
Read Introduction to Revelation-ప్రకటన

 

మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని

 

మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధపట్టణము . . . . పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని

నూతన యెరూషలేము గురించి యోహాను మనకు జ్ఞానోదయం చేస్తున్నాడు (వచ. 2-8). “పరలోకమునుండి దిగివచ్చినందున” క్రొత్త యెరూషలేము కొత్త ఆకాశం మరియు క్రొత్త భూమి సృష్టించబడక ముందు ఉనికిలో ఉందని, అది వెయ్యేండ్ల కాలంలో ఉనికిలో ఉందని (యోహాను 14: 2), ఇది వెయ్యేండ్ల కాలంలో పాలించిన పునరుత్థానం చెందిన పరిశుద్ధుల ఉపగ్రహ నివాసం అని కొంతమంది వ్యాఖ్యానకర్తలు నమ్ముతారు. ఇది నిజమైతే, దానికి ప్రత్యక్ష ఆధారాలు లేవు. వారు అనుమితి ద్వారా మాత్రమే ఈ నిర్ణయానికి రావచ్చు.

ఈ ” పరిశుద్ధపట్టణము ” దేవుని సన్నిధి నుండి దిగి వస్తుంది మరియు ఇది సరి కొత్త నగరం.

తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి

నూతన యెరూషలేము తన పెళ్లికి సిద్ధపడిన వధువుగా అలంకరించబడుతుంది. ఇది బహుశా తన భర్తయైన యేసుక్రీస్తు కోసం సిద్ధపడిన అన్ని యుగములలోని పరిశుద్ధులై యుండవచ్చు. శాశ్వతత్వం యొక్క నిజమైన కేంద్రం దాని పరిసరాల సౌందర్యం కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వమే. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సౌందర్యం మరే ఇతర ఆకర్షణలను అన్నిటినీ మించిపోతుంది.

నియమము :

క్రైస్తవులకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది.

అన్వయము:

మనకు అద్భుతమైన భవిష్యత్తు ఉందని తెలుసుకోవడం చాలా బాగుంది. మనకోసం దేవుడు ప్రత్యేకంగా తయారుచేసిన నగరంలో నివసిస్తాము. ఒక రోజు మీరు మరియు నేను క్రొత్త నగరమైన నూతన యెరూషలేమునకు వెళ్తాము.

ఒక వధువు తన భర్త కోసం తనను తాను అలంకరించుకుంటుంది. ఆమె తన భర్తను సంతోషపెట్టాలని కోరుకుంటుంది. ప్రభువైన యేసును కలవడానికి మిమ్ములను మీరు సిద్ధపరచుకుంటున్నారా? మనం క్రీస్తుకు సొత్తా లేదా బాధ్యతనా?  దేవుడు మనలను తన సొత్తుగా నుండననుగ్రహించు గాక.

Share