Select Page
Read Introduction to Revelation-ప్రకటన

 

” ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.

 

ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.

ప్రకటన గ్రంధము  22:6 నుండి 22:21 వరకు కొనసాగుతుంది. యోహాను  ఇప్పుడు సంఘములకు బహుమానములను గురించి చెబుతున్నాడు.

ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.

సంఘము ఎత్తబడు సంధర్భములో (7 వ వచనం), యేసు సంఘమునకు జీతముయతో వస్తాడు . సంఘము ఎత్తబడు సంధర్భము అయిన వెంటనే, ఆయన విశ్వాసులను వారి పనుల ప్రకారం తీర్పుఇస్తాడు మరియు క్రీస్తు తీర్పులో వారికి ప్రతిఫలమిస్తాడు (2 కొరింథీయులు 5: 10-11). క్రీస్తు తీర్పు సింహాసనము వద్ద ఈ మూల్యాంకనం పనుల తీర్పు జరుగును (1 కొరింథీయులు 3: 1).

నియమము:

యేసు క్రైస్తవులకు వారి క్రియల ప్రమాణం ప్రకారం ప్రతిఫలమిస్తాడు.

అన్వయము:

మనము ప్రభువు ఎదుట నిలబడినప్పుడు మన పనులు “కలప, ఎండుగడ్డి లేదా కొయ్యకాలు” లేదా శాశ్వత ప్రభావము గల “బంగారం, వెండి మరియు విలువైన రాళ్ళు” (1 కొరింథీయులకు 3: 1 ) లాగా ఉంటాయి. దేవుడు క్రైస్తవునికి న్యాయం చేస్తాడు.

 ఎటువంటి ఇతరమైన సాక్ష్యాలను అనుమతించడు . ఎటువంటి సందర్భోచిత ఆధారాలు ఉండవు. మీతో మరియు నాతో సహా సంపూర్ణ న్యాయంగా జీవించిన ప్రతి చివరి క్రైస్తవుడిని ఆయన ముల్యాంకనము వేస్తాడు. మనము సంపాదించనిది అందుకుంటాము. ఆయన మహిమ కోసం మనము చేసిన ప్రతిదానికీ బహుమతులు అందుకుంటాము.

” నీకు ప్రత్యుపకారము చేయుటకు వారి కేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు; నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను”  (లూకా 14:14).

“ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డైవెనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.” (2 కొరింథీయులు 5:10).

Share