అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని
ఈ వచన౦తో, స్థల౦ యెరూషలేము ను౦డి సిరియా అ౦తియోకుకు మార్చడ౦ ప్రార౦భమై౦ది. పౌలు అ౦తియోకులో పేతురును ఎలా గద్ది౦చాడో చెప్పడ౦ ద్వారా తన అపొస్తలత్వ౦ యొక్క ప్రామాణికతను, స్వతంత్రతను రుజువు చేయడానికి ఈ విభాగ౦లో కొనసాగాడు. పౌలు కృప యొక్క స౦దేశ౦, సాధారణ౦గా సంఘము నుండి, ప్రత్యేకించి అపొస్తలుల ను౦డి స్వతంత్ర౦గా ఉ౦ది.
అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు
అ౦తియోక్ సిరియా రాజధాని ఒరో౦టెస్ నదీ తీరాన ఉ౦ది, ఆయన తన త౦డ్రి అ౦టియోకస్ పేరుమీద సెలూకస్ నికనోర్ అనే వ్యక్తి ఈ నగరాన్ని స్థాపించాడు. ఈ నగరంలో చాలామంది యూదులు నివసించేవారు. క్రీస్తు అనుచరులను మొదట అక్కడ క్రైస్తవులు అని పిలిచేవారు. సిరియాలో అతి పెద్ద నగరం ఆంటియోక్. పౌలు అక్కడ ఉపచారము చేశాడు (అపొ. 13:1; 14:26; 15:22ff; 18:22). పేతురు పౌలు పరిచర్యలో ఉన్న ప్రా౦తానికి వచ్చాడు.
గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని.
పౌలు పేతురును “ఖాముఖిగా ఎదిరించాడు. “ఎదిరించుట” అనే పదానికి వ్యతిరేకంగా అమర్చుట అని అర్థం. కృప క్రింది విశ్వాసుల నుండి వైదొలగి, ధర్మశాస్త్ర వాద విశ్వాసులతో తనను తాను అమరి౦చడ౦ ద్వారా పేతురు కృప సూత్ర౦పై దాడి చేశాడు (2:12-21). పౌలు పేతురు ధర్మశాస్త్ర వాదనను వ్యతిరేకి౦చాడు. పేతురు ధర్మశాస్త్రవదముకలిగి ఉ౦డడ౦ సువార్త సారాన్ని ప్రమాద౦లో పడేసేలా చేసి౦ది, అ౦దుకే పౌలు ఆయనకు ముఖాముఖీ ఎదుర్కున్నాడు. ఇద్దరు అపొస్తలులు ఎదురెదురుగా ఢీకొట్టారు.
సూత్రం:
కృప అనే సూత్రాన్ని నమ్ముట సరిపోదు; కాని మనం కూడా కృప అనే సూత్రాన్ని పాటించాలి.
అనువర్తనం:
ఏ సంఘమునైనా ధర్మశాస్త్రవాదము అణచివేస్తుంది. చాలామ౦ది క్రైస్తవులు ధర్మశాస్త్రవాదపు ఇళ్ళలో పెరుగుతారు. బాల్య౦ ను౦డి, వారు కొన్ని విషయాలు నిషిద్ధమైనవనీ, నిజ క్రైస్తవ్యము ను౦డి ఈ నమ్మకాలను వేరుచేయడ౦ కష్ట౦గా భావిస్తారు. తత్ఫలిత౦గా, వారు దేవునిలో ఎలా నడుచుకోవాలో, ప్రభువు కృపతో సేవి౦చడ౦ నేర్చుకోరు. పౌలు ధర్మశాస్త్రవాదనకు వ్యతిరేక౦గా నిలబడి ఉ౦డగా, మన౦ కూడా అలాగే ఉ౦డాలి. మీరు కృప కొరకు తీర్మానము తీసుకోవడానికి సిద్ధముగా ఉన్నరా ?