కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపులముగా కనబడినయెడల, ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయెనా? అట్లనరాదు.
కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా
విశ్వాస౦ వలన నీతిమంతులుగా తీర్చబడుట నైతిక నియమాన్ని నిర్మూలిస్తు౦దని పౌలు విరోధులు వాది౦చారు. కృప వల్ల ధర్మశాస్త్రమునకు దూరమైతే ప్రజలు తమకు నచ్చినవిధంగా జీవించగలరు. ధర్మశాస్త్రముని రద్దు చేస్తే ఒక వ్యక్తి తాను లేదా ఆమె అనుకున్నవిధంగా చేయగలడని వారు వాదించారు. పేతురు, ఆయన గు౦పు, ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడటానికి పనిచేయాల్సి౦దని క్రీస్తు సిలువ రక్షణకొరకు సరిపోదు అని వాది౦చారు.
మనము పాపులముగా కనబడినయెడల
క్రియలవలన నీతిమంతులూగా తీర్చబడుట తాము పాపులమని రుజువు చేస్తుంది అని యూదులలోని క్రైస్తవులు అంగీకరిస్తున్నారు. ధర్మశాస్త్రన్ని అనుసరించడములో వారు విఫలమైతే, వారి పాపపు పరిస్థితిని ఒప్పుకోవడానికి బలవంతపెడుతుంది. ధర్మశాస్త్రాన్ని అనుసరించుటలో వారికి నీతి లేదు.
ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయెనా?
దేవుడు తన దృష్టిలో విశ్వాసమును బట్టి ఒక వ్యక్తిని నీతిమంతునిగా ప్రకటి౦చినట్లయితే, అది క్రైస్తవులను ఢర్మశాస్త్రము లేనివారుగా చేసి౦దా? “క్రీస్తు రక్షణకొరకు, పరిశుద్ధత కొరకు క్రీస్తు ధర్మశాస్త్రము విడిచిఉంటే అది క్రీస్తును ధర్మశాస్త్రరహితము చేయును” అని ధర్మశాస్త్రవాదులు ఈ విధ౦గా వాది౦చిరి. క్రీస్తు పాపమును ప్రోత్సహించిన వాడగును. ఈ నిర్ధారణ తప్పు, ఎందుకంటే క్రీస్తు సిలువపై ఉన్న పాపపు సమస్యను పరిశ్కారము చేశాడు. దేవుడు ఒక వ్యక్తిని విశ్వాస౦వలన నీతిమంతునిగా తీర్చి పరిశుద్ధపరచునని నమ్మడ౦ ధర్మశాస్త్ర విరుద్దము కాదు.
స్వేచ్ఛ అనేది దేవుని నీతిప్రమాణాల నుండి స్వేచ్ఛ కాదు. అన్యజనులతో సహవాసము చేయడ౦ చట్టవిరుద్ధ౦ కాదు. రక్షణ, పవిత్రత అనే వ్యవస్థగా తిరిగి చట్టం లోకి వెళ్లడం అనుగ్రహ సూత్రాన్ని వదిలివేస్తుంది. సిలువపై క్రీస్తు చేసినది చాలదని మన౦ సూచిస్తాము.
పేతురు మోషే ధర్మశాస్త్రానికి తిరిగి వెళ్ళడ౦ సరైనదే అయితే, అన్యజనులతో కలిసి తినడ౦ తప్పే. అన్యజనులతో కలిసి తినుట సరైనదే అయితే, మోషే ధర్మశాస్త్రానికి తిరిగి వెళ్ళడం తప్పు. ఒక చోట ఆయన సరైనవాడు అయితే, మరో చోట తప్పుచేస్తున్నాడు. ఒకేసారి రెండింటిని పట్టుకోలేడు. అవి పరస్పరం ప్రత్యేకమైనవి. అతడు కృపతో మొదలు పెట్టి, , తిరిగి చట్టం లోకి వెళితే, అప్పుడు అతను కృపను వదిలేస్తాడు. సిలువపై క్రీస్తు చేసినది చాలదని ఆయన పరోక్షముగా చెబుతున్నాడు . పీటర్ ధర్మశాస్త్రవాదనకు తిరిగి రావడం కృపపై జరుగుతున్నదాడి.
అట్లనరాదు.
పేతురు ధర్మశాస్త్రవాదముకు తిరిగి రాడ౦ సరైనదే అయితే క్రీస్తు పాపమునకు పరిచారకుడైనట్లుగా భావించుటాయే. క్రీస్తు పాపముకు పరిచారకుడనునది పౌలుకు ఒక అసహ్యమైన ఆలోచన. మన౦ చేసిన పాపములకు క్రీస్తు మరణ౦తో దేనినీ ధర్మశాస్త్రము దేనిని చేర్చలేదు. క్రీస్తులో నీతిమంతులుగా తీర్చబడుటను జాగ్రత్తగా పరిశోధి౦చి, మన౦ ఇప్పటికీ పాపులమని కనుగొ౦టే, అది క్రీస్తును పాపపు పరిచారకునిగా చేయదు. ఇది అసహ్యమైన ఆలోచన. కృప అనే సూత్రము ద్వారా క్రీస్తు పాపాన్ని ప్రోత్సహిస్తున్నాడనే ఆరోపణను పౌలు గట్టిగా తిరస్కరిస్తున్నాడు.
సూత్రం:
కృప యొక్క సూత్రం విచ్చలవిడితనమును ఆమోదించదు.
అనువర్తనం:
కృప అనే సూత్రం పాపపు జీవితాన్ని ఎన్నడూ ప్రోత్సహించదు. క్రీస్తును విశ్వసించే ప్రజలు క్రీస్తు ప్రభుత్వము క్రింద ఉన్నారు కాబట్టి వారు తమకునచ్చినట్లు చేయరు.
క్రైస్తవులు కృపను విడిచిపెట్టి, దేవుని అనుగ్రహాన్ని పొ౦దడానికి ఒక మార్గ౦గా ధర్మశాస్త్ర వాదనకు తిరిగినప్పుడు, వారు సిలువపై క్రీస్తు పనిని అవమానము చేసినవరౌతారు. ఆయన చేసిన పని రక్షణకు, పరిశుద్ధతకు సరిపోదని వారు సూచిస్తున్నారు. వారు క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన తరువాత, వారు రక్షణ గురించి నిస్చయత లేనివారుగా ఉన్నరు.
సిలువపై క్రీస్తు యొక్క సంపూర్ణ కార్యము వీటన్నింటిని తొలగిస్తుంది. రక్షణకు, పవిత్రతకు ఆయన చాలును.