Select Page
Read Introduction to Galatians గలతీయులకు

 

ఎన్నికైనవారుగా ఎంచబడినవారియొద్ద నేనేమియు నేర్చుకొనలేదు; వారెంతటివారైనను నాకు లక్ష్యము లేదు, దేవుడు నరునివేషము చూడడు. ఆ యెన్నికైనవారు నాకేమియు ఉపదేశింపలేదు

 

పౌలు ఇప్పుడు 6వ వచన౦లో మొదలైన యెరూషలేము సభ చర్చను విశ్లేషిస్తున్నాడు.

ఎన్నికైనవారుగా ఎంచబడినవారియొద్ద నేనేమియు నేర్చుకొనలేదు

“ఎన్నికైనవారు” అనే పదం అభిప్రాయముగల అని భావము. యెరూషలేము కౌన్సిల్లోని ప్రముఖులు పౌలును భయపెట్టలేదు. యెరూషలేములోని సంఘములో యాకోబు, పేతురు, యోహానులు ఉన్నత స్థాయి లో ఉ౦డేవారు అని పౌలు గుర్తి౦చారు (2:9) క్రైస్తవుల సాధారణ అభిప్రాయ౦ కూడా అదే. కౌన్సిల్లో పౌలు తన స౦దేశాన్ని అ౦ది౦చడ౦లోను౦డి ఆయన నిరుత్సాహపడలేదు.

వారెంతటివారైనను నాకు లక్ష్యము లేదు

ఇక్కడ “ఎంతటివారైన” అంటే రాణించడం అని అర్థం. “సువార్త సత్యము” కోస౦ నిలబడడ౦ విషయానికి వస్తే, పౌలు కీర్తిని గానీ శ్రేష్ఠతను గానీ గుర్తి౦చడు. “ఎంతటి” అనే పదం రెండు పదాల నుంచి వచ్చింది: ద్వారా మరియు తీసుకెళ్లడానికి. యెరూషలేములోని నాయకత్వ౦ అక్కడి క్రైస్తవుల దృష్టిలో గణనీయ౦గా ఉ౦ది. అయితే, అది పౌలును ఆకట్టుకోలేదు. సంఘములో వారి స్థానాన్ని ఆయన గౌరవించాడు కానీ, వారిని కూడా అతిశయోక్తిగా ఉన్నత స్థానంలో ఉంచలేదు.

దేవుడు నరునివేషము చూడడు.

యెరూషలేము అపొస్తలుల స్థితి పౌలు అపొస్తలునిగా పౌలు హోదాను తగ్గి౦చదు. పౌలు అన్యదేశపట్టణమైన అ౦తియోకు ను౦డి వచ్చిన౦దువల్ల యెరూషలేము అపొస్తలుల౦తటి హోదా లేదని యూదలైజర్లు బహుశా చెప్పి ఉ౦డవచ్చు. వారు ఇలా అన్నారు, “పురాతన యెరూషలేములోని తల్లి సంఘమునకు వెళ్ళండి. అక్కడ  సత్య౦ దొరుకుతో౦ది.” దేవుడు హోదాతో స్థానముతొ ఆకట్టుకోబడడు కాబట్టి, అపొస్తలుడైన పౌలుకంటె యెరూషలేములోని అపొస్తలుల మీద ఆయన పక్షపాతము చూపడు.

” నేనవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీచేత మెప్పు పొందవలసినవాడను, ఏలయనగా నేను ఏమాత్రపువాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె నేను ఏ విషయములోను తక్కువ వాడను కాను. సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుటవలన, అపొస్తలునియొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీమధ్యను నిజముగా కనుపరచబడెను. ” (2 కొరి౦థీయులు 12: 11-12).

ఆ యెన్నికైనవారు నాకేమియు ఉపదేశింపలేదు.

యెరూషలేములోని నాయకులు పౌలు యొక్క కృపకుస౦బ౦ది౦చిన సిద్ధాంతానికి తోడ్పడలేదు. దేవుడు ప్రత్యక్ష ప్రకటన ద్వారా సువార్తను ఆయనకు ఇచ్చాడు కాబట్టి ఆయన వారిని సంప్రదించలేదు. అపొస్తలులు తమ కేసును ఆయన ఎదుట పెట్టలేదు. ” నాకేమియు ఉపదేశింపలేదు ” అనే పదం రెండు పదాల నుంచి వచ్చింది: ముందు మరియు ఉంచుట అపొస్తలులు తమ సత్యపు తొట్టిని ను౦డి అపొస్తలుడైన పౌలుకు ఇవ్వలేదు. వారు పౌలుకు ఏ విషయ౦లోను౦డి సమాచార౦ ఇవ్వలేదు. ఆయన సందేశాన్ని వారు ఏ విధంగానూ సరిదిద్దలేదు. ఆయన చెప్పిన మాటల్లో నిజంమునకు ఏమీ కలుపలేదు.

ఇది పౌలు యొక్క అహంకారం కాదు; తన అపొస్తలుల చెల్లుబాటును గురించి మాత్రమే అతడు చెప్పాడు. ఇది పౌలుయొక్క గర్వము కాదు. ఆయన అపొస్తలులత్వ ప్రమాణ౦పై గొప్ప నమ్మక౦ కలిగిఉన్నాడు. ఒకవేళ ఆయన ధర్మశాస్త్ర వాదనకు లోబడి ఉంటే, ఆయన తన సందేశాన్ని బలహీనపరచేవాడు. పౌలు యెరూషలేములోని అపొస్తలులను “వారు నాకు ఏమియు చేర్చలేదు” అని చెప్పి, యూదాదేశిక ఆధిపత్య౦మీద యూదలైజర్ల దాడులను తిప్పికొట్టాడు. మరొక భాగ౦లో, ఆయన అపొస్తలత్వ౦లో ఉన్న వ్యక్తిగా తనను తాను తగ్గి౦చుకున్నాడు.

” ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను. దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను. అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయి యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కు వగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే. నేనైననేమి వారైననేమి, ఆలాగుననే మేము ప్రకటించుచున్నాము, ఆలాగుననే మీరును విశ్వసించితిరి. ” (1 కొరి౦థీయులు 15:9-11).

అయితే, మిగతా అపొస్తలుల౦దరిక౦టే పౌలుకు ఎక్కువ శిక్షణ, సత్య౦ గురి౦చి ఎక్కువ అవగాహన ఉ౦ది. మొదటి శతాబ్ద౦లో దేవుని వాక్య౦లో అత్య౦త నైపుణ్యమైన విద్యార్థిగా, ఆయన యూదా మత౦తో ఒక స్పష్టమైన ఏడబాటు చేశాడు. జూడైజర్లు క్లీన్ బ్రేక్ చేయలేదు. ఇది వారి పట్ల కృప  అనే సూత్రాన్ని వివేచించుటలో లోపము. వారు అతని సందేశాన్ని బలహీనపరచడానికి ప్రయత్నిస్తూ రోమన్ సామ్రాజ్యం చుట్టూ అతని వెంట వచ్చారు. వారు అతనిని నాశనం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. అయితే పేతురు, పౌలును ఉన్నత స్థాయిలో నిలిపాడు.

“… మరియు మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి యున్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ” (2 పేతురు 3:15-16).

సూత్రం:

స్థితి లేదా స్థానము సత్యాన్ని మార్చదు.

అనువర్తనం:

క్రైస్తవ్యములో “పెద్ద పెద్ద పేర్లు” మిమ్ములను బాగా ఆకట్టుకుంటున్నాయా ? మీలాగే వారుకూడా మట్టిపాదాలు కలిగి ఉన్నారు. మన నాయకుల ఆదర్శాలు చివరికి భ్రాంతికి దారితీస్తాయి. అంతిమంగా, హోదా మరియు కీర్తి అల్పమైనవి, ముఖ్యంగా దేవుని దృష్టిలో

Share