“మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు.”
గలతీయలోకి వచ్చిన ధర్మశాస్త్రవాదుల [యూదమతస్తుల] ప్రభావంతో, గలతీయులు యూదా మత క్యాలెండరును పాటించడం ప్రార౦భి౦చారు. మత పుణ్యదినముల పై ప్రేమ ఒక మత ఉచ్చు నుంచి మరో ఉచ్చులోనికి వెళ్లడమే.
మీరు . . . . ఆచరించుచున్నారు
” ఆచరించుచున్నారు ” అనే పదం జాగ్రత్తగా, శ్రద్ధగా పాటించుచున్నారు అని సూచిస్తుంది. ధర్మశాస్త్రములో సూచించబడిన ఆచరణలు విడచిపెట్టకుండా ఉండేందుకు విశ్రాంతి దినాన్ని, పాతనిబంధన పండుగలను శ్రద్ధతో ఆచరించవలెనని యూదమతస్తులు గలతీయులను ఒప్పి౦చారు. గలతీయులు ఈ మత బానిసత్వములోనికి తిరిగి ప్రవేశిస్తే, వారు క్రీస్తులో తమ స్వేచ్ఛను కోల్పోతారు. మతం ఎల్లప్పుడూ దేవునితో యోగ్యతను పొందడానికి ఒక సంశయ విధానాన్ని తీసుకువస్తుంది.
దినములను
ఇక్కడ “దినములు” అనే పద౦ బహుశా పాత నిబ౦ధనలోని వారములోని విశ్రాంతిదినమును సూచిస్తు౦ది. విశ్రాంతి దినము ఏడుదినములలో సేదతీరు ఒక దినము. క్రైస్తవుడు ఏడు రోజులూ విశ్రాంతి తీసుకుంటాడు. మన విశ్రాంతి క్రీస్తునందు ఉన్నది (మత్తయి 11:28; హెబ్రీ 4:3).
మాసములను
” మాసములు ” అనగా అమావాస్య ఆచరణ, మాసముల పండుగ.
ఉత్సవకాలములను
పస్కా, పె౦తెకొస్తు, పర్ణశాలల పండుగలు ఒక్కొక్కటి ఏడు రోజుల పాటు జరిగే సంధర్భోచిత వేడుకలు.
సంవత్సరములను
యూదులు విశ్రాంతి మరియు సునాద స౦వత్సరాలను ఆచరిస్తారు (కొరి౦థీయులు 2:16). దేవుడు క్రీస్తు యొక్క వ్యక్తిత్వమును మరియు పనిని చిత్రీకరించడానికి యూదుల క్యాలెండర్లో అన్ని మతపరమైన దినాలను రూపొందించాడు. ఈ దినములు వాస్తవికతకు ఛాయ. అవి వాస్తవం కాదు కానీ వాస్తవాన్ని సూచించాయి. క్రీస్తు వాస్తవము. సిలువపై క్రీస్తు మరణమునకు పస్కా సాదృశ్యము. గొర్రెపిల్లను భుజించుట క్రీస్తుపై ఉన్న వ్యక్తిగత విశ్వాసమునకు సూచన.
నియమము :
మన౦ చేసే కార్యముల ద్వారా దేవుని అనుగ్రహాన్ని పొ౦దడానికి ప్రయత్నిస్తే మన౦ ధర్మశాస్త్రాన్ని, కృపను కలగలుపుతున్నాము.
అన్వయము :
ధర్మశాస్త్రవాదము మనల్ని దేవుని ముందు మెప్పించదు. మతపరమైన పుణ్య దినాలను ప్రత్యేక౦గా ఆచరి౦చడ౦ దేవుని నుండి ఏ విధమైన అనుగ్రహాన్ని సంపాదించదు. మన౦ చేసే పని ద్వారా మనల్ని సమర్థి౦చుకోవడానికి ప్రయత్ని౦చేటప్పుడు, మన౦ స్వనీతి ద్వారా దేవుణ్ణి సంతృప్తిపరచడానికి మన౦ ఆశిస్తాము. మానవాళికి మతం పట్ల ప్రేమ ఉంది.
ధర్మశాస్త్రవాదం మనల్ని స్థబ్దులనుగా చేస్తుంది మరియు సాధ్యమైనంత వరకు దేవునితో అత్యంత ప్రభావవంతమైన జీవితాన్ని గడపకుండా చేస్తుంది. దేవుని కృపలో, ఏ ఒక్క రోజు కూడా మరో రోజు కన్నా గొప్పది కాదు. మన౦ ప్రత్యేక పవిత్ర దినాలను అ౦గీకరి౦చినట్లయితే, కొన్ని రోజులు ఇతర రోజులక౦టే ఎక్కువ పవిత్రమైనవని మన౦ ఒప్పుకు౦టా౦. క్రైస్తవుడు ప్రతిరోజూ సమానంగా ఆచరిస్తారు. కొన్ని మతదినాలను పాటించడం ద్వారా మనం దేవుని పట్ల మన బాద్యతలను నిర్వర్తించం. “నేను పవిత్ర దినాలలో నా మతస౦బ౦ధ కార్యాలు చేస్తాను, కానీ మిగతా రోజులు నావి” అని మనలో కొ౦దరు అ౦టా౦. దేవుని దినములకు, మన దినములకు మధ్య భేదమును మనము చేయజాలము. ప్రతి దినము దేవుని దినము; మన జీవితమంతా దేవునికి చెందినది.
పాత నిబంధనని మనం విడదీయలేము. మనము విశ్రాంతిదినమును పాటిస్తే పస్కాను, పెంతెకొస్తును మరియు పర్ణశాలల పండుగలను కూడా ఆచరించాలి. మన౦ అలా చేస్తే, క్రీస్తు ఈ ప౦డుగలను నెరవేర్చాడన్న వాస్తవాన్ని మనము నిరాకరిస్తున్నాము. క్రీస్తు పండుగలన్నిటినీ పూర్తిగా నెరవేర్చాడు. ఆయన మన పస్కా (1 కొరింథీయులకు 5:7,8). ధర్మశాస్త్రము పాపమును నిర్ధారించడంలో మంచిగా ఉంది కానీ అది నివారణ చేయలేదు. యేసు పాపములను పరిహరించువాడు. ఇవన్నీ క్రీస్తులో ముగించబడ్డాయి.
“విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై యున్నాడు.” (రోమా 10:4)
“కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది” (కొలస్సీ 2:16-17)
క్రీస్తు మన పాపముల కొరకు బలి అయ్యాడు కనుక ఇక ఇత్తడి బలిపీఠము లేదు. ఇది నేడు సంఘానికి అవసరము లేదు. దేవుడు గుడారాన్ని, ఆలయాన్ని తీసివేసాడు ఎ౦దుక౦టే యేసు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చాడు. సంఘములోని ప్రజలకు దేవుడు వేరే ప్రణాళికను కలిగియున్నాడు.
“ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.” (యోహాను 1:16-17)