“మొదటిసారి శరీరదౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగుదురు.”
మొదటిసారి శరీరదౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగుదురు.
పౌలు గలతీయలో సువార్తను ప్రకటి౦చడానికి మొదటిసారి వచ్చినప్పుడు ఆయన శారీరక అనారోగ్య౦తో వచ్చాడు. పౌలు గలతీయకు వ్యక్తిగత శక్తిలేక బల౦తో రాలేదు, కాని “శారీరక బలహీనత”తో దేవుని కృప పై ఆధారపడి ఆయన వచ్చాడు.
నియమము :
అంగవైకల్యం కృపకు తోడ్పడుతుంది.
అన్వయము :
సువార్తప్రకటి౦చడానికి మనకు చాలా తక్కువ మార్గాలు ఉన్నాయని మన౦ భావించినప్పుడు, మన౦ ప్రభువు ఏర్పాటుపై ఆధారపడాలి. అంగవైకల్యం, కృపకు తోడ్పడుతుంది, ఆటంకంగా ఉండదు.
“అందుకు–నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను.” (2 కొరింథీ 12:9-10)