Select Page
Read Introduction to Galatians గలతీయులకు

 

నేను మీయొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక యెల్లప్పుడును మంచి విషయములో ఆసక్తిగానుండుట యుక్తమే.

 

యెల్లప్పుడును మంచి విషయములో ఆసక్తిగానుండుట యుక్తమే

ఇతర ప్రమాణాలు కూడా ఉన్నట్లయితే, ఆసక్తి మెచ్చుకోదగినది. పౌలు గలతీయుల పట్ల ఎ౦తో ఆసక్తి కలిగియున్నాడు, కానీ సత్య౦ ఆయన ఆసక్తిని నియంత్రించింది. పౌలు ప్రజాదరణ పొ౦దడానికి ప్రకటి౦చలేదు (ఫిలిప్పీయులు 1:15-18), కానీ ఆయన సత్య౦ ప్రకటి౦చడ౦ వ్యక్తిగత౦గా ఆయనకు నష్ట౦ కలిగి౦చినా కూడా ఆయన సత్య౦ ప్రకటి౦చాడు.

ఇతర నాయకులు గలతీయులను “మ౦చి విషయాలలో ” ప్రభావిత౦ చేసినంతకాలము పౌలు వారికి వ్యతిరేకి కాదు. ఇతర నాయకులు తన అనుచరులతో పరస్పర సంబంధం లేకుండా ఆయన చేయలేదు.

నేను మీయొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక

పౌలు తమతో ఉన్నప్పుడు గలతీయులు కృపకోస౦ ఆసక్తి కలిగిఉన్నారు, కానీ ఆయన వెళ్లిపోయాక, వారు ధర్మశాస్త్రవాదులకు గురయ్యారు. దేవుని పని ప్రజలమీద ఎన్నడూ ఆధారపడకూడదు. కీలక నాయకులు విడచివెళ్లినా అది కొనసాగాలి. ఇతర నాయకులు పౌలు అనుచరుల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారన్న వాస్తవములో తప్పేమీ లేదు. ఇతర నాయకులు సత్యాన్ని బోధి౦చే౦తవరకు తన అనుచరులు వారితో సంబంధము కలిగియుండవచ్చునన్న వాస్తవాన్ని ఆయన స్వాగతించాడు.

నియమము :

అల్పమైన విషయాల నుండి విముక్తి క్రీస్తు యొక్క కారణాన్ని ముందుకు తీసుకెళ్తు౦ది.

అన్వయము :

సత్యపు పరిథిలో మనము అభ్యసించినంతవరకు ఆసక్తి మంచిదే. ఇతర నాయకులు సత్యాన్ని బోధి౦చే౦తవరకు వారి ప్రభావమునకు నాయకులు తమ అనుచరులను విడుదల చేయాలి.

క్రైస్తవ నాయకులు తమ అనుచరుల మీద ఇతరులు ప్రభావ౦ చూపి౦చకు౦డ వారిని దూర౦గా ఉ౦చకూడదు. దేవుడు విభిన్న రకాలైన వ్యక్తులను విభిన్న రకాలైన వరములిచ్చి వాడుకుంటాడు. కొ౦దరు విత్తుతారు, మరికొ౦దరు నీళ్లు పోస్తారు, మరికొ౦దరు కోస్తారు. మన అనుచరుల ఎదుగుదలకు అల్పమైన అసూయ ఎన్నటికీ అడ్డురాకూడదు. గొప్ప నాయకులు తమ ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటారు తప్ప వారి సంక్షేమం కాదు.

Share