Select Page
Read Introduction to Galatians గలతీయులకు

 

నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడువరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది.

 

నా పిల్లలారా

పౌలు తనను తాను తల్లిగా దృష్టి౦చుకొని, గలతీయులను “నా పిల్లలారా” అని పిలుస్తున్నాడు. పౌలు క్రీస్తు ముగించిన కార్యముయందు విశ్వాసపు కృప సూత్రాన్ని బోధించి వారిని రక్షణలోకి నడిపించాడు అనే వాస్తవాన్ని ఆధారం చేసుకొని గలతీయీయులకు తన విజ్ఞప్తిని చేస్తున్నాడు.

“అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీమధ్యను సాధువులమై యుంటిమి. మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి.”     (1 థెస్స 2:7-8)

మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది

ఒక తల్లి బిడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకురావడంలో ప్రసవ వేదన పొందుతుంది. గలతీయ ప్రాంతములో ఉన్నప్పుడు వారిని క్రీస్తు వద్దకు నడిపించడానికి పౌలు ప్రసవ వేదన అనుభవించాడు. ఇప్పుడు ఆయన తమ క్రైస్తవ జీవితానికి కృప సూత్రాన్ని అన్వయి౦చుకోవడానికి సహాయ౦ చేస్తూ “మరల” ప్రసవ వేదన పొందుతున్నాడు. ఒకే బిడ్డ కొరకు రెండుసార్లు ప్రసవవేదన పడే తల్లులు ఎందరు ఉంటారు? కృప సూత్రాన్ని నిరంతర౦ ఎలా జీవి౦చవచ్చో గ్రహి౦చే౦దుకు గలతీయులకు సహాయ౦ చేయాలని ఆయన కోరుతున్నాడు.

క్రీస్తు స్వరూపము మీయందేర్పడువరకు

” ఏర్పడుట ” అనే పదానికి ఆకారాన్ని ఇచ్చుట అని అర్థం. తల్లి గర్భంలో పిండం ఆకారాన్ని తీసుకున్నట్లుగా తన అనుచరులు క్రీస్తు ఆకారాన్ని పొందుకోవాలని పౌలు కోరిక. ధర్మశాస్త్రవాదము ద్వారా, వెలుపల, బాహ్యంగా క్రీస్తు లాగా మారలేం. మనం నిజముగా, అంతరంగికంగా  ఆయనలా తయారవుతాం. మనలో క్రీస్తు స్వరూపమును పొందుకొనుట అనేది దేవుడు కృప ద్వారా మనకు ఇచ్చే అంతర్గత స్వభావం యొక్క బాహ్య వ్యక్తీకరణ. మనం కృప సూత్రం మీద పని చెయ్యకపోతే క్రీస్తు స్వరూపా న్ని పూర్తిగా పొందుకోలేము. కృప క్రీస్తు పోలికను ఇస్తుంది.

“ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.”    (రోమా 8:29-30)

“మన మందరమును ముసుకులేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము.”   (2 కొరింథీ 3:18)

మన క్రైస్తవ జీవితాల బాహ్య రూపం క్రీస్తులోని మన ఆంతరిక జీవితానికి అనుగుణంగా ఉండాలి. మన౦, మనలోని క్రీస్తును బాహ్యంగా రుజువుపరచాలి.

నియమము :

ధర్మశాస్త్రవాదం క్రీస్తు స్వభావాన్ని విశ్వాసిలో అభివృద్ధి చెందకుండా నిరోధిస్తుంది; కృప క్రైస్తవ జీవితములో వృద్ధిచెందడానికి ఆధారము.

అన్వయము :

కొ౦తమ౦ది క్రైస్తవులు రక్షణలో దేవుని కృపను అర్థ౦ చేసుకుంటారు, కానీ తమ స్వంత క్రియలద్వార వారు దేవునితో సత్స౦బ౦ధ౦ కలిగి ఉ౦డే౦దుకు ప్రయత్ని౦చడ౦ ద్వారా క్రైస్తవ జీవితాన్ని అస్థిర౦గా జీవిస్తున్నారు. రక్షణ, పరిశుద్ధత రెండూ విశ్వాసము చేతనే, క్రియల చేత కాదు. క్రియలు ఆథ్యాత్మికతకు ఫలితము కానీ కారణం కాదు.

చాలామ౦ది క్రైస్తవులలో ధర్మశాస్త్రవాదం కారణంగా ఆథ్యాత్మిక ఎదుగుదల అడ్డగించబడుతుంది. స్వయం కృషి ద్వారా క్రీస్తులా మారగలము అనేది ధర్మశాస్త్రవాదము యొక్క ప్రాథమిక లోపం. అలా గనక జరిగితే, అప్పుడు మనము ఒక లోపమున్న రక్షకుని కలిగియున్నట్లే. మన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం కేవలము క్రీస్తును మాత్రమే నమ్మాలి.

పరిశుద్ధాత్మ మనలను నింపడం ద్వారా క్రీస్తును మహిమ పరుస్తాడు (యోహాను 7:39; 16:14; ఎఫెసీయులు 5:18). ఆయన క్రీస్తు యొక్క గుణాన్ని మనలో పుట్టించి, ఆ విధంగా క్రీస్తును మనలో మహిమపరచుచున్నాడు (1 కొరింథీయులకు 3:16; 6:19,20). పరిశుద్ధాత్మ నింపుదల అతీతమైన కార్యము.

“ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచుకొనియుండుడి. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినమువరకును మహిమ కలుగును గాక. ఆమేన్.” (2 పేతురు 3:17-18)

విశ్వాసమును అభ్యసించుట మన హృదయములను క్రీస్తువైపు త్రిప్పుతుంది. మన౦ ఆయన వ్యక్తిత్వాన్ని, కార్యమును విశ్వసించుట వలన క్రీస్తు స్వభావ౦ మనలో వృద్ధి చెందుతుంది.

Share