“తండ్రిచేత నిర్ణయింప బడిన దినము వచ్చువరకు అతడు సంరక్షకులయొక్కయు గృహనిర్వాహకులయొక్కయు అధీనములో ఉండును”
సంరక్షకులయొక్కయు
పౌలు రె౦డు పదాలను ఉపయోగిస్తున్నాడు, అవి ఒక వ్యక్తికి విలువైన వాటిని అప్పగి౦చడ౦ అనే భావాన్ని కలిగి ఉన్నాయి: 1) సంరక్షకుడు, 2) గృహనిర్వాహకుడు. ఈ రెండు పదాలు కూడా వారసుడిపై ఇతరులు అధికారం కలిగి ఉన్నారని సూచిస్తున్నాయి.
కొన్ని విషయాల భద్రత అప్పగించబడినవాడు ఒక “సంరక్షకుడు”. ఈ పదం రెండు గ్రీకు పదాల నుండి వచ్చింది: పైన మరియు త్రిప్పుట, దిశచూపుట. ఈ వ్యక్తికి పిల్లవాడిపై అధికారం అప్పగించబడింది. అతను నిత్య జీవితంలో సంరక్షకుడిగా ఉన్నాడు. ఆ పిల్లవాడు స్నానము చేసి తల దువ్వుకొనేలా చూసుకొనేవాడు. అతను ఒక సహాయకుడు, అంగరక్షకుడు. మన౦ ఎలా ప్రవర్తి౦చాలో బోధి౦చడానికి మోషే ధర్మశాస్త్ర౦ ఒక సహాయకుడు, అంగరక్షకునిగా ఉ౦ది.
గృహనిర్వాహకులయొక్కయు అధీనములో ఉండును
గృహాన్ని పాలించేవాడు “గృహనిర్వాహకుడు”. ఈ వ్యక్తి వారసుడికి వయస్సు వచ్చేవరకు ఆస్తిని నిర్వహించేవాడు. వారసుడి ఆస్తిపై అతనికి అధికారం ఉంది.
తండ్రిచేత నిర్ణయింపబడిన దినము వచ్చువరకు
” నిర్ణయింపబడిన ” అనే పదానికి ముందుగా నియమించబడిన, ముందుగా సిద్ధపరచబడిన అర్థం. ఆ బిడ్డ పెద్దవాడు అవుతాడని ఆ వారసుడి తండ్రి ముందే ఒక సమయాన్ని నియమించియున్నాడు. ఇది తండ్రి చేత నియమించబడిన బాల్యకాలపు రద్దును ఉద్దేశించి వాడే ఏథెన్సువారి చట్టపరమైన పదము.
ఆ వేడుక ఎప్పుడు జరుగుతుంది అనే నిర్ణయానికి దేవుడు “తండ్రి” మూలకర్త. ఆయన మనకు రక్షణను అనుగ్రహించు సమయంలో కృపలో మనకు స్థాన హక్కులను ప్రసాదించును.
నియమము :
బయలుపరచబడిన కృపలో, మనకు దేవునితో ప్రత్యేక హక్కులు ఉన్నాయి
అన్వయము :
దేవుని నిత్యమైన సమయ౦లో, విశ్వాసి కృపక్రి౦ద పనిచేయడానికి ఒక సమయాన్ని ఆయన నియమి౦చుకున్నాడు. విశ్వాసులపై ధర్మశాస్త్రం పాలించవలెనన్న వాస్తవం దాని లోపభూయిష్టతను చూపిస్తుంది. పిల్లవాడు నియమనిబంధనలకు లోబడి ఉండాలి. క్రైస్తవ జీవనానికి పూర్తి స్వేచ్ఛ నియ్యడానికి ధర్మశాస్త్రం అసమర్థమైనది. విశ్వాసుల జీవితాన్ని పూర్తిగా నిమగ్నం చేయడానికి దేవుడు కృప భావనను నియమించిన ఒక సమయం వచ్చింది. ఆ సమయమే దేవుని కుమారుడు భూమిపై అడుగుపెట్టిన సందర్భం.
” ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను ” (యోహాను 1:16-17).
క్రైస్తవులు ధర్మశాస్త్రం వైపునకు తిరిగి మళ్ళినపుడు, వారు తమకుతాముగా నియమనిబంధనల సంరక్షణకు అప్పగించుకుంటున్నారు. క్రీస్తు కార్యాన్ని మనం అంగీకరించినప్పుడు, మనం కృపలో జీవిస్తున్నాం.