Select Page
Read Introduction to Galatians గలతీయులకు

 

ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడియున్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలై యున్నారు; వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును; ఇది హాగరు. ఈ హాగరు అనునది అరేబియాదేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతోకూడ దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయియున్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకు తల్లి.

ఇందుకు కనని గొడ్రాలా సంతోషించుము,

ప్రసవవేదనపడని దానా, బిగ్గరగా కేకలువేయుము;

ఏలయనగా పెనిమిటిగలదాని పిల్లలకంటె పెనిమిటి లేనిదాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు

అని వ్రాయబడియున్నది.

 

ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడియున్నవి

పౌలు ఒక చారిత్రక పరిస్థితిని ఉపయోగించి ధర్మశాస్త్రవాదముపై కృప యొక్క ఆధిక్యతను ఉదహరించాడు. ” అలంకార రూపకము ” అనే గ్రీకు పదం ఉపమానములకు సంబంధించిన పదం అయినప్పటికీ, ఇది కల్పన వెనుక సత్యాన్ని దాచుటకాదు. ఈ పదబంధాన్ని మనం “ఒక పోలిక కలిగిన ” అని అనువదించవచ్చు. శారా, హాగరుల వాస్తవ చరిత్రను పౌలు ఉపమాన౦గా ఉపయోగించాడు. ఆదికా౦డము 16-21 ని అక్షరార్థంగా ఆయన వ్యాఖ్యాని౦చడ౦ లేదు. ఆయన తన అనువాదములో ఈ స్త్రీలను జాగ్రత్తగా లేఖన సత్యాలకు అన్వయిస్తున్నాడు.

” ఈ సంగతులు ” అనే పదానికి ఈ విషయాలతో కూడిన సంగతులు అని అర్థం. కాబట్టి, ఈ విషయాలను మనం సూత్రప్రాయంగా తీసుకొని, నేడు మన జీవితాలకు అన్వయించుకోవచ్చు.

ఈ స్త్రీలు రెండు నిబంధనలై యున్నారు

దాసియైన హాగరు,  మోషే నిబ౦ధనకు ప్రాతినిధ్య౦ వహిస్తుంది – ధర్మశాస్త్ర౦. శారా అబ్రహాము నిబంధనకు ప్రాతినిధ్య౦ వహిస్తో౦ది, వాగ్ధాన నిబంధన. అబ్రహాము నిబ౦ధన ఒక షరతులేని వాగ్దాన౦. ఆ నిబ౦ధనను నెరవేర్చే బాధ్యత పూర్తిగా దేవునిపైనే ఉ౦ది గానీ అబ్రాహాముమీద కాదు.

ధర్మశాస్త్రము యొక్క ఉద్దేశము, మనకు రక్షకుని ఆవశ్యకతను తెలియజేయుట అన్న విషయాన్ని పౌలు ముందుగానే ఉద్ఘాటించాడు (గలతీయులు 3:10). ఇది రక్షణకు, పరిశుద్ధతకు సంబంధించిన వ్యవస్థ కాదు.

వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును; ఇది హాగరు.

అబ్రాహాముకు ఇద్దరు కుమారులు జన్మి౦చిన పరిస్థితిని ధర్మశాస్త్రానికి కృపకు మధ్య గల వ్యత్యాసానికి “సూచనార్థక” ఉపమాన౦గా పౌలు ఉపయోగి౦చాడు. ఒక చారిత్రక పరిస్థితిని ఆయన దృష్టాంతంగా మార్చాడు. ఉదాహరణలో హాగరు ఒక దాసిగా ధర్మశాస్త్రమును సూచిస్తుంది. శారా, స్వతంత్రురాలుగా, కృపను సూచిస్తు౦ది.

ధర్మశాస్త్రవాదులు మోషే నిబంధనకు కట్టుబడియున్నారు. కృపను అనుభవిస్తున్న వారు అబ్రహాము నిబంధనలోని కృపా నిబంధనకు కట్టుబడియున్నారు.

ఈ హాగరు అనునది అరేబియాదేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతోకూడ దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయియున్నది.

పౌలు మరో రూపకాన్ని పరిచయ౦ చేశాడు- భూమిపై ఉన్న యెరూషలేముకు పరమ యెరూషలేముకు మధ్య ఉన్న వ్యత్యాస౦. ” దీటయియున్నది ” అనే పదం సమాన స్థాయిలో ఉన్నది అని తెలుపుతుంది. ” ప్రస్తుతమందున్న ” యెరూషలేము పౌలు కాల౦లోని యెరూషలేము. మోషే ధర్మశాస్త్రాన్ని పొ౦దిన స్థల౦ “సీనాయి పర్వత౦”. పౌలు కాల౦లోని యెరూషలేము, సీనాయి పర్వత౦ రెండూ కూడా ధర్మశాస్త్రవాదముతో సమాన౦గా ఉన్నాయి.

అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకు తల్లి

నిజమైన విశ్వాసులు “పైన నున్న యెరూషలేము” నకు పిల్లలు, ఈ యెరూషలేము ” స్వతంత్రమైనది”. మన౦ దేవుని అనుగ్రహాన్ని క్రియల మూలముగా పొ౦దము; మనము దేవుని కృపను ఉచితముగా పొందుదుము (గలతీయులు 5:1; 2 కొరింథీయులకు 3:17-18). స్వతంత్రత అనేది కృపకు తల్లి. క్రీస్తు సిలువపై చేసిన కార్యము వలన రక్షణ మరియు పరిశుద్ధత ఉచితం.

ఇందుకు

కనని గొడ్రాలా సంతోషించుముప్రసవవేదనపడనిదానా, బిగ్గరగా కేకలువేయుము;

ఏలయనగా పెనిమిటిగలదాని పిల్లలకంటె పెనిమిటి లేనిదాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు అని వ్రాయబడియున్నది

ఈ వచన౦ యెషయా 54:1లో నుండి గ్రహించబడిన భాగం, ఇశ్రాయేలు భవిష్యత్తుకు స౦బ౦ది౦చిన ప్రవచన౦. ఆ వచనభాగం బబులోనులో ఇశ్రాయేలు చెర గురి౦చి మాట్లాడుతు౦ది. ఇశ్రాయేలు పిల్లలు లేని వివాహిత స్త్రీలా ఉ౦ది. “మరి౦త మ౦ది పిల్లలు” ఉన్న స్త్రీ, ఇశ్రాయేలీయులు ప్రత్యేకి౦చి వెయ్యేండ్లకాలములో క్రీస్తు భూమ్మీద పరిపాలించునప్పుడు సమకూర్చబడే ఇశ్రాయేలు. క్రైస్తవులు నూతన యెరూషలేములో కృప ద్వారా పనిచేస్తారు తప్ప క్రియల ద్వారా కాదు. పరలోక౦లోని నూతన యెరూషలేములో లేదా వెయ్యే౦డ్ల లోని పునరుద్ధరి౦చబడిన యెరూషలేములో క్రైస్తవులు కృపతో నివశిస్తారు.

నియమము :

లేఖనాన్ని అర్థం చేసుకోవడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, ఇతర సాహిత్యాన్ని వ్యాఖ్యానించే సాధారణ పద్దతిని అనుసరించడమే, దీని ద్వారా మనం కృప అనే సూత్రాన్ని కనుగొనగలము.

అన్వయము :

లేఖన౦ అర్థ౦ చేసుకోవడానికి అత్యుత్తమ మార్గ౦, దాన్ని సాధారణ౦గా అర్థ౦ చేసుకోవడమే. ఉపమాన పద్ధతిలో లేఖన౦లోని సాధారణ భావాన్ని ఆధ్యాత్మిక భావానికి అర్థ౦గా పరిగణిస్తు౦ది. అయితే, ఈ పద్ధతితో సమస్య ఏమిటంటే, వస్తురూపక సమాచారము అనేది విషయ అర్థముపై ముఖ్య పాత్ర పోషించదు, అయితే భాగములోని ”ఆధ్యాత్మికత ” ఏమిటో ఒకరి అభిప్రాయం అవగాహనను నియంత్రిస్తుంది. ఆత్మీయ అర్థములో వ్యాఖ్యాత అభిప్రాయమును ఆ భాగమును వ్యక్తిగత అభిప్రాయాలకు గురి చేస్తూ దానిని ముఖ్యాంశముగా చేస్తుంది. రూపక వ్యాఖ్యానం అనేది విషయాత్మకమైనది, అయితే సాధారణ వ్యాఖ్యానం మరింత క్రియాత్మకమైనది.

లేఖనాలను అర్థ౦ చేసుకోవడానికి ఉపయోగించే ఉపమాన పద్దతికీ, బోధనా ఉపకరణ౦గా ఉపయోగి౦చే రూపక పద్ధతికి మధ్య తేడా ఉ౦ది. ఉపమాన పద్ధతి, ఆధ్మాత్మిక అర్థాన్ని చేరుకునేందుకు ఆ భాగము యొక్క సాధారణ అర్థాన్ని మారుస్తుంది. ధ్వని భాష్యం ఎల్లప్పుడూ చరిత్ర, వ్యాకరణం, సందర్భం, సంఘటన మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుంటుంది. బైబిలులోని ఉపమాన పద్దతి సత్య౦ యొక్క వివరణను కోరుకు౦టుంది. అది సత్యాన్నే అనుభవానికి అన్వయించాలని కూడా ప్రయత్నిస్తుంది.

ఇవన్నీ పాత నిబంధనలోనైనా లేదా కొత్త నిబంధనలోనైనా, దేవుడు ఎల్లప్పుడూ మనతో కృపతో వ్యవహరిస్తాడని తెలియజేస్తాయి.

Share