“ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లు కానివారికి దాసులై యుంటిరి గాని”
పౌలు ఇప్పుడు గలతీయులకు మత బానిసత్వ౦లోనికి తిరిగివెళ్లవద్దని విజ్ఞప్తి చేస్తున్నాడు. వారు గ్రీకో-రోమన్ మతానికి బానిసలై యుండిరి. ఇప్పుడు ధర్మశాస్త్రవాదులు వారిని తిరిగి ధర్మశాస్త్రానికి దాసులుగా, మత బానిసలుగా తీసుకోవాలని కోరుతున్నారు. కృపా నియమానికి కట్టుబడి ఉండాలని, ధర్మశాస్త్రవాదనకు తిరిగి రావద్దని పౌలు వారిని విజ్ఞప్తి చేస్తున్నాడు (4:8-20).
ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై
సత్య దేవుని గురించి గలతీయులకు తెలియని ఒక సమయము ఉండెను- క్రీస్తుకు ముందు జీవితం. యూదులు ధర్మశాస్త్రానికి బానిసలై యుండిరి, అన్యులైన గలతీయులు ఆ దేశవిగ్రహాలకు బానిసలుగా యుండిరి. అన్యజనులు ధర్మశాస్త్రవాద మత౦లోకి ఎ౦దుకు వెళ్లాలి? సువార్త వారి వద్దకు రాకముందే మత బానిసత్వం గురించి వారికి ముందే తెలుసు.
నిజమునకు దేవుళ్లు కానివారికి దాసులై యుంటిరి గాని
మొదటి శతాబ్దానికి చెందిన బహుదేవతామూర్తులు సహజమైన గుణములు, లక్షణాలు లేదా స్థితినిబట్టి నిజమైన దేవుళ్ళు కాదు. రోమన్ సామ్రాజ్యంలో ఉన్న దేవుళ్ళ సముదాయపు రాజ్యాంగము శూన్యము. ఆఫ్రోడైట్, జ్యూస్ లు వారికి సహాయ౦ చేయలేకపోయారు, ఎ౦దుక౦టే వారు నిజ౦గా లేరు. గలతీయులు జ్యూస్ మరియు హెర్మెస్ లకు బానిసగా ఉన్నారు (అపో. కా 14:11-13) అబద్ధ దేవుళ్ళకు బానిసత్వ౦ గురి౦చి వారు అర్థ౦ చేసుకున్నారు. ఈ బాధాకరమైన బానిసత్వం వారిని ఏ సహాయమూ చేయలేని చనిపోయిన దేవతలకు లోబడేలా చేసింది. ఉనికి లేని వస్తువు ఎవరికైనా ఎలా సహాయ౦ చేయగలదు?
కుమారత్వము స్వతంత్రత కానీ మతం బానిసత్వం. మత బానిసత్వం లో ఉన్న వారి పరిస్థితి విచారకరం. ఇది కృప యొక్క మహిమగల స్వేచ్ఛలో నివసించే వారికి ఒక గొప్ప వ్యత్యాసం.
నియమము :
ధర్మశాస్త్రవాదములోనికి తిరిగి రావడ౦ మూర్ఖత్వ౦.
అన్వయము :
కృపా నియమానికి కట్టుబడిన క్రైస్తవులు తిరిగి ధర్మశాస్త్రవాదములోనికి తిరిగి మరలడాన్ని చూడడం ఒక ఆశ్చర్యమైన, భయ౦కరమైన విషయ౦. క్రియలు లేకుండా, ప్రయాస లేకుండా రక్షణ అను కృపా సువార్తను హత్తుకొని ఆ తరువాత స్వీయప్రయాసకు మరలడం క్రీస్తు చేసిన కార్యముపై దృష్టి కొల్పోవడమే.
మనం ధర్మశాస్త్రవాదములోనికి తిరిగి వెళ్తే, మనము మతబందకములలోనికి స్వతహాగా వెళ్తున్నాము. నేడు అనేకమంది తాము చేయలేని పనిని పూనుకుంటున్నారు. క్రీస్తు సిలువపై ముగించిన కార్యమును చూడకుండా మన మనసులకు గ్రుడ్డితనము కలుగజేయడమే సాతాను ఉద్దేశ్యం.
“ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పని వారునై యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.” (2 కొరింథీ 11:13-15)
ధర్మశాస్త్రవాదములోని దుఃఖానికి వెళ్లడానికి, కృపలోని సౌందర్యమును విడచిపెట్టేవిధముగా మనలను ఒప్పించడమే సాతాను లక్ష్యం.