“యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బలహీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన మూల పాఠములతట్టు మరల తిరుగనేల?మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల?”
యిప్పుడు
“ఇప్పుడు” గలతీయులు మారిన తరువాత వ్యత్యాసాన్ని ఉద్దేశించినది.
మీరు దేవునిని ఎరిగినవారును
ఇప్పుడు గలతీయులు దేవుని వ్యక్తిగత స్థాయిలో [సన్నిహితముగా] “ఎరిగి” దేవుని వద్దకు వచ్చారు, వారు ధర్మశాస్త్రవాదములోనికి ఎందుకు తిరిగి చేరుతారు? క్రైస్తవం ఒక సంబంధం, మతం కాదు.
విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక
పౌలు మునుపటి పదసమూహములోని ప్రాముఖ్యతను సరిచేసాడు. దేవుని అనుగ్రహాన్ని పొ౦దడానికి గలతీయుల చేసిన ప్రయత్నాల వల్ల రక్షణ లేదు, కానీ దేవుడు వారి రక్షణను కోట్లాది స౦వత్సరాల ముందే సంకల్పించాడు.
గలతీయులకు దేవుని గురి౦చిన జ్ఞాన౦ వారిలోను౦డి రాలేదు; దైవానుగ్రహం నుండి వచ్చింది సువార్తయొక్క సార్వభౌమ కృపద్వార వచ్చింది. వారి జీవితాల్లో మార్పును చేసింది వారు కాదు, సువార్త. ఆయన చొరవ తీసుకున్నందువల్లనే మనము దేవుని తెలుసుకున్నాము.
తిరుగనేల
తమ స్వయ౦ ప్రయత్న౦ ద్వారా వారు క్రీస్తు దగ్గరకు రాలేదు అన్న వెలుగులో గలతీయులు ధర్మశాస్త్రవాదమునకు తిరుగుట ఎలా సాద్యం?
బలహీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన మూల పాఠములతట్టు మరల తిరుగనేల?
” మరల తిరుగుట” అనే పదాలు మారుట అనే అర్థం ఇస్తుంది. ఒకరు ఒక నమ్మకమువైపు తిరిగేదానిపై దృష్టికేంద్రీకరించే పదము ఇది. అంటే కృప నుండి వెనుదిరిగే విధముగా ఒక వ్యక్తియొక్క జీవనవిధానాన్ని ఒక నిర్దిష్ట దిశలో త్రిప్పడం. గలతీయులు తిరిగి ధర్మశాస్త్రవాదములోనికి మారే ప్రక్రియలో ఉన్నారు. వారు క్రీస్తు వద్దకు రాకముందు వారి రక్తంలో ధర్మశాస్త్రవాదము ఉండేది, అందువల్ల దానివైపు తిరిగి మరలడానికి ఒక సహజ ధోరణి ఉంది. వారి విషయానికి వస్తే, వారు “బలహీనమైన నిష్ప్రయోజనమైన మూలపాఠముల” వైపు తిరిగారు.
” బలహీనమైనది ” అంటే శక్తిహీనమైనది, నీచమైనది అని అర్థం. గలతీయులు శక్తిహీనమైన విశ్వాసపు ధర్మశాస్త్రవాదమువైపు ఎందుకు తిరుగుతున్నారు? ధర్మశాస్త్రవాదము యొక్క పరిమిత సామర్థ్యం కారణంగా ఇది వారిని నిస్సహాయ స్థితిలోకి నెట్టివేస్తుంది. ధర్మశాస్త్రవాదములో కృపా ఐశ్వర్యం లోపిస్తుంది ఎందుకంటే సిలువపై క్రీస్తు చేసిన కృషితో పోలిస్తే స్వయం కృషి అసంగతమైనది. ధర్మశాస్త్రానికి ఎవరినీ రక్షించగలిగే సామర్థ్యం ఎన్నటికీ లేదు.
“నిష్ప్రయోజనమైనవి ” అంటే దరిద్రమైనవి అని అర్థం. ధర్మశాస్త్రవాదమును కృపతో పోల్చినపుడు దరిద్రమైనదే. దానికి రక్షణను లేదా పవిత్రతను ఇవ్వడానికి తగినంత పెట్టుబడి లేదు.
కృపతో పోల్చినపుడు ధర్మశాస్త్రవాదము మూలపాఠమే. ” మూలపాఠము ” అనే పదానికి ప్రాథమిక అంశము అని అర్థం. లౌకిక గ్రీకు ప్రపంచం ఈ పదాన్ని విశ్వాన్ని కూర్చే ప్రాథమిక పదార్థాలకు ఉపయోగించింది. ఈ మొదటి విషయం నుండి ఇతర విషయాలు ఉద్భవిస్తాయి, ఒక ప్రాథమిక సూత్రం. ధర్మశాస్త్రవాదనలోని మొదటి సూత్రం ఏమిటంటే, ఒక వ్యక్తి దేవునితో తమ హక్కులను సంపాదించాలి. అందుకే ధర్మశాస్త్రవాదము కృపతో పోల్చినపుడు దరిద్రమైనది.
మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల?
ధర్మశాస్త్రవాదమునకు మరలడం అంటే అన్యమతానికి తిరిగి వెళ్లడమే. అన్యదేవతలక్రింద బానిసత్వం వారికి కొంత తెలుసు, అదేవిధమైన ధర్మశాస్త్రవాద దాసత్వములోనికి వారు ఎందుకు వెళతారు? స్వీయ ప్రయాస ద్వారా మనము దేవుని కనుగొనలేము. రక్షణను మరియు పవిత్రతను ప్రసాదించలేని శక్తిహీనమైనది ధర్మశాస్త్రవాదము. సువార్త ఇచ్చే ఫలితాలను ఇది ఉత్పత్తి చేయలేదు.
నియమము :
మానవుని క్రియల ప్రయాస వ్యర్థము. దేవుని కృప మనకు ఐశ్వర్యము.
అన్వయము :
రక్షణ కృపనుబట్టియే. దేవుడు మనలను కనుగొన్నాడు; మనము ఆయనను కనుగొనలేదు. దేవుడు తన కృపను మనకు విస్తరింపజేసియున్నాడు; మనము ఆయనకు ఏమీ ఇవ్వలేదు. దేవుని అనుగ్రహాన్ని, ఆమోదమును స౦పాది౦చుకోవడానికి మన౦ వెనక్కి తిరిగినప్పుడు, ఆధ్యాత్మిక౦గా గడియారాన్ని వెనక్కి మళ్ళిస్తాము. పూర్వదశకు మళ్ళడానికి అవకాశం ఉంది. ఏదో విధంగా, రక్షణను లేదా క్రైస్తవ జీవితాన్ని మనపై ఆధారపడాలని కోరుకుంటాం. అది బైబిలు ఆధార౦గా లేని ఒక వెచ్చని, అద్భుతమైన అనుభూతి.
చాలామ౦ది ప్రజలు తమ మత౦ విడచి క్రీస్తు సిలువపై సంపూర్తిచేసిన కార్యములో లభించే కృపా సువార్తను స్వీకరించాలి. స్వయం కృషితో సంతృప్తిపడే వారికి ఇది చేదు మాత్ర.