గలతీయులకు వ్రాసిన పత్రిక పరిచయము
డా. గ్రాంట్ సి. రిచిసన్
(అనువాదము: డేవిడ్ నల్లపు, జాషువా నల్లపు)
1 గలతీయులకు వ్రాసిన పత్రిక ప్రాముఖ్యత
- అపో. పౌలు వ్రాసిన పత్రికలలో ఒకానొక గొప్ప మరియు ప్రాముఖ్యమైన పత్రిక
- పౌలు బొధనలలోని మౌలిక విషయములు కలిగి ఉన్నది (1:12)
- గలతీ పత్రిక ఒక సంక్షిప్త రోమా పత్రిక
- రెండు పత్రికలు ముఖ్యాంశము మరియు విషయములో పోలికలు కలిగిఉన్నవి
- రెండు పత్రికలు నైతిక మార్పును కలిగించు నీతిమంతులుగా తీర్చబడుటను గూర్చి బోధించును.
- గలతీ పత్రిక మరియు రోమా పత్రికల మధ్య సంబంధము
- రోమా పత్రికకు గలతీ పత్రిక అస్పష్టమైన ముఖ్యాంశము కాదు
- రెంటిలో వేరువేరు వాదనలు కలవు:
- రోమా పత్రిక క్రైస్తవ్యము యొక్క ప్రబంధనము
- గలతీ పత్రిక న్యాయవాదమునకు వ్యతిరేకముగా తర్కము
- గొప్ప చారిత్రిక వ్యక్తులు గలతీ పత్రికను ఘనమైనదిగా ఎంచిరి
- సంస్కరణయొక్క యుద్ధ ఘోష – క్రీస్తులోని స్వాతంత్ర్యము యొక్క ప్రకటన పత్రం
- గలతీ పత్రిక సంస్కరణ యొక్క “మూలరాయి”గా పిలువబడుచున్నది
- లూథర్ కు ప్రియమైనది – “మధ్య యుగములొని పోపు ధిగ్గజాలను కొట్టుటకు చిన్నయేఱు నుండి తీయబడిన చిన్న రాయి”
- లూథర్ గలతీ పత్రికను తన “భార్యగా” పోల్చెను. – “గలతీ పత్రిక నాకు పత్రిక. దానికి నెను వివాహము చేయబడిన వానిగా ఎంచుకొంటున్నాను. అది నా క్యాథరీన్”
- గలతీ పత్రిక క్రైస్తవ స్వాతంత్ర్యము యొక్క మూల విశ్వాస సంగ్రహం
- గలతీ పత్రిక క్రైస్తవ స్వాతంత్ర్యము యొక్క హక్కుల పత్రం.
- అది సువార్త మీద దాడిని ఎదుర్కొను కంచు కోట
- క్రియలవలన రక్షణ, క్రియలవలన ఆధ్యాత్మికత అను బోధలకు నుండి మరియు క్రైస్తవ స్వాతంత్ర్యము పై దాడి నుండి కాపాడుతుంది
- పౌలు పత్రికలలో ఒకానొక అత్యంత ప్రభావవంతమైన పత్రిక
- పాపము యొక్క రుణము , శక్తికి పైగా సువార్త శక్తిని గలతీ పత్రిక ప్రకటిస్తుంది
- రచయిత
- సంఘము సహజముగా గలతీ పత్రికను పౌలు హస్తమునుండి అంగీకరిస్తుంది
- పౌలు వద్దనుండి అన్నట్లుగా సంఘకాపరులు గలతి పత్రికను స్వీకరించారు
పాలీకార్పు, 116; క్లెమెంట్ ఆఫ్ రోమ్, 96; ఇగ్నేషియస్, 115; 117 వ స౦ఘ౦లోని డయోగ్నెటస్కు వ్రాసిన పత్రిక రచయిత, దాని మీద తను ఆధారపడటాన్ని చూపి౦చాడు.
మారికొన్, 130, తన కాటలాగ్ లొ పొందుపరచాడు, కాని తన విశేష బొధనలను వ్యతిరేకించు రెండు వాక్య భాగములను విడిచెను.
జస్టిన్ మార్టిర్, 145, మరియు సిరియనుడైన టాటియన్ 150-170 దానిని ఉటంకించారు. మురటోరి కానన్, 170, సిరియాక్, ప్రాచీన లాటిన్ 170 ప్రచురణలలొ ఇది కనిపిస్తుంది.
సంప్రదాయవ్యతిరేకులు ఓఫైటస్తొ సహా ఇతరులు దానిని ఉపయోగించారు
ఇరేనియస్, తెర్తుల్లన్, అలగ్జండెర్ లోని క్లెమెంతు పలుమారులు పేరుతో ఉటంకించి పౌలును రచయితగా పేర్కొన్నాడు.
- నిరుపించు బలమైన అంతరంగ ఆధారములు కలిగి ఉన్నది.
- పౌలు తన్ను తాను పేర్కున్నాడు 1:1; 5:2
- మొదటి రెండు అధ్యాయములలోని చారిత్రిక వచనములు అపో. కా. లోని పౌలు యొక్క మిషనరీ ప్రయాణములకు సరిపోతుంది
- పత్రికలో పౌలు యొక్క చాతుర్యము, ఆసక్తి ఙానము, శైలి స్పష్టముగా కనిపిస్తుంది
- క్రీస్తు నందు స్వాతంత్ర్యత అనునది పౌలు బోధ యొక్క ములాంశము 5:1
III. జూడైజర్లు
- యూదామతసంబంధ ధర్మశాస్త్రవాదముకు వ్యతిరిక్తముగా గలతీ పత్రిక వ్రాయబడినది
- జూడైజర్లు ఎవరు?
- “జూడైజర్లు” ఒక మతపరమైన స్థానము, ఒక జాతి యొక్క వర్ణన కాదు.
- ధర్మశాస్త్రవాద సూత్రాలక్రింద క్రైస్తవులు జీవించవలెనని జూడైజర్ల నమ్మకము
- పౌలు యొక్క కృపను “చవకబారు కృప”గా చూసారు.
- వారు సున్నతి పొంది ఇతరులు కూడా అలానే ఉండాలని
- వారు పౌలును మూడు విషయాలలొ పౌలు పై దాడి చేసారు:
- తన ఆధికారము
- తన కృపా సువార్త – విశ్వాసము మరియు క్రియల వలన రక్షణ
- పరిశుధ్ధత స్వాతంత్రత నిస్తుంది అను తన ద్రుక్పథమును వారు ఉటంకించారు – వారు ఆధ్యాత్మికత విస్వాసము మరియు క్రియలవలన కలుగుతుంది అని విశ్వసించారు
- ఇది యేసు తన దినములలో ఎదిరించిన పరిసయ్యుల వాదన వంటిది
- గలతీ పత్రిక వెనుక వరుస సంఘటనలు
- అన్యజనులలో నుండి రక్షణ పొందిన సంఘము అంతియొకయలో ఏర్పడి వారి మొదటి మిషనరీలను పంపారు. (పౌలు బర్నబా, మార్కు) క్రీ.శ. 46, అపో.కా. 11:19-15:35. అపో.కా. 13:2
- పౌలు బర్నబాలు సిరియాలోని అంతియోకయకు తిరిగి వచ్చిరి అపో. కా. 14:28
- పేతురు అంతితోకయకు వచ్చి వేశధారణతో ధర్మశాస్త్రవాదముతొ ప్రవేశించెను(Ga 2:11f).
- యెరూషలేము నుండీ ధర్మశాస్త్రవాదమును సమర్ధించువారు మొదటి మిషనరీ ప్రయాణమును తప్పుబట్టుట
- పౌలు బర్నబాలు యెరూషలేమును “కరువు” సమయములో సందర్శించుట
- గలతీ పత్రిక వ్రాయుట: క్రీ.శ. 49.
- మొదటి సంఘ మండలి న్యాయవాదమును సరిచేసి కృపను ధృఢపరచుట. అపో.కా. 15
- నేపద్యం
- క్రీ. పూ. 278 -27 ఐరోపానుండి చిన్న అశియా (నేటి టర్కీ)కు వలస వచ్చిన గౌల్సు అను పెద్ద సమూహము నుండి “గలతియ” అను పదము వచ్చినది
- క్రీ. పూ. 232 తరువాత సరిహద్దులు ఏర్పడి వారి రాజ్యము గలతియగా మారినది. గలతియ రోమా సామ్రజ్యముకు లోబడి క్రీ. పూ. 25 లో రోమా యొక్క ఒకానొక ప్రాంతముగా మారినది.
- పత్రిక యొక్క కాలము గమ్యము
- గమ్యము : దక్షిణ గలతియ
- కాలము: క్రీ.శ. 49, యెరూషలేము మండలికి ముందు
VII. ఉద్దేశము: ధర్మశాస్త్రము పాపిని రక్షింపజాలదు, పరిశుధ్ధుని పవిత్రపరచలేదు
- సత్య సువార్తను కాపడుటకు
- అబద్ద బోధలను వెల్లడిపరచి ఖండించుటకు
- ధర్మశాస్త్రము యొక్క వాస్తవమైన ఉద్దేశమును తెలుపుటకు
- ఆత్మయందు నడచుకొనుట వలన క్రైస్తవ జీవితములో విశ్వాసి సంపూర్ణత కలిగి ఉండుటను తెలుపుటకు 5:16
VIII. విశేషాలు:
- అత్యంత ఉన్నత సిద్దంతపర విషయము.
- స్వాభావికముగా ప్రతివాదము
- పరిచయములో స్తుతి లేదు
- పత్రిక అంతటిలో మెప్పు లేదు
- వ్యక్తిగత నమస్కారములు లేవు
- పూర్తిగా పౌలు స్వహస్తములతో వ్రాయబడిన ఏకైక పత్రిక
- క్రొత్త నిబంధన అంతటిలో అధికముగా స్వీయచరిత్రగల వాటిలో గలతీ మరియు 2 కొరింధీయులకు.
- అన్ని పత్రికలకన్నా ఘాటైనది1:6,8; 2:6,11; 3:1; 4:11; 5:4,10,12.
- ధర్మశాస్త్రము మరియు కృపల వ్యత్యాసాలను తెలుపును
(ముఖ్యమైన విహయమేమంటే, ధర్మశాస్త్రమును నెరవెర్చపోలేని కారణమున, ధర్మశాస్త్రము మానవుని దేవుని కృప వద్దకు నడిపించును )
- రోమా పత్రికను పోలి ఉన్నది:
- గలతీ = వ్యతిరేకార్థకము: సత్యము కానిది
రోమా = నిశ్చయాత్మకం : సత్యమైనది
- గలతీ = నిమ్మళమైనది కాదు, క్రమమైనది కాదు
రోమా = నిమ్మళమైనది, క్రమమైనది
- గలతీ = సువార్త భధ్రపరచబడుచున్నది
రోమా = సువార్త నిర్వచింపబడినది
- హబ్బక్కుకు 2:4 మీద హెబ్రీ, రోమా మరియు గలతీ పత్రికలు ఆధారపడి ఉన్నవి
- ఈ పత్రిక కన్న చరిత్రలోని కొన్ని గ్రంధములు మానవునిపై గొప్ప ప్రభావమును కలిగి ఉన్నవి.
- 3098 పదములు (కెజెవి ఆంగ్ల ప్రచుణలో), 149 వచనములు, 6 అధ్యాయములు
- క్రొత్త నిబంధనలో సంఘముల సమూహముకు వ్రాయబడిన ఏకైక పత్రిక 1:2
- స్వరము:
- యుద్ధవాతవరణము
- ఉగ్రత తొ కూడిన మాటలు 1:8
- అనూహ్యమైన కటినమైన శైలి
- విశ్వాసమును కాపాడుటలో తీక్షణము
- అధిక సిధ్ధాంతపరము, అత్యంత వ్యక్తిగతము
- దాదాపు మూడవ వంతు స్వీయ చరిత్ర (పౌలు పత్రికలలో అత్యంత స్వీయచారిత్రికము)
- శోకము అనూహ్యమైనది అత్యంత భావోద్రేకమైనది
- గలతీ 6:11 లో విశేషమైన ముగింపు
- సంధర్భము
- ధర్మశాస్త్రవాదులు పౌలుయొక్క గలతీ పర్యటనను తప్పుబట్టారు
- పౌలు మీద రెండింతల దాడి:
- పౌలు యొక్క వ్యక్తిత్వమును కించపరచుట
- పౌలు యొక్క సందేశమును కించపరచుట
- గలతీయులు ధర్మశాస్త్రవాదముపట్ల నమ్మిక కలిగి ఉన్నారు
- మూల వచనము – 5:1
- మూల పదములు:
ధర్మశాస్త్రము = 32 మార్లు
విశ్వాసము = 21 మార్లు
XII. ముఖ్యాంశము: ప్రత్యేకించి పరిశుధ్ధపరచబడుటయందు ధర్మశాస్త్రముకంటే కృప యొక్క ఔన్నన్యత్యము
తన స్వశక్తితో మానవుడు దేవుని ధర్మశాస్తమునకు లోబడలేడు. కేవలము విశ్వాసముద్వారా కృప మాత్రమే క్రైస్తవ జీవితము జీవించుటకు స్వాత్యంత్రము కలిగించును.
XIII. సారంశము
పరిచయము1:1-10
- వందన వచనములు1:1-5
- గలతీ పత్రిక సంధర్భము1:6-10
- చరిత్రలో పౌలు యొక్క అపోస్తలత్వము యొక్క నిరూపణ1:11-2:21
- పౌలు యొక్క కృపా సువార్త మానవులనుండి కాదు ప్రత్యక్షత వలననే 1:11-12
- రెండు వాదనలతో పౌలు తన కృప సువార్తగురించి వాదించుట:
- పౌలు తన సందేశమును యే మానవవనరునుండి కాక సూటి ప్రత్యక్షత వలననే పొందుకొనెను 1:13-17
- పౌలు తన సందెశమును మూడు విధములుగా రూఢి పరచెను 1:18-2:21.
1వ స్థాపన, 1:18-24
2వ స్థాపన, 2:1-10
3వ స్థాపన, 2:11-21
- విశ్వాసమువలననే నీతిమంతులుగా తీర్చబడుట అను పౌలు బోధనకు సమర్ధన , 3:1-4:31
- కృప విశ్వాసమువలననే, క్రియలవలన కాదు 3:1-5
- అబ్రహాము క్రియలవలన నీతిమంతునిగా తీర్చబడెను 3:6-14
- నీతిమంతునిగా తీర్చబడుట వగ్ధానము నందు విశ్వాసముంచుట వలన జరుగును 3:15-16
- నీతిమంతునిగా తీర్చబడుట విశ్వాసమువలన కలుగును, మోషే ధర్మశాస్త్రము వలన కాదు 3:17-29
- క్రీస్తునందు మన స్థానము కృప వలననే 4:1-11
- గలతీయులు క్రీస్తును విశ్వాసముద్వారా కృపచేతనే అంగీకరించిరి 4:12-20
- క్రియలు విశ్వాసము పరస్పరము వేరైనవి 4:21-31
III. పౌలుయొక్క ఆచరణీయ మనవి 5:1-6:10
- ధర్మశాస్త్ర వాదము క్రింద ఉండు జీవితము 5:1-12
- ధర్మశాస్త్ర వాదము విస్వాసిని వశపరచుకొనును 5:1-2
- ధర్మశాస్త్ర వాదము విశ్వాసిని రుణస్తునిగా చేస్తుంది 5:3
- ధర్మశాస్త్ర వాదమువిశ్వాసిని క్రీస్తునుండి దూరపరచును 5:4-6
- ధర్మశాస్త్ర వాదము కృపవైపు మళ్ళకుండా అడ్డుగా నిలుచును 5:7-10
- ధర్మశాస్త్ర వాదము సిలువ యొక్క అవసరమును తొలగిస్తుంది ఎందుచేతననగా క్రీస్తుకాక మానవుడే చేయుచున్నందున 5:11-12
- ధర్మశాస్త్ర వాదములోనికి పడకుండా స్వాతంత్ర్యమును చూచుకొనవలెను 5:13-15
- ఆత్మానుసారమైన జీవితము దేవుని ఏర్పాటులు (కృప) వలన జీవించుట, అది ప్రభువుకొరకు జీవించుటకైన స్వతంత్ర్యము కాని పాపము చేయుటకు కాదు. 5:16-21
- ధర్మశాస్త్రము వలే కాక, పరిశుధ్ధాత్మ దేవుడు దేవునికొరకు జీవించుటకు విశ్వాసిని బలపరచును 5:22-26
- కృప ప్రజలకు పరిచర్య చేయును 6:1-10.
- కృప పాపిని రక్షించును6:1
- భారము కలిగిన వ్యక్తికి కృప పరిచర్య చేయును6:2-5
- కృప నాయకునికి పరిచర్య చేయును 6:6-9
- కృప అందరికి పరిచర్య చేయును6:10
ముగింపు 6:11-18
- పత్రిక యొక్క ప్రామాణికత 6:11
- ధర్మశాస్త్రవాదుల నిజ ఉద్దేశాలు6:12-13
- పౌలు యొక్క ఉద్దేశములు 6:14-17
- ఆశీర్వచనములు 6:18