Select Page

Introduction to ఫిలిప్పీయులకు

ఫిలిప్పి పత్రిక పరిచయము

డా. గ్రాంట్ సి. రిచీసన్
(అనువాదము : డేవిడ్ మరియు జాషువా నల్లపు)

రచయిత: పౌలు, 1:1
వ్రాయబడిన కాలం: క్రీ.శ 62

పౌలు రోమా చెరసాలనుండి వ్రాయుచుండెను.

ఫిలిప్పీలో సంఘ స్థాపన
          పౌలు తన రెండవ సౌవార్తిక ప్రయాణములో ఫిలిప్పీని సందర్శించాడు. తనయొక్క ఈ సందర్శనలో అతడు
          అనేకమందిని క్రీస్తువద్దకు నడిపించాడు వారే సంఘముగా ఏర్పడ్డారు. 

                  వీరిలో కొందరు లూదియా మరియు ఆమె కుటుంబం, ఫిలిప్పీ చెరసాల నాయకుడు, మరియు దయ్యము   పట్టిన చిన్నది (అపో.కా 16:14-34)

ఫిలిప్పీ పట్టణము రోమీయుల పాలన క్రింద ఉన్న ఒక ప్రాంతం. అది ఒక చిన్న రోము వంటిది. ఆది ప్రతి విషయములో రోమును అనుకరించేది. వ్యూహాత్మకముగా అది యూరప్ మరియు ఆసియాల మధ్య ఉన్న ఒక ప్రముఖ వర్తకమార్గములో ఉన్న ప్రదేశము.

మహా అలగ్జాండర్ యొక్క తండ్రియైన మాసిదోనియావాడైన ఫిలిప్పు యొక్క పేరు ఈ పట్టణానికి పెట్టబడింది.

సందర్భం
        పౌలు ఈ పత్రికను వ్రాయడానికి రెండు కారణాలు ఉన్నాయి:

ఫిలిప్పీ పత్రిక ఒక సువార్తికునినుండి సహకరించు ఒక సంఘమునకు ఒక కృతజ్ఞతా వచనం.
ఇద్దరు స్త్రీలమధ్య వివాదము రెండవ కారణము. 4:1-2 లో వారి పేరులు ప్రస్తావించాడు.

ఇతర పత్రికలవలె, చర్చించడానికి విస్తారమైన సిద్ధాంతం లేదు, వాదించడానికి లోపాలు లేవు, సరిచేయడానికి పొరపాట్లు లేవు.

స్వభావం:
       ఫిలిప్పీ సంఘము ఐరోపాలో స్థాపించబదిన మొదటి సంఘము.
       కాబట్టి ఫిలిప్పీ పత్రిక స్వాభావికంగా అన్యులకు సంబంధించినది.
      స్త్రీలు సంఘములో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించారు.

ఐరోపాలో మొదట మార్పుచెందినది ఒక స్త్రీ(లూదియ).
స్త్రీలు హాజరైన కూడికకు పౌలు మొదట హాజరయ్యాడు (అపో.కా 16:12-15).
సంఘములో ఇద్దరు స్త్రీలు ప్రముఖులు(ఫిలిప్పీ 4:2).

ఆర్థిక చేయూతనివ్వడములో ఫిలిప్పీలోని సంఘము ఎంతో ధాతృత్వముగలది (4:10-16).
        ఇచ్చు విషయములో పౌలు వీరిని మాదిరిగా చూపించాడు (2 కొరింథీ 8:1-5)
ఆనందము అనే అంశము ఈ పత్రికలో పలుమార్లుకనిపిస్తుంది (17 సార్లు వివిద రూపములలో).
ఈ పుస్తకము ఒక వ్యాసము కాదు ఒక లేఖ.
ఫిలిప్పీ పత్రిక క్రీస్తుతో నిండియున్నది. 104 వచనాలలో 51 ప్రభువైన యేసు నామాన్ని సూచిస్తున్నాయి.
ఈ పత్రిక పౌలును గూర్చిన వ్యక్తిగత సమాచారము చాలా కలిగియున్నది.
చాలా తక్కువగా పాతనిబంధన ఉపయోగించబడినది.
ఈ పత్రికలో మనసు లేదా వైఖరిని గూర్చిన ముఖ్య ప్రస్తావన ఉన్నది: 1:7; 2:2, 3, 5; 3:15, 19; 4:2, 10

అంశాలు:
       వ్యక్తిగత ఆనందము
       ప్రజలు మనకు ఇచ్చే గౌరవముకాదు, క్రీస్తే మన ఆనందానికి కారణము.
      సంఘములో విభజనలు

నియమావళి: బైబిలులోనికి చేర్చుటకు చాలా బలమైన ఆధారం కలిగియున్నది.

సంక్షిప్త సారాంశము

      సంఘర్షణను అధిగమించి జీవించడంపై పౌలు యొక్క మాదిరి, 1
                  సువార్త సహవాసము, 1:1-11
                 సువార్త విస్తరణ, 1:12-26
                 సువార్త విశ్వాసము, 1:27-30

    స్వయమును అధిగమించి జీవించిన మరో నలుగురి మాదిరి, 2
                క్రీస్తు యొక్క మాదిరి, 2:1-11
                పౌలు యొక్క మాదిరి, 2:12-18
                తిమోతీ యొక్క మాదిరి, 2:19-24
               ఎపఫ్రొదీతు యొక్క మాదిరి 2:25-30

     క్రైస్తవ జీవితము యొక్క ఉద్దేశ్యం క్రీస్తు కేంద్రికృతము, 3
               పూర్వము, 3:1-11
               ప్రస్తుతము, 3:12-16
               రాబోవు కాలము, 3:17-21

       క్రైస్తవ జీవితము యొక్క శక్తి క్రీస్తే, 4
               ఐక్యత యొక్క సాధనము, 4:1-7
               ఐక్యత యొక్క వైఖరి, 4:8-9
              వత్తిడిని భరించుటకు శక్తి, 4:10-13
             నిరాశలో దేవుని అనుగ్రహము, 4:14-23

Share