Select Page

INTRODUCTION TO (ప్రకటన)

 

ప్రకటన గ్రంథము యొక్క పరిచయము

డా. గ్రాంట్ సి. రిచీసన్

(అనువాదము : డేవిడ్ నల్లపు, జాషువా నల్లపు)

 

  1. గ్రంధము యొక్క ప్రాముఖ్యత
  • పరిశుధ్ధ గ్రంధములోని పుస్తకముల సమాహారము
  • ప్రకటన గ్రంధము బైబిలులోని అనేక ప్రవచనాలకు తుది మెరుగును కలిగిస్తుంది
  • ప్రకటన గ్రంధము అంత్యకాల సంఘటనలను సృష్ఠి కొరకైన దేవుని ఉద్దేశమును సంధర్భోచితముగా చేస్తుంది

 

  1. గ్రంధకర్త
  2. జస్టిన్ మార్టిర్, యోహానే గ్రంధకర్త అని నేరుగా నిర్ధారించెను
  3. ఇరేనియస్ (అపో. యోహాను యొక్క శిష్యుడైన, పాలీకార్పు యొక్క శిష్యుడు) యోహానును ప్రకటన రచయితగా తెలిపెను.
  • ఎంతో కాలము క్రితము కాదు, కాని మన సమీప కాలములోనే, డొమినీశియన్ పాలన అంతమునందు.” [డొమినీశియన్ క్రీ. శ. 96లొ మరణించెను, యోహాను అప్పుడు ఎఫెసుకు తిరిగి వెళ్ళుటకు అనుమతించ బడెను.]
  1. యోహానును రచయితగా సమర్ధించువారు :క్లెమెంతు, ఆరిజిన్, తెర్తుల్లియన్, హిప్పోలిటస్
  2. యోహాను పేరు రచయితగా కనిపిస్తుంది : 1:1,4,9; 22:8; (21:2)
  3. ఇరేనియస్, జస్టిన్ మార్టిర్, ఇసేబియస్, అపొల్లోనియస్ మరియు థెయొఫిలస్, అంతియోకు యొక్క బిషప్పు వీరందరు ప్రకటనను దైవావేశ పూరితమైన లేఖన భాగముగా అంగీకరించిరి.
  4. 3వ శతాబ్దముకల్లా ప్రకటన లెఖనభాగముగా ఉఠంకించబడినది.

 

III. వ్రాయబడిన సంధర్భము

  1. సూటియైన ఆఙ్ఞ (1:10-23)
  2. సంఘముల పరిస్తితి
  3. ఘొరమైన హింసా కాలము(రోమా సామ్ర్యజ్యములొ సాధారణమైన విధానము కాదు)
  • ఒక క్రైస్తవుడు అప్పటికే చంపబడెను, 2:13
  1. సంఘములలో క్లిష్టమైన సమస్యలు
  • ఎఫెస్సీ, 2:2
  • స్ముర్న, 2:10
  • పెర్గమ, 2:13
  • తుయతైర, 2:22
  • ఫిలదెల్ఫియ, 3:10

 

  1. వ్రాయబడిన కాలము క్రీ.శ. 96

 

  1. వ్రాయబడిన ప్రాంతముపత్మాసు, ఒక చెర ప్రాంతము(యోహాను చెరలొ ఉంచబడెను)
  • ఎఫెస్సు నుండి 30 మైళ్ళ దురములోని, ఆగియన్ సముద్రములోని ఒక రాతి దీవి
  • 6-8 మైళ్ళ పొడవు మరియు ఒక మైలు వెడల్పు

 

  1. ఉద్దేశము
  2. యేసు క్రీస్తును గురించిన అంతిమ సత్యము గురించి తెలుపుటకు – ఆయన వ్యక్తిత్వము, ప్రభావము, ఉద్ద్దేశమును వెల్లడిచెయుట (1:1)
  3. క్రీస్తు రాజ్యము యొక్క అంతిమ విజయమును చూపుటకు
  4. చరిత్రమీద ఒక నూతన ద్రుక్పధము ఇచ్చుటకు
  5. పరిశుధ్ధ జీవితమునకు ప్రేరణ కలిగించుటకు
  6. దేవుడు అంతిమముగా దుష్టత్వమును తొలగించునని చూపుటకు
  7. భవిష్యత్ సంఘటనల గురించి పూర్వప్రదర్శన ఇచ్చుటకు

 

VII. అంశము:  — యేసు క్రీస్తు ప్రత్యక్షత— 1:1 (1:7; 3:11; 22:30)

  • ప్రకటన క్రీస్తు కేంద్రితము

 

VIII. మూల పదములు:

  • ప్రకటన” [ముసుకు తొలగించుట]
  • గొర్రెపిల్ల” [29 సార్లు]

 

  1. మూల వచనము: 1:19 “కాగా నీవు చూచినవాటిని, ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవువాటిని, …వ్రాయుము.”

 

  1. గ్రహీతలు, 1:11
  2. ఆసియాలోని రోమా పాలనల ప్రాంతములలోఉన్న అన్ని సంఘములు
  3. నేటి సంఘములకు ప్రతినిదులుగా ఎంచబడిన సంఘములకు
  4. నేటి టర్కీ ప్రంతములొని పశ్చిమము
  5. యోహాను ఎఫెస్సునకు క్రీ. శ. 67-70 ప్రాంతములొ వచ్చెను (ఎఫెస్సు, ఆసియాలొని రోమా ప్రాంతపు రాజధాని పట్టనము )

 

  1. ప్రకటనను సరియైన రీతిలో గ్రహించుటకు కారణములు
  2. అది ఒక “ప్రత్యక్షత” (ఆవిష్కరణము) అనగా ముసుకు తొలగించుట

(దాచబడిన మర్మయుక్తమైన పుస్తకము అను భావన కాదు )

  1. ప్రకటన ముద్రివేయబడిన పుస్తకము కాదు (22:10)
  2. ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. (1:3)
  3. చివరిగా, ఈ గ్రంధము యొక్క విశ్లెశణ సరళమైనది (1:19)

 

XII. వేదాంతము – క్రీస్తు పూరితము (1:1-3; 5:47; 19:11,16, 17; 21:9)

  1. క్రీస్తు యొక్క వ్యక్తిత్వముఒకటవ అధ్యాయము
  2. క్రీస్తు యొక్క మహిమగల పరిపాలన (అపవాదిపై సంపూర్ణ విజయము)

 

XIII. పుస్తకము యొక్క వెల్లడిచెయు స్వభావము

  1. ప్రత్యక్షపరచు పుస్తకము భవిష్యత్తును వెల్లడిచేస్తుంది
  2. అపోకలిసిస్ముసుకు తొలగించుట; ప్రకటన గ్రహించుకొనుట కొరకు వ్రాయబడినది
  3. ఈ పుస్తకమంతటా ప్రతీకాత్మకత (చిహ్నములు) కనిపిస్తుంది పాతనిబంధకు సంబంధించి దాదాపుగా 400 సుచనలు
  4. దానియేలు, యెహెజ్కేలు శైలికి సమముగా

 

XIV. ఇతర విషయములు

  1. ప్రకటన గ్రంధము లేఖనములకు మూలరాయి వంటిది
  2. ప్రకటన గ్రంధము క్రొత్త నిబంధనలోని ఒకేఒక్క ప్రవచనాత్మక గ్రంధము
  3. ప్రకటన గ్రంధము దనియేలు గ్రంధముతో పొల్చదగిన వైఖరులు కలిగిఉన్నది
  4. ప్రకటన గ్రంధము మాత్రమే పాఠకులకు ఆశీర్వాదమును వాగ్ధానము చేయు ఏకైక గ్రంధము (1:3)
  5. 22 ఆధ్యాయములు, 404 వచనములు మరియు 12,000 పదములు (ఆంగ్లములొ) కలిగిఉన్నది
  6. 285 వచనములు పాతనిబంధన భాషను కలిగిఉన్నది
  7. 70 వచనములు దూతలకు సంబంధించినది
  8. పాతనిబంధన యొక్క వచనములు ఉదాహరించబడలేదు
  9. పాతనిబంధనలోని దానియేలు గ్రంధమునకు అనుగుణముగా ఉన్నది
  10. ఏడు ధన్యతలు : 1:3; 14:13; 16:15; 19:9; 20:6; 22:7,14
  11. గ్రంధము యొక్క కాలనుక్రమ నిర్మాణము ప్రవచనాత్మక కార్యక్రమమును తెలుపుతుంది (1:19)
  12. గ్రంధము యొక్క సగభాగము మహాశ్రమను గూర్చి వివరిస్తుంది
  13. ఏడు అను సంఖ్య గ్రంధమంతట పలుమార్లు ప్రస్తావించబడును
  14. ప్రవచనము భ్జవిష్యత్తు యొక్క పుర్వవీక్షణము
  15. ప్రకటన గ్రహించబడుటకు వీలుగా వ్రాయబడెను
  16. గ్రంధము యొక్క ప్రతీకాత్మకత గ్రంధముయొక్క తాత్పర్యమునకు మూలమును కలిగించును
  17. ప్రకటన క్రూడీకరించు గ్రంధము

 

  1. తత్పర్యములు
  2. రూపక కోణము
  3. నిర్వచనం:ప్రకటన గ్రంధము విస్త్రుతమైన రూపక అలంకార భాషను కలిగిఉన్నది
  4. మంచి చెడుల మధ్య పోరాటమునకు ప్రతీక చిత్రముగా ఉన్నది
  5. అలెక్సెంద్రియ పాఠశాలలో ఆరంభమైనది (అలక్సాండ్రియలోని క్లెమెంతు, మూలము)
  6. సాధారణ ప్రతీకాత్మకతను మించి ఉండును
  7. అగస్టీను, జెరోమును ప్రభావితము చేసెను
  8. సమస్య : మరింత ఆత్మాశ్రయము

 

  1. ప్రెటెరిస్టు కోణము
  2. నిర్వచనము: లాటిన్ భాషలో “”గతముప్రకటన ఆది సంఘ కాలములోనే నెరవేర్చబడెను (కాన్సన్టైన్ కాలములో క్రీ. శ. 312).
  3. మొదటి శతాబ్దపు చారిత్రిక చిహ్నము
  4. సమస్య : నిర్ధిష్టమైన సూచనలను విస్మరిస్తుంది (1:3, 19; 22:18,19); చిహ్నములకు నిరంకుశమైన భావనలను ఇస్తుంది

 

  1. చారిత్రిక కోణము
  2. నిర్వచనము: ప్రకటన గ్రంధము క్రీస్తు యొక్క మొదటి మరియు రెండవ రాక మధ్యగల సంఘము యొక్క చరిత్రను చూపించు ప్రతీక .
  3. ప్రపంచము మరింత మెరుగుగా సాగుతున్నది, మరియు దేవుని రాజ్యమునకు దారి తీయును అని న్మమ్ము అనేక సహస్రాబ్ది అనంతరులు దీనిని చెపట్టుదురు.
  4. సమస్య:ఏ లేఖన భాగము ఏ సంఘటనను సూచించును అని ఏ ఇద్దరు వ్యాఖ్యాతలు ఏకాభిప్రాయము కలిగి ఉండరు. ప్రతి ఒక్కరు తమ తరములో ఆ లేఖన భాగము నెరవెరుటను కనుగొందురు.

 

  1. భవిశ్యత్ కోణము
  2. సంప్రదాయవాద పండితులకే పరిమితము
  3. ప్రవచనము యొక్క ప్రతీకాత్మకతను గుర్తిస్తూ అక్షరార్ధ (సాధారణ) వ్యాఖ్యానమును అనుమతించును
  4. భవిష్యత్తు యొక్క ప్రాముఖ్యమైన సంఘటనల నెరవేర్పు యొక్క స్పష్టమైన గ్రహింపును అందిస్తుంది
  5. గ్రంధనిర్మాణము కాలక్రమమును పరిబ్రమిస్తుంది:· 1-3, సంఘ కాలము;4-22, భవిష్యత్తులోని సంఘటనలు
  6. అభ్యంతరముఈ కోణమును వ్యతిరేకించువారు ఇది అత్యంత భవిశ్యత్తుకు చెందినదైతే, ప్రకటన ఆదరణ కలిగించదు అని చెబుతారు.

 

XVI. సంగ్రహము

పరిచయము, 1:1-8

తొలిపలుకు, 1:1-32.

వందనవచనము, 1:4-8

  1. నీవు చూచిన సంగతులు(మొదటి అధ్యాయము)
  • మహిమ పరచబడిన క్రీస్తు, 1:9-20
  1. జరుగుచున్న సంఘటనలు(రెండు, మూడు అధ్యాయాలు)
  • సంఘములకు ఏడు వర్తమానములు, 2:1-3:22

III. రానైయున్న సంగతులు (4:1-22:5)

  1. పరలోకపు సింహాసనము యెదుటి సంఘము, 4
  2. మహాశ్రమలను గూర్చిన ఏడు ముద్రలుగల గ్రంధపు చుట్ట, 5
  3. శ్రమలు, 6:1-18:24
  4. గొర్రెపిల్ల వివాహమహోత్సవము, 19:1-10
  5. రెండవ రాకడ, 19:11-21
  6. వెయ్యేండ్ల పరిపాలన, 20
  7. నూతన ఆకాశము మరియు నూతన భూమి, 21:1-22:5

 

సారంశము, 22:6-21

  1. తుదిపలుకులు, 22:6-20
  2. ఆశీర్వచనము, 22:21

 

Share